Subbalakshmi: కేవలం 35 యేళ్లకే పళ్లు పోగొట్టుకున్న నటి సుబ్బలక్ష్మి.. ఎందుకో తెలుసా

మలయాళీ నటి, సంగీత విద్వాంసురాలు సుబ్బలక్ష్మి కన్నుమూసిన సంగతి తెలిసిందే. అమ్మమ్మ పాత్రలతో ప్రేక్షకులను అలరించిన సుబ్బలక్ష్మి వృద్ధాప్య సంబంధిత సమస్యలతో తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సుబ్బలక్ష్మి 2002లో రంజిత్ చిత్రం నందనంలో వేషమణియమ్మ పాత్ర పోషించడం ద్వారా 69 ఏళ్ల వయసులో సినీ రంగంలోకి వచ్చారు. తర్వాత వరుసగా సుబ్బలక్ష్మి మలయాళంలో ఎన్నో పాత్రల్లో పోషించారు..

Srilakshmi C

|

Updated on: Dec 06, 2023 | 7:49 PM

 మలయాళీ నటి, సంగీత విద్వాంసురాలు సుబ్బలక్ష్మి కన్నుమూసిన సంగతి తెలిసిందే. అమ్మమ్మ పాత్రలతో ప్రేక్షకులను అలరించిన సుబ్బలక్ష్మి వృద్ధాప్య సంబంధిత సమస్యలతో తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సుబ్బలక్ష్మి 2002లో రంజిత్ చిత్రం నందనంలో వేషమణియమ్మ పాత్ర పోషించడం ద్వారా 69 ఏళ్ల వయసులో సినీ రంగంలోకి వచ్చారు. తర్వాత వరుసగా సుబ్బలక్ష్మి మలయాళంలో ఎన్నో పాత్రల్లో పోషించారు.

1 / 5
సుబ్బలక్ష్మి గుర్తొచ్చినప్పుడల్లా ప్రతి సినీ ప్రియునికి దంతాలు లేని బోసినవ్వు గుర్తుకు వస్తుంది. నిజానికి సుబ్బలక్ష్మికి వృద్ధాప్యంలో కాకుండా 35 ఏళ్ల వయసులోనే ఓ ప్రమాదంలో పళ్లు పోగొట్టుకున్నారు.

2 / 5
తిరువనంతపురంకు చెందిన సుబ్బలక్ష్మి చిన్నతనంలో సంగీత సాధన చేసేవారు. ఆమె జవహర్ బాలభవన్‌లో సుమారు 27 ఏళ్లపాటు సంగీత ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. 1951లో ఆల్ ఇండియా రేడియోలో పని చేయడం ప్రారంభించాడు. సుబ్బలక్ష్మి దక్షిణ భారతదేశంలో ఆల్ ఇండియా రేడియోలో పనిచేసిన మొదటి మహిళా సంగీత విద్వాంసకురాలు. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత హార్లిక్స్ ప్రకటన ద్వారా కెమెరా ముందుకు వచ్చారు. నర్తకి,నటి అయిన తన కుమార్తె తారకళ్యాణ్‌తో కలిసి టెలివిజన్ సిరీస్ సెట్స్‌కు వచ్చినప్పుడు నటుడు సిద్ధిక్‌ను కలిశాడు. సిద్ధిక్ ద్వారానే 'నందనం' సినిమాలో తొలిసారి నటించారు.

3 / 5
సుబ్బలక్ష్మి సంగీత కుటుంబంలో జన్మించారు. ఆమె 1936లో తిరునెల్వేలిలో రామభద్ర, రామలక్ష్మి దంపతులకు కుమార్తెగా జన్మించింది. సుబ్బలక్ష్మి తల్లి 28వ ఏట మరణించింది. అప్పటికి సుబ్బలక్ష్మి వయసు పదకొండేళ్లు. ఇద్దరు సోదరులు ఉన్నారు. సుబ్బలక్ష్మి తన చిన్నతనం ఒంటరితనం, కష్టాల గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆమె కుటుంబంలో 30 మంది గాయకులు ఉన్నారు. దాంతో సుబ్బలక్ష్మి కూడా అటువైపు వెళ్లింది. అయితే నటి కావాలనే కోరిక ఉండేది. ఆ కోరిక నెరవేరేందుకు సుబ్బలక్ష్మికి 69 ఏళ్లు పట్టింది.సినిమాలతో పాటు కొన్ని టెలిఫిల్మ్‌లు, ఆల్బమ్‌లు, సీరియల్స్‌లో సుబ్బలక్ష్మి నటించారు.

4 / 5
సుబ్బలక్ష్మి CID మూసా, సౌండ్ తోమా, గ్లూగం, పండిపడ, కూతరా, ప్రణయ కథ, సీతా కళ్యాణం, వన్, రాణి పద్మినితో సహా 70కి పైగా మలయాళ చిత్రాల్లో నటించారు.  ఇతర విదేశీ భాషా చిత్రాలు కళ్యాణ రాముడు, ఏ మాయ చేసావే, ఒక దీవానా తా, దిల్బేచారా, రామన్ పీకియ సీతై, హౌస్ ఓనర్, మృగం, హోగనాసు, మధురమితం వంటి హిందీ, తెలుగు, కన్నడ, తమిళం, సంస్కృతం, ఆంగ్ల భాషల్లో కూడా నటించారు.

5 / 5
Follow us