AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mizoram Election Result 2023: మిజోరంలో అధికార పార్టీకి షాక్‌.. జొరామ్‌ పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ పార్టీ విజయం

మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో మిజోరామ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో జొరామ్‌ పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ ZPM విజయం సాధించింది. 40 సీట్ల అసెంబ్లీలో 27 సీట్లను ఆ పార్టీ సాధించింది. ZPM ముఖ్యమంత్రి లాల్‌దుహోమా గెలిచారు. ఈ ఎన్నికల్లో అధికార మిజో నేషనల్‌ ఫ్రంట్‌కు ఏడు సీట్లు, బీజేపీకి రెండు సీట్లు దక్కాయి. కాంగ్రెస్‌ ఒక్క సీటుకు పరిమితం అయింది. రాష్ట్ర ముఖ్యమంత్రి జొరామ్‌తంగా కూడా ఎన్నికల్లో ఓడిపోయారు.

Mizoram Election Result 2023: మిజోరంలో అధికార పార్టీకి షాక్‌.. జొరామ్‌ పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ పార్టీ విజయం
Lalduhoma
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 04, 2023 | 4:54 PM

మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో మిజోరామ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో జొరామ్‌ పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ ZPM విజయం సాధించింది. 40 సీట్ల అసెంబ్లీలో 27 సీట్లను ఆ పార్టీ సాధించింది. ZPM ముఖ్యమంత్రి లాల్‌దుహోమా గెలిచారు. ఈ ఎన్నికల్లో అధికార మిజో నేషనల్‌ ఫ్రంట్‌కు ఏడు సీట్లు, బీజేపీకి రెండు సీట్లు దక్కాయి. కాంగ్రెస్‌ ఒక్క సీటుకు పరిమితం అయింది. రాష్ట్ర ముఖ్యమంత్రి జొరామ్‌తంగా కూడా ఎన్నికల్లో ఓడిపోయారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ కంభంపాటి హరిబాబును కలిసి తన రాజీనామా లేఖను ఇచ్చారు సీఎం జోరామ్‌ తంగా

ZNP అత్యధిక మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ట్రెండ్‌ను బట్టి స్పష్టమవుతోంది. ఎన్నికలకు ముందు, తర్వాత కూడా ఇక్కడ ముక్కోణపు పోటీ ఉంటుందనే చర్చ సాగింది. ఎగ్జిట్ పోల్స్ కూడా హంగ్ అసెంబ్లీని అంచనా వేసింది. అయితే లాల్దుహోమా పార్టీ అన్ని ఊహాగానాలను తలకిందులు చేస్తూ అధికారంలో దిశగా అడుగు వేస్తుంది. ఇంత పెద్ద విజయం సాధించిన తర్వాత ఇప్పుడు సీఎం కావడానికి లల్దుహోమ సిద్ధమవుతున్నారు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నుంచి రాష్ట్రానికి సీఎం పోటీ చేసే వరకు లాల్దుహోమ ప్రయాణం అంత ఈజీ కాదు.

1977లో ఐపీఎస్‌గా బాధ్యతలు

మిజోరాం యువతలో లాల్దుహోమ బాగా ప్రాచుర్యం పొందారు. గత కొన్నేళ్లుగా మిజోరాం అభివృద్ధి గురించి, కాంగ్రెస్, ఎంఎన్‌ఎఫ్‌ల నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేయాలని చెబుతూ వచ్చారు. లాల్దుహోమా 1977లో IPS అయ్యారు. గోవాలో స్క్వాడ్ లీడర్‌గా పనిచేశారు. ఈ క్రమంలో స్మగ్లర్లపై పలు కఠిన చర్యలు తీసుకున్నారు. దీంతో నేషనల్ మీడియాలో కనిపించడం మొదలుపెట్టారు. అతని మంచి పనిని చూసి 1982లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్‌గా నియమించారు.

1984లో తొలిసారి ఎంపీ అయ్యారు

ఇందిరాగాంధీ రక్షణలో ఉన్న రెండేళ్లకే 1984లో రాజకీయాల్లోకి రావాలని లాల్దుహోమ నిర్ణయించుకున్నారు. 1984లో ఎంపీ అయ్యారు. కేవలం నాలుగు సంవత్సరాల తర్వాత, 1988లో కాంగ్రెస్ సభ్యత్వాన్ని విడిచిపెట్టినందుకు లోక్‌సభకు అనర్హుడయ్యాడు. ఈ విధంగా ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడిన తొలి ఎంపీగా లల్దుహోమ నిలిచారు.

2020లో శాసనసభ్యుడిగా ఎన్నిక

కాంగ్రెస్‌ను వీడిన తర్వాత, లాల్దుహోమా జోరామ్ నేషనలిస్ట్ పార్టీ (ZNP)ని స్థాపించారు. 2018 మిజోరాం శాసనసభ ఎన్నికల్లో ZNP నేతృత్వంలోని జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ (ZPM) కూటమి మొదటి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపికయ్యారు. కానీ ప్రతిపక్ష నేతగా పని చేసేందుకు అంగీకరించారు. 2020లో, ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించిన ఆరోపణలపై ఆయన శాసనసభ సభ్యత్వం రద్దు అయ్యింది. భారతదేశంలోని రాష్ట్ర శాసనసభలలో ఈ రకమైన మొదటి కేసు ఇది. 2021లో జరిగిన ఉప ఎన్నికల్లో మళ్లీ సెర్చిప్ నుంచి గెలుపొందారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…