Telangana: నగర శివారులో క్యాన్సర్‌కు నకిలీ మందులు..! దర్జాగా తయారీ.. మార్కెట్లో సరఫరా
క్యాన్సర్ మందులకు నకిలీలను తయారు చేసి మార్కెట్‌లో విక్రయిస్తున్నారనే సమాచారంతో డ్రగ్ కంట్రోల్ అధికారులు అప్రమత్తమయ్యారు. డీజీ కమలాసన్ రెడ్డి ఆదేశాలతో నిఘా పెట్టారు. పోస్టల్‌లో, కొరియర్‌లో నకిలీ మందులను సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. ఇన్వాయిస్ ఆధారంగా కూపీలాగితే అల్వాల్‌లో అడ్రస్ తేలింది. కానీ ఎంక్వైరీలో అది తప్పుడు అడ్రస్ అని గుర్తించారు. నకిలీ డ్రగ్ స్టాక్ డెలివరీ చేస్తున్న కొరియర్ బాయ్‌ని డీసీఏ అధికారులు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకొని ఆరాతీస్తే..డొంక కదిలింది.
మహానగరంలో మాయగాళ్లు. అడ్డదారిలో కోట్లు దండుకునేందుకు ఏకంగా క్యాన్సర్ మెడిసిన్ కల్తీ దందా మొదలుపెట్టారు. ఫార్మా కంపెనీ ముసుగులో సాగుతోన్న భారీ నకిలీ మందుల తయారీ రాకెట్‌కు డ్రగ్ కంట్రోల్ అధికారులు చెక్ పెట్టారు. పక్కా నిఘా పెట్టి ఆస్ట్రికా హెల్త్‌కేర్ గుట్టును రట్టు చేశారు. బొల్లారంలోని ఆస్ట్రికా హెల్త్‌కేర్‌లో కంపెనీల్లో ఆకస్మిక తనిఖీలు చేపడితే… నకిలీ యవ్వారం బయటపడింది. దాదాపు నాలుగున్నర కోట్ల విలువైన నకిలీ మందులను సీజ్ చేశారు అధికారులు. బొల్లారం సహా, కీసర, నాచారం, మేడ్చల్‌లోని అస్ట్రికా అనుబంధ కంపెనీల్లోనూ సోదాలు నిర్వహించారు.
క్యాన్సర్ మందులకు నకిలీలను తయారు చేసి మార్కెట్‌లో విక్రయిస్తున్నారనే సమాచారంతో డ్రగ్ కంట్రోల్ అధికారులు అప్రమత్తమయ్యారు. డీజీ కమలాసన్ రెడ్డి ఆదేశాలతో నిఘా పెట్టారు. పోస్టల్‌లో, కొరియర్‌లో నకిలీ మందులను సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. ఇన్వాయిస్ ఆధారంగా కూపీలాగితే అల్వాల్‌లో అడ్రస్ తేలింది. కానీ ఎంక్వైరీలో అది తప్పుడు అడ్రస్ అని గుర్తించారు. నకిలీ డ్రగ్ స్టాక్ డెలివరీ చేస్తున్న కొరియర్ బాయ్‌ని డీసీఏ అధికారులు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకొని ఆరాతీస్తే..డొంక కదిలింది.
సోదాల్లో నాలుగున్నర కోట్ల విలువ చేసే నకిలీ మెడిసన్‌ను సీజ్ చేశారు.. ఆస్ట్రా జెనెరిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆస్ట్రికా హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ మీడియన్ బయోటెక్ ప్రైవేట్, అలయన్స్ బయోటెక్, సన్‌వెట్ హెల్త్‌కేర్, సాలస్ ఫార్మాస్యూటికల్స్, DM ఫార్మా ప్రైవేట్. లిమిటెడ్, సేఫ్ పేరెంటరల్స్ ప్రైవేట్. లిమిటెడ్, Bless Pharma India Pvt. లిమిటెడ్ పేరుతో లేబుల్స్ ఉన్న మెడిసిన్స్ పట్టుబడ్డాయి. వీటిలో హిమాచల్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కంపెనీలున్నాయి. సదరు కంపెనీల్లో చాలా వాటికి లైసెన్స్ రద్దు చేయబడింది. ఐనా యధేచ్చగా నకిలీలు తయారు చేస్తున్నాయి.
నకిలీ మందుల రాకెట్‌ను బ్రేక్ చేసిన డ్రగ్ కంట్రోల్ అధికారులు, సిబ్బందిని అభినందించారు డీజీ కమలాసన్ రెడ్డి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. వీటి వెనుక ఎవరి హస్తం వుంది..? ఎన్నాళ్లుగా ఈ దందా సాగుతుందో సమగ్ర విచారణ కొనసాగుతుందన్నారు. పరారీలో ఉన్న అస్ట్రికా డైరెక్టర్‌ను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామన్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..