Food Poison: ప్రభుత్వ పాఠశాలలో అధికారుల నిర్లక్ష్య వైఖరి.. కలుషిత ఆహారం తిని 60 విద్యార్ధులు అస్వస్థత..
పంజాబ్‌లోని సంగ్రూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలోని క్యాంటీన్‌లో ఆహారం తిని 60 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. ఆహారం తిన్న కొద్ది సమయంలోనే కడుపునొప్పి, వాంతులతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే బాధిత విద్యార్థినులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం విద్యార్ధుల ఆరోగ్యం నిలకడగా ఉంది. దీనిపై పోలీసులు ఐపీపీ సెక్షన్‌లోని 307 (హత్య ప్రయత్నం) కింద శనివారం కేసు నమోదు చేశారు. మెస్ కాంట్రాక్టర్, దాని ఇంఛార్జిని అరెస్టు చేశారు. కాగా సంగ్రూర్ ప్రభుత్వ..
చెన్నై, డిసెంబర్ 3: పంజాబ్‌లోని సంగ్రూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలోని క్యాంటీన్‌లో ఆహారం తిని 60 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. ఆహారం తిన్న కొద్ది సమయంలోనే కడుపునొప్పి, వాంతులతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే బాధిత విద్యార్థినులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం విద్యార్ధుల ఆరోగ్యం నిలకడగా ఉంది. దీనిపై పోలీసులు ఐపీపీ సెక్షన్‌లోని 307 (హత్య ప్రయత్నం) కింద శనివారం కేసు నమోదు చేశారు. మెస్ కాంట్రాక్టర్, దాని ఇంఛార్జిని అరెస్టు చేశారు. కాగా సంగ్రూర్ ప్రభుత్వ మెరిటోరియస్ పాఠశాలలో 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు విద్య, వసతి, ఆహారం, ఇతర సౌకర్యాలను ఉచితంగా అందిస్తుంది. ప్రభుత్వ మెరిటోరియస్ పాఠశాలలో భోజన నాణ్యతపై విద్యార్థులు ఇప్పటికే పలు మార్లు ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశారు. దీపావళి నుంచి హాస్టల్‌లో వడ్డించే ఆహారంలో పురుగులు వచ్చాయని, సమస్యలను పరిష్కరించాలని విద్యార్ధులు విన్నవించారు. అయినా ప్రిన్సిపల్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తాజా ఘటనతో ఎలాంటి చర్యలు తీసుకోనందుకు గానూ ప్రిన్సిపాల్‌ను కూడా సస్పెండ్ చేశారు.
భోజనం చేసిన తర్వాత శుక్రవారం సాయంత్రం దాదాపు 20 మంది చిన్నారులు కడుపునొప్పి, వాంతులు చేసుకున్నారు. దీంతో వారందరినీ సంగ్రూర్‌లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో 15 మంది చిన్నారులు డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దాదాపు 50 మంది చిన్నారులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎక్కువ మంది విద్యార్ధులు ఫుడ్ పాయిజనింగ్ కారణంగా అనారోగ్యం బారీన పడ్డట్లు తెలుస్తోంది. విద్యార్థులు కలుషిత ఆహారం తినడం వల్ల, ఫుడ్ పాయిజనింగ్‌కు గురయినట్లు వైద్యుల ప్రాథమిక పరీక్షల్లో తేలింది. దీనిపై సమాచారం అందుకున్న పుడ్ సేఫ్టీ అధికారులు సమస్యను పరిశీలిస్తున్నారు. క్యాంటీన్ నుంచి ఆహార నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు తరలించారు.
వంశిక అనే విద్యార్థిని మాట్లాడుతూ.. ఆహారంలో పురుగులు వస్తున్నాయని, అందువల్లనే గత కొంతకాలంగా విద్యార్థులు సరిగా భోజనం చేయడం లేదని తెల్పింది. దీనిపై ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేసినా.. వారు పట్టించుకోలేదని చెప్పుకొచ్చింది. దీంతో పలువురు విద్యార్ధులు కడుపునొప్పితో బాధపడుతున్నారని తెల్పింది. పాఠశాల యాజమాన్యంపై ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు అధికారులను కోరారు. విద్యార్ధులకు అందించే ఆహార నాణ్యతను పాఠశాల అధికారులు పరిశీలించడం లేదని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM) విచారణకు ఆదేశించినట్లు విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు సంగ్రూర్ డిప్యూటీ కమిషనర్ తెలిపారు. వారంలోగా జిల్లా కమిషనర్‌కు నివేదిక అందజేయాలని విద్యాశాఖను ఆదేశించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.