ఉడకబెట్టేటప్పుడు గుడ్లు పగలకుండా ఉండాలంటే.. ఈ చిట్కాలు పాటించండి..
గుడ్లను ఫ్రిజ్‌లో పెట్టడం సాధారణంగా అందరూ చేస్తుంటారు. కానీ మీరు, వాటిని ఫ్రిజ్‌లోంచి నేరుగా నీటిలో పెట్టి ఉడకబెట్టినట్లయితే, అవి ఖచ్చితంగా పగిలిపోతాయి.. అందువల్ల మీరు ముందుగా ఫ్రిజ్‌లోంచి గుడ్లు బయటకు తీసుకుని 10 లేదా 15 నిమిషాలు గది ఉష్ణోగ్రత్త వద్ద ఉంచాలి. అప్పుడు ఉష్ణోగ్రత సాధారణం అవుతుంది. ఆ తర్వాత ఉడకబెడితే మంచిది.
ఉడకబెట్టిన గుడ్లు తినడం, వాటితో ఆమ్లెట్ చేయడం వంటివి అందరూ చేసే వంట పద్దతులు. కరోనా అనంతరం.. చాలా మంది ఇళ్లలో అల్పాహారం కోసం గుడ్లు తినడం అలవాటుగా మార్చుకున్నారు. బ్రేక్‌ఫాస్ట్‌లో బాయిల్డ్ ఎగ్స్ తినటం రోగనిరోదక వ్యవస్థకు, మంచి ఆరోగ్యానికి మూలంగా పరిగణిస్తారు. గుడ్లు మన శరీరానికి ఎంత మేలు చేస్తుందో మనందరికీ తెలుసు. గుడ్లు చాలా ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంటాయి. వైద్యులు కూడా రోజుకు ఒకటి లేదా రెండు గుడ్లు తినాలని సిఫార్సు చేస్తారు. అయితే, గుడ్లు ఉడకబెట్టడంలో చాలా మంది చిన్న చిన్న తప్పులు చేస్తారు.. ఈ కారణంగా, వాటిని నీటిలో ఉంచిన వెంటనే పగిలిపోతుంటాయి..అయితే, ఉడకబెడుతున్నప్పుడు గుడ్లు పగల కుండా ఉండాలంటే.. ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఈ చిట్కాలను పాటించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు.
మీరు రెండు గుడ్లు ఉడకబెట్టాలనుకుంటే, దీని కోసం ముందుగా ఒక పెద్ద గిన్నెను తీసుకోవాలి. పెద్ద గిన్నెలో ఉడకబెట్టేటప్పుడు గుడ్లు ఒకదానికొకటి తగల కుండా ఉంటాయి. అవి పగిలిపోకుండా చేస్తుంది.
చాలా సార్లు ప్రజలు గుడ్లను ఉడకబెట్టిన తర్వాత వాటిని సరిగ్గా తొక్కలేరు. అందుకోసం,.. గుడ్లు ఉడకబెట్టిన నీటిలో ఉప్పు కలపండి. ఉప్పు నీటిలో గుడ్లను ఉడకబెట్టడం వల్ల వాటి తొక్కతీయటం సులభం అవుతుంది.
గుడ్లను ఫ్రిజ్‌లో పెట్టడం సాధారణంగా అందరూ చేస్తుంటారు. కానీ మీరు, వాటిని ఫ్రిజ్‌లోంచి నేరుగా నీటిలో పెట్టి ఉడకబెట్టినట్లయితే, అవి ఖచ్చితంగా పగిలిపోతాయి.. అందువల్ల మీరు ముందుగా ఫ్రిజ్‌లోంచి గుడ్లు బయటకు తీసుకుని 10 లేదా 15 నిమిషాలు గది ఉష్ణోగ్రత్త వద్ద ఉంచాలి. అప్పుడు ఉష్ణోగ్రత సాధారణం అవుతుంది. ఆ తర్వాత ఉడకబెడితే మంచిది.
అలాగే కోడిగుడ్లను ఉడకబెట్టేటప్పుడు మంట ఎక్కువగా పెట్టకూడదు.. గుడ్లు ఎప్పుడూ మీడియం మంట మీద ఉడకబెట్టాలి. ఇలా చేస్తే గుడ్లు పగల కుండా ఉంటాయి. పైగా పొట్టు కూడా ఈజీగా వచ్చేస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..