Meenam Fish: మత్స్యకారుల వలకు దొరికిన అరుదైన మీనం చేప.. ఎంత ధర పలికిందంటే
కాకినాడ జిల్లా యానాంకి చెందిన మత్స్యకారుల వలకు అరుదైన మీనం చేప చిక్కింది. మత్యకారుల వలకు చిక్కిన మీనం చేప సుమారు 6 గంటల పాటు బ్రతికి ఉండటం విశేషం. పోన్నమండ భద్రం అనే మత్స్యకార మహిళ యానాం మార్కెట్‌కు అరుదైన చేపను అమ్మకానికి తెచ్చింది. దీంతో పలువురు ఆసక్తికరంగా తిలకించారు. మీనం చేపలో ఆరోగ్యినికి మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. మీనం చేప తిన్న వారికి విటమిన్ బి-12, ఒమేగా 3 ప్యాటీ యాసిడ్స్ అధికంగా..

యానాం, డిసెంబర్ 3: కాకినాడ జిల్లా యానాంకి చెందిన మత్స్యకారుల వలకు అరుదైన మీనం చేప చిక్కింది. మత్యకారుల వలకు చిక్కిన మీనం చేప సుమారు 6 గంటల పాటు బ్రతికి ఉండటం విశేషం. పోన్నమండ భద్రం అనే మత్స్యకార మహిళ యానాం మార్కెట్‌కు అరుదైన చేపను అమ్మకానికి తెచ్చింది.
దీంతో పలువురు ఆసక్తికరంగా తిలకించారు. మీనం చేపలో ఆరోగ్యినికి మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. మీనం చేప తిన్న వారికి విటమిన్ బి-12, ఒమేగా 3 ప్యాటీ యాసిడ్స్ అధికంగా లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. స్థానిక మత్యకారులు ఈ చేపను మురుబొంత చేప అని అంటారు.
దీనిని ఆంగ్లం లో రీప్ కాడ్ ఫిష్ అంటారు. ఇక తమిళ, మలయాళంలో కలపమీన్ అని పిలుస్తారు. కిలో బరువు ఉన్న ఈ మీనం చేపను యానాం మార్కెట్‌లో 600 రూపాయలకు విక్రయించినట్లు మత్యకార మహిళ భద్రం తెలిపింది. కాగా వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు ఇలాంటి అరుదైన చేపలు అప్పుడప్పుడు దొరుకుతుంటాయని , అవి రికార్డు ధరకు అమ్ముడు పోతుంటాయిని స్థానికులు అంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.