Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇవేం ఫీట్లు నాయనా.. కొంచెం అయితే ప్రాణాలే పోయేవి! వీడియో వైరల్

బస్సు ఫుల్‌గా ఉంటే మీరైతే ఏం చేస్తారు? ఎలాగోలా సర్దుకుని అదే బస్సులో ఓ మూల నిలబడి వెళ్తారు. లేదంటే వేరొక బస్సు వచ్చేవరకు వెయిట్‌ చేసి బస్సు రాగానే ఎక్కి వెళ్లిపోతారు. కానీ ఓ యువకుడు మాత్రం వెయిట్‌ చేసే టైం లేదనుకున్నాడో.. ఏమో తెలియదు గానీ.. బస్‌ రద్దీగా ఉందనీ ఓ ఐడియా వేశాడు. ఏది ఏమైనా అదే బస్సు ఎక్కి వెళ్లాలని గట్టిగానే నిర్ణయించుకున్నట్లు ఉన్నాడు. దీంతో అదే బస్సు వెనుక నంబర్ ప్లేట్ పక్కన ఉన్న చిన్న అంచుపై నిలబడి కిటికీని పట్టుకుని, ప్రయాణించాడు. అలాగే కొన్ని కిలోమీటర్లు ప్రయాణించి గమ్యస్థానానికి చేరుకుంటాడు. దీంతో బస్సు వెనుక..

Viral Video: ఇవేం ఫీట్లు నాయనా.. కొంచెం అయితే ప్రాణాలే పోయేవి! వీడియో వైరల్
Youth Performs Risky Stunt On Bus
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 04, 2023 | 4:45 PM

ముంబై, డిసెంబర్ 4: బస్సు ఫుల్‌గా ఉంటే మీరైతే ఏం చేస్తారు? ఎలాగోలా సర్దుకుని అదే బస్సులో ఓ మూల నిలబడి వెళ్తారు. లేదంటే వేరొక బస్సు వచ్చేవరకు వెయిట్‌ చేసి బస్సు రాగానే ఎక్కి వెళ్లిపోతారు. కానీ ఓ యువకుడు మాత్రం వెయిట్‌ చేసే టైం లేదనుకున్నాడో.. ఏమో తెలియదు గానీ.. బస్‌ రద్దీగా ఉందనీ ఓ ఐడియా వేశాడు. ఏది ఏమైనా అదే బస్సు ఎక్కి వెళ్లాలని గట్టిగానే నిర్ణయించుకున్నట్లు ఉన్నాడు. దీంతో అదే బస్సు వెనుక నంబర్ ప్లేట్ పక్కన ఉన్న చిన్న అంచుపై నిలబడి కిటికీని పట్టుకుని, ప్రయాణించాడు. అలాగే కొన్ని కిలోమీటర్లు ప్రయాణించి గమ్యస్థానానికి చేరుకున్నాడు. దీంతో బస్సు వెనుక వస్తున్న ఇతర వాహన దారులు అతగాడు ఎక్కడ పడిపోతాడో అని యమ టెంక్షన్‌ పడిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఈ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది.

బాంద్రాలోని కార్టర్ రోడ్ నుంచి పీస్ హెవెన్ బస్ స్టాప్ మధ్య ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ వీడియోలో ఓ బస్సు వెనుక ఉన్న చిన్న అంచుపై ఓ వ్యక్తి నిలబడి ఉండటం గమనించవచ్చు. ఆ బస్‌ ఓ బస్‌ స్టాప్‌ వద్ద అగుతుంది. అంతలో ఓ భారీ గుంపు బస్సులోకి ఎక్కడం కనిపిస్తుంది. అయితే ఈ బస్సు వెనుక ఉన్న వ్యక్తి మాత్రం అంచుపై నిలబడి దర్జాగా ఉంటాడె. బస్సు కదిలేటప్పుడు దిగిపోతాడులే అనుకున్నారు. కానీ అతను మాత్రం అలాగే నిలబడి ప్రయాణించసాగాడు. ప్రమాదకరమైన స్టంట్‌ను చూసిన వాహనదారులు, బాటసారులు వీడియోను చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇలాంటి ప్రయానం ఆ వ్యక్తి మాత్రమే కాకుండా రహదారి భద్రతకు హానికరం. ఈ 9 సెకన్ల వీడియోపై నెటిజన్లు భిన్న కామెంట్లు చేస్తున్నారు. ముంబై వంటి నగరంలో జీవించడం సులభం కాదని, ఇక్కడి ప్రజలు రోజువారీ పనులను కూడా ఎంత కష్టంగా చేస్తున్నారో చూడండని కొంతమంది అక్కడి జీవన విధానాన్ని వివరించే ప్రయత్నం చేశారు.

ట్రాఫిక్‌లో ఇంత అజాగ్రత్తగా ప్రయాణించడం అంతమంచిదికాదంటూ మరి కొందరు హితవు పలికారు. మరికొందరేమో దీనిపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇతను క్రిష్‌ని కూడా మించిపోయాడంటూ కామెంట్ సెక్షన్‌లో తెలిపారు. కాగా ఈ ఏడాది ప్రారంభంలో ఇదే తరహాలో మరో వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కదులుతున్న బస్సు వెనుక ఉన్న చిన్న ర్యాంప్‌పై ఇద్దరు యువకులు ప్రమాదకరంగా నిలబడి ప్రయాణించడం వీడియోలో కనిపిస్తుంది. ఈ ఘటన కూడా ముంబైలోని అదే ప్రదేశంలో జరిగినట్లు సమాచారం. ఏదిఏమైనా ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణించడం ప్రమాదాన్ని ఆహ్వానించినట్లే అవుతుంది. మీరు మాత్రం ఇలా చేయకండే..

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.