- Telugu News Photo Gallery Instead of benefits more turmeric can cause harm we tell you how Telugu News
Side Effects Of Turmeric : పసుపు ఎక్కువగా తింటున్నారా?.. అయితే మీకు ఈ సమస్యలు తప్పవు..
పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆరోగ్య సంబంధిత సమస్యలకు ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది. శరీరం నుండి ఆక్సీకరణ ఒత్తిడి, వాపును తొలగించడానికి పసుపు ఉత్తమమైనది. కీళ్లనొప్పులు వంటి దీర్ఘకాలిక సమస్యలకు పసుపు బెస్ట్ హోం రెమిడీగా చెబుతారు.. అయితే ఆహారంలో పసుపును ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా అనేక నష్టాలు ఉంటాయని మీకు తెలుసా? దాని దుష్ప్రభావాల గురించి తెలుసుకుందాం.
Updated on: Dec 06, 2023 | 11:54 AM

కడుపు సమస్యలు.. పసుపు కొన్నిసార్లు కడుపుకు హానికరం. పసుపును ఆహారంలో ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే, అది కడుపు నొప్పి, మలబద్ధకం కలిగిస్తుంది. కడుపులో మంట, వాపు, తిమ్మిరి సమస్య తలెత్తుతుంది. ర్పడుతుంది. అంతే కాదు పసుపును ఎక్కువగా తినడం వల్ల కూడా పిత్తాశయ రాళ్లు ఏర్పడతాయి.

మూత్రపిండాల్లో రాళ్లు.. మూత్రంలో రాళ్లు వంటి వ్యాధులు ఉన్నవారికి పసుపు చాలా హానికరం. ఇందులో ఉండే ఆక్సలేట్‌లు కిడ్నీలో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతాయి. కాబట్టి మూత్రంలో రాళ్లు ఉన్న రోగులు పసుపు తీసుకోవడం తగ్గించాలి లేదా దానిని ఉపయోగించే ముందు వైద్యుడిని సంప్రదించాలి.

వికారం, అతిసారం.. పసుపులో కర్కుమిన్ ఉంటుంది. మీరు పెద్ద మొత్తంలో పసుపును తీసుకుంటే, మీకు వికారం, విరేచనాలతో సమస్యలు ఉండవచ్చు.

అలెర్జీ.. పసుపు చర్మానికి, ఆరోగ్యానికి ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. కానీ, మీరు పసుపును ఎక్కువగా తీసుకుంటే, అది హానికరం అవుతుంది. పసుపును ఎక్కువగా తీసుకోవడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. చర్మంపై దద్దుర్లు వస్తాయి. ఇది చర్మంతో పాటు శరీరం లోపల కూడా అలర్జీని కలిగిస్తుంది

మధుమేహ వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలి.. మధుమేహ వ్యాధిగ్రస్తులకు పసుపు హానికరం. తరచుగా వారి రక్తం ఇలా మందంగా మారుతుంది. పసుపు రక్తం పల్చగా పనిచేస్తుంది. డయాబెటిక్ పేషెంట్లు పసుపు తీసుకోకుండా ఉండాలి. అంతే కాకుండా ముక్కుపుటతో బాధపడేవారు పసుపును ఎక్కువగా తీసుకోకూడదు. పసుపు రక్తం గడ్డకట్టే ప్రక్రియను నెమ్మదిస్తుంది.





























