- Telugu News Photo Gallery Do you heat these foods in the microwave? Do not do that at all, check here is details
Kitchen Hacks: మైక్రోవేవ్ లో ఈ ఆహారలను వేడి చేస్తున్నారా.. అలా అస్సలు చేయకండి!
ఎలక్ట్రానిక్ వస్తువులు వచ్చాక మనిషికి చాలా వరకు పని చేసే శ్రమ తగ్గింది. వంటింట్లో ఉండే ఎలక్ట్రానిక్ వస్తువుల్లో మైక్రోవేవ్ కూడా ఒకటి. ఈ మైక్రోవేవ్ కూడా దాదాపు అందరి ఇళ్లల్లో ఉంటుంది. మైక్రో వేవ్ వచ్చిన తర్వాత ఆహారాలను గ్యాస్ స్టవ్ పై కాకుండా.. ఇందులో క్షణాల్లోనే వేడెక్కుతున్నాయి. టైమ్ కూడా సేవ్ అవుతుంది. అందుకే చాలా మంది వీటిని వినియోగిస్తూ ఉంటారు. మైక్రో వేవ్ లో రక రకాల ఫుడ్స్ ని వేడి చేసుకోవచ్చు. అయితే కొన్ని రకాలా ఆహార పదార్థాలను వేడి చేయకూడదని..
Chinni Enni | Edited By: Ravi Kiran
Updated on: Dec 06, 2023 | 10:55 PM

ఎలక్ట్రానిక్ వస్తువులు వచ్చాక మనిషికి చాలా వరకు పని చేసే శ్రమ తగ్గింది. వంటింట్లో ఉండే ఎలక్ట్రానిక్ వస్తువుల్లో మైక్రోవేవ్ కూడా ఒకటి. ఈ మైక్రోవేవ్ కూడా దాదాపు అందరి ఇళ్లల్లో ఉంటుంది. మైక్రో వేవ్ వచ్చిన తర్వాత ఆహారాలను గ్యాస్ స్టవ్ పై కాకుండా.. ఇందులో క్షణాల్లోనే వేడెక్కుతున్నాయి. టైమ్ కూడా సేవ్ అవుతుంది. అందుకే చాలా మంది వీటిని వినియోగిస్తూ ఉంటారు. మైక్రో వేవ్ లో రక రకాల ఫుడ్స్ ని వేడి చేసుకోవచ్చు. అయితే కొన్ని రకాలా ఆహార పదార్థాలను వేడి చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

చాలా మంది మాంసం చెడి పోకుండా ఉండటం కోసం ఫ్రీజర్ లో స్టోర్ చేస్తూ ఉంటారు. అయితే ఇలా ఫ్రీజ్ చేసిన మాంసాన్ని ఓవెన్ లో హీట్ చేయడం కానీ.. వడటం కానీ చేయ కూడదట. ఎందుకంటే ఓవెన్ లో మాంసం అనేది సరిగ్గా వేడెక్కదు. దీంతో బ్యాక్టీరియా వృద్ధి చెంది అనారోగ్య సమస్యల తలెత్తే అవకాశాలు ఉన్నాయి.

అన్నాన్ని కూడా ఓవెన్ లో హీట్ చేయడం కానీ, వండటం కానీ చేయకూడదు. అన్నాన్ని ఓవెన్ లో హీట్ చేయడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గ్యాస్, అజీర్తి, కడుపులో నొప్పి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రావచ్చు.

పుట్ట గొడుగులను కూడా మైక్రో వేవ్ లో అస్సలు వేడి చేయకూడదు. ఇలా చేయడం వల్ల అందులో ఉన్న పోషకాలు నాశనం అవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మైక్రో వేవ్ లో ఉండే ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్ కారణంగా.. మష్రూమ్స్ లోని పోషకాలు పోతాయి.

చాలా మంది కోడి గుడ్లను కూడా ఓవెన్ లో ఉడికిస్తూ ఉంటారు. ఇలా అస్సలు చేయకూడదని నిపుణులు అంటున్నారు. కోడిగుడ్లను ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉడికించినప్పుడు వాటిలో ఉండే పోషకాలు నశిస్తాయి.





























