Rajasthan Counting: రాజస్తాన్‌లో బీజేపీ హవా.. రెండవ స్థానానికి పరిమితమైన కాంగ్రెస్
రాజస్తాన్ అసెంబ్లీలో మొత్తం 200 సీట్లు ఉండగా అధికారం చేపట్టాలంటే మ్యాజిక్ ఫిగర్ 101 రావాలి. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న కౌంటింగ్‌లో బీజేపీ 103 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. 86 స్థానాల్లో కొనసాగుతోంది. ఇతరులు 7 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గతంలో వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్‌లో కూడా ఈ సారి బీజేపీ అధికారంలోకి వస్తుందని తెలిపింది. ప్రస్తుతం ఫలితాలు చూస్తే ఇది నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రాజస్తాన్ అసెంబ్లీలో మొత్తం 200 సీట్లు ఉండగా అధికారం చేపట్టాలంటే మ్యాజిక్ ఫిగర్ 101 రావాలి. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న కౌంటింగ్‌లో బీజేపీ 107 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. 80 స్థానాల్లో కొనసాగుతోంది. ఇతరులు 13 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గతంలో వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్‌లో కూడా ఈ సారి బీజేపీ అధికారంలోకి వస్తుందని తెలిపింది. ప్రస్తుతం ఫలితాలు చూస్తే ఇది నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మొదటి ట్రెండ్స్ ఫలితాలను బేరీజు వేసుకొని ఇస్తున ఫలితాలు మాత్రమే. తుది ఫలితం రావడానికి మరి కొంత సమయం పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు కౌంటింగ్ అధికారులు. రాజస్తాన్‌లోని కృష్ణపోలే నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి అజిక్ కాగ్జి ముందంజలో కొనసాగుతున్నారు. రాజస్థాన్ బీజేపీ చీఫ్ ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ బీజేపీ భారీ మొజార్టీతో గెలుస్తుందని, మరోసారి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ కార్యకర్త హనుమాన్ వేషం ధరించి ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్స్ వద్ద జై హనుమాన్ నినాదాలు చేశారు. బీజేపీ గెలవాలని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ జైపూర్ గోవింద్ దేవ్‌జీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇక రాజస్తాన్ విషయానికొస్తే ఇక్కడ గడిచిన 30 ఏళ్లుగా అట్టు తిరగేసినట్లు ప్రజలు తీర్పు ఇస్తున్నారు. అంటే ఐదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటే మరో ఐదు సంవత్సరాలు బీజేపీ అధికారంలోకి వస్తుంది. అంటే తమిళనాడు రాజకీయాలలాగా ఇక్కడ కూడా ఐదేళ్లకంటే ఎక్కువ కాలం ఏ పార్టీ అధికారంలో కొనసాగే పరిస్థితి లేదు. ప్రస్తుతం కాంగ్రస్ అధికారంలో ఉంది. అశోక్ గెహ్లాట్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఈ ఐదేళ్ల కాలంలో తాము ప్రవేశ పెట్టిన సంక్షేమమే తమను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే ముప్పైఏళ్ల ఆనవాయితీకి గండికొట్టి మరోసారి కాంగ్రెస్ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారని చెప్పారు. బీజేపీ కూడా తమదే విజయం అని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. రాజస్తాన్‌లో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉందని తమకు ఇది బాగా కలిసి వస్తుందని అంటున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..