Laziness in Winter: రోజంతా అలసటగా, నీరసంగా అనిపిస్తోందా? తక్షణ శక్తి అందాలంటే ఇలా చేయండి
సాధారణంగా చలికాలంలో పగటి కాలం తక్కువగా ఉంటుంది. పైగా సూర్యకాంతి పరిమాణం కూడా తగ్గుతుంది. ఇది మన శరీర సిర్కాడియన్ రిథమ్‌కు అంతరాయం కలిగిస్తుంది. శరీర సిర్కాడియన్ రిథమ్‌లో హెచ్చుతగ్గులు ఏర్పడితే నీరసంగా, శక్తి లేమిగా అనిపిస్తుంది. దీనితో పాటు, సూర్యరశ్మి తక్కువగా ఉండటం వల్ల మన శరీరంలో విటమిన్ డి పరిమాణం తగ్గడం ప్రారంభమవుతుంది. శరీరంలో విటమిన్ డి తక్కువ స్థాయిలో ఉండటం వల్ల, అలసట, మానసిక స్థితి సరిగ్గాలేకపోవడం వంటి సమస్యలు వస్తుంటాయి. చలికాలంలో కొంతమంది..

సాధారణంగా చలికాలంలో పగటి కాలం తక్కువగా ఉంటుంది. పైగా సూర్యకాంతి పరిమాణం కూడా తగ్గుతుంది. ఇది మన శరీర సిర్కాడియన్ రిథమ్‌కు అంతరాయం కలిగిస్తుంది. శరీర సిర్కాడియన్ రిథమ్‌లో హెచ్చుతగ్గులు ఏర్పడితే నీరసంగా, శక్తి లేమిగా అనిపిస్తుంది. దీనితో పాటు, సూర్యరశ్మి తక్కువగా ఉండటం వల్ల మన శరీరంలో విటమిన్ డి పరిమాణం తగ్గడం ప్రారంభమవుతుంది. శరీరంలో విటమిన్ డి తక్కువ స్థాయిలో ఉండటం వల్ల, అలసట, మానసిక స్థితి సరిగ్గాలేకపోవడం వంటి సమస్యలు వస్తుంటాయి. చలికాలంలో కొంతమంది ఈ విధమైన సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్‌తో బాధపడుతుంటారు. ఈ సమస్య వచ్చినప్పుడు, వ్యక్తుల శక్తి స్థాయిలు కూడా గణనీయంగా తగ్గుతాయి.
దానికి తోడు చలి వాతావరణం మూడ్‌ని డల్ చేస్తుంది. దీని కారణంగా ఎక్కువగా ఇంట్లోనే ఉండటానికి ఇష్టపడతారు. బయటికి వెళ్లడానికి అంతగా ఆసక్తి చూపరు. అయితే, ఈ సీజన్‌లో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్యలన్నింటినీ దూరం చేసుకోవచ్చు. డైట్‌లో కొన్నింటిని చేర్చుకోవడం వల్ల ఎనర్జీ లెవెల్స్‌ని పెంచి, మంచి మూడ్‌లో ఉంచుకోవచ్చు. విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. చలికాలంలో అలసట, నీరసం వంటివి ఎదురైతే ఎలాంటి ఆహారం తీసుకోవాలో నిపుణుల మాటల్లో మీ కోసం..
బ్లూబెర్రీ
యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు సమృద్ధిగా ఉన్న బ్లూబెర్రీస్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. తద్వారా శరీరంలో శక్తి స్థాయిలను పెంచుతాయి. కాబట్టి బ్లూబెర్రీస్‌ని వింటర్ డైట్‌లో చేర్చుకోవడం వల్ల అలసట, నీరసాన్ని దూరం చేయడంలో చాలా సహాయపడుతుంది. ఐరన్ పుష్కలంగా, శరీరం అంతటా ఆక్సిజన్‌ను అందించడంలో పాలకూర సహాయపడుతుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. అలసట నుంచి ఉపశమనం లభిస్తుంది.
చియా విత్తనాలు
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ప్రొటీన్లలో పుష్కలంగా ఉండే చియా సీడ్స్ శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను మెయింటైన్ చేయడంలో సహాయపడతాయి. తద్వారా చక్కెర స్థాయిలు తక్కువగా ఉండటానికి సహాయపడతాయి. రోజంతా శక్తివంతంగా ఉంచుతుంది.
సాల్మన్
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ డి సమృద్ధిగా ఉన్న సాల్మన్ మెదడు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. సెరోటోనిన్ స్థాయిలను పెంచుతుంది. నిద్రను నియంత్రిస్తుంది.
పెరుగు
ప్రొటీన్ పుష్కలంగా ఉండే పెరుగు రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరిస్తుంది. జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. శరీరానికి శక్తిని అందిస్తుంది.
చిలగడదుంప
ఇందులో ఫైబర్, కార్బోహైడ్రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలోని శక్తి ఒక్కసారిగా విడుదల కాకుండా క్రమంగా విడుదలవుతుంది. ఇది సోమరితనాన్ని నివారించడానికి సహాయపడుతుంది.
బాదం
బాదంలో మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో ఎనర్జీ లెవెల్‌ని పెంచి, అలసట నుంచి ఉపశమనం లభిస్తుంది.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి.