Beggar: జేబుల నిండా లక్షల డబ్బులున్నా ఆకలితో బిక్షగాడు మృతి.. పోలీసుల బుర్రలో వేల అనుమానాలు

అతనెవరో ఈ ప్రపంచానికి తెలియదు కాని అతని మరణం మాత్రం పోలీసులకు అనేక ప్రశ్నలను మిగిల్చింది. 50 ఏళ్ల వయస్సు ఉన్న ఓ యాచకుడి వద్ద లక్షల నగదు ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. దాదాపు రూ.1.14 లక్షల నగదు అతని వద్ద లభ్యమైంది. చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో చేరిన ఆ వృద్ధుడు.. చికిత్స ప్రారంభించిన కాసేపటికే కన్నుమూశాడు. పోస్టుమార్టం నివేదికలో 'ఆకలి' అతని చావుకు కారణమని అధికారులు తెలిపారు. అంత డబ్బు ఉన్న ఆకలితో ఎందుకు చనిపోయాడు? అతనికి ఆ డబ్బు ఎలా..

Beggar: జేబుల నిండా లక్షల డబ్బులున్నా ఆకలితో బిక్షగాడు మృతి.. పోలీసుల బుర్రలో వేల అనుమానాలు
Beggar Died In Gujarat
Follow us

|

Updated on: Dec 05, 2023 | 3:27 PM

సూరత్‌, డిసెంబర్‌ 5: అతనెవరో ఈ ప్రపంచానికి తెలియదు కాని అతని మరణం మాత్రం పోలీసులకు అనేక ప్రశ్నలను మిగిల్చింది. 50 ఏళ్ల వయస్సు ఉన్న ఓ యాచకుడి వద్ద లక్షల నగదు ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. దాదాపు రూ.1.14 లక్షల నగదు అతని వద్ద లభ్యమైంది. చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో చేరిన ఆ వృద్ధుడు.. చికిత్స ప్రారంభించిన కాసేపటికే కన్నుమూశాడు. పోస్టుమార్టం నివేదికలో ‘ఆకలి’ అతని చావుకు కారణమని అధికారులు తెలిపారు. అంత డబ్బు ఉన్న ఆకలితో ఎందుకు చనిపోయాడు? అతనికి ఆ డబ్బు ఎలా వచ్చింది? వంటి ఎన్నో ప్రశ్నలు పోలీసుల బుర్రలను తొలుస్తున్నాయి. వల్సాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

గాంధీ లైబ్రరీ సమీపంలోని రోడ్డు పక్కన గత రెండు రోజులుగా అదే స్థలంలో బిచ్చగాడు పడి ఉండటాన్ని ఓ దుకాణం యజమాని గమనించాడు. దీంతో అతను 108కి డయల్ చేసి ఆ వృద్ధుడిని ఆసుపత్రికి తరలించాడు. వృద్ధుడికి సృహరాగానే ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ భవేష్ పటేల్ అతని వద్దకు వెళ్లి మాట్లాడారు. ప్రాథమిక పరీక్షల అనంతరం చికిత్స నిమిత్తం సివిల్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ బిచ్చగాడు చనిపోయాడు. రోజుల తరబడి ఆకలితో అలమటించడం మూలంగా వృద్ధుడు మరణించినట్లు వల్సాద్ సివిల్ హాస్పిటల్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. వ్యక్తి మృతితో అతని వద్ద ఉన్న రూ.1.14 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

భవేష్ పటేల్ మీడియాతో మాట్లాతుడూ.. చనిపోయిన వృద్ధుడు గుజరాతీ మాట్లాడుతున్నాడు. వల్సాద్‌లోని ధోబీ తలావ్ ప్రాంతంలో ఉంటున్నట్లు తెలిపారు. గత రెండు రోజులుగా ఎలాంటి చలనం కనిపించడం లేదని దుకాణదారుడు చెప్పాడు. సివిల్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా అతని వద్ద రూ.1.14 లక్షల నగదు లభ్యమైంది. నగదులో 38 రూ. 500 నోట్లు, 83 రూ. 200 నోట్లు, రూ. 537 100 కరెన్సీ నోట్లు, రూ. 20, రూ. 10 యొక్క కరెన్సీ నోట్లు ఉన్నాయి. ఈ నోట్లన్నీ చిన్న ప్లాస్టిక్ సంచుల్లో నింపి అతని స్వెటర్ జేబు, అతని ప్యాంటు పాకెట్స్‌లో ఉన్నాయి. వైద్యాధికారి ఎదుట ఈ నగదును వల్సాద్ పట్టణ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు.

వల్సాద్ సివిల్ హాస్పిటల్‌కి చెందిన డాక్టర్ కృష్ణ పటేల్ మాట్లాడుతూ.. వృద్ధుడిని ఆసుపత్రికి తీసుకొచ్చినప్పుడు, అతను టీ అడిగాడు. అతను ఆకలితో ఉన్నాడని, అతని రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉన్నట్లు గుర్తించాం. సెలైన్‌ ఎక్కించి చికిత్స ప్రారంభించాం. అయితే గంట తర్వాత అతను మరణించాడు. గత రెండు రోజులుగా ఏమీ తినకపోవడంతో ఆకలితో చనిపోయాడని పోస్ట్‌మార్టం రిపోర్టు ఆధారంగా తెలుస్తోందని తెలిపాడు. బిచ్చగాడు ఎవరనేది ఇంకా నిర్ధారించాల్సి ఉంది. పోలీసులు అతని ఫోటోలు తీసి వివిధ ప్రాంతాలకు పంపించారు.

No.1 న్యూస్‌ నెట్‌వర్క్‌.. No.1 ఎలక్షన్‌ కవరేజ్‌.. డిజిటల్ రంగంలో రికార్డులు బద్దలు కొట్టిన టీవీ9 తెలుగు..

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు