Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Rains: ప్రకాశం జిల్లాలో దంచికొడుతున్న వానలు.. రెండు రోజులు విద్యా సంస్థలకు సెలవు

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం సోమవారం ఉదయానికి తుఫానుగా మారనుంది. ఈ క్రమంలో ప్రకాశం జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. వచ్చే 4 రోజులపాటు వర్షాలు ముమ్మరంగా కురిసే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. దీంతో సోమ, మంగళవారాల్లో జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. తుపాను తీరం దాటే సమయంలో గాలి..

AP Rains: ప్రకాశం జిల్లాలో దంచికొడుతున్న వానలు.. రెండు రోజులు విద్యా సంస్థలకు సెలవు
Michaung Cyclone
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 03, 2023 | 9:18 AM

ఒంగోలు, డిసెంబర్ 3: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం సోమవారం ఉదయానికి తుఫానుగా మారనుంది. ఈ క్రమంలో ప్రకాశం జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. వచ్చే 4 రోజులపాటు వర్షాలు ముమ్మరంగా కురిసే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. దీంతో సోమ, మంగళవారాల్లో జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. తుపాను తీరం దాటే సమయంలో గాలి ఉద్ధృతంగా వీస్తుందని హెచ్చరించారు. గంటకు 95 నుంచి 105 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు అన్ని శాఖల సిబ్బంది, సచివాలయ సిబ్బంది జిల్లా ప్రజలకు అందుబాటులో వుండాలని జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ సూచించారు.

ఇకపోతే.. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫానుగా మారిన నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికార యంత్రాంగాన్ని ఆయన అలర్ట్ చేశారు.’మైచౌంగ్’ తుఫానుగా నామకరణం చేశారు. తుఫాను ఈ నెల 4న నెల్లూరు – మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీంతో అధికారులంతా సన్నద్ధంగా వుండాలని, సహాయక చర్యల్లో ఎలాంటి లోటూ రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. కరెంట్, రవాణా వ్యవస్థలకు అంతరాయం ఏర్పడితే వాటిని వెంటనే పునరుద్ధరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ సూచించారు. తుఫాను ప్రభావిత ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సహాయ శిబిరాలను ఏర్పాటు చేసి, అందులో తాగునీరు, ఆహారం, పాలు వంటివి అందుబాటులో వుంచుకోవాలని సూచించారు. అలాగే వైద్య సేవలను కూడా అందజేపయాలని తెలిపారు.

అటు మైచౌంగ్ తుఫాన్ నేపథ్యంలో రైల్వే శాఖ పెద్ద సంఖ్యలో రైళ్లను రద్దు చేసింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 140కి పైగా రైళ్లను డిసెంబర్ 3 నుంచి 6 వ తేదీ వరకు రద్దు చేసినట్లు సీపీఆర్వో సీహెచ్ రాకేష్ తెలిపారు. మరికొన్నింటినీ పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఇప్పటికే నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు మొదలయ్యాయి. రహదారులన్నీ జలమయం అయ్యాయి. నెల్లూరు జిల్లా మైపాడు బీచ్‌లో అలలు ఎగసిపడుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.