Delhi: ఆల్ పార్టీ మీటింగ్‌కు హాజరుకాలేక పోయిన విజయసాయి రెడ్డి.. కారణం ఏంటంటే?

ఈ సమావేశానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయి రెడ్డి, లోక్‌సభ పక్ష నేత మిథున్ రెడ్డి హాజరవుతుంటారు. ఈసారి ఏర్పాటు చేసిన సమావేశం కోసం విజయసాయి రెడ్డి ఉదయం గం. 6.15కు హైదరాబాద్ నుంచి ఎయిరిండియా విమానం (AI 559) ఎక్కారు. అది ఉదయం గం. 8.35కు ఢిల్లీలో ల్యాండ్ అవ్వాలి. అనుకున్న సమయానికి విమానం ఢిల్లీకి చేరుకుని ఉంటే...

Delhi: ఆల్ పార్టీ మీటింగ్‌కు హాజరుకాలేక పోయిన విజయసాయి రెడ్డి.. కారణం ఏంటంటే?
Vijay Sai Reddy
Follow us

| Edited By: Narender Vaitla

Updated on: Dec 02, 2023 | 7:47 PM

డిసెంబర్ 4 నుంచి ప్రారంభంకానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హాజరుకాలేకపోయింది. పార్లమెంటు సమావేశాలు ప్రారంభించే ముందు రోజు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించడం ఆనవాయితీ. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఆహ్వానం మేరకు వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లు సమావేశానికి హాజరవుతారు. వీలుంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, వీలుకుదరని పక్షంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు.

ఈ సమావేశానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయి రెడ్డి, లోక్‌సభ పక్ష నేత మిథున్ రెడ్డి హాజరవుతుంటారు. ఈసారి ఏర్పాటు చేసిన సమావేశం కోసం విజయసాయి రెడ్డి ఉదయం గం. 6.15కు హైదరాబాద్ నుంచి ఎయిరిండియా విమానం (AI 559) ఎక్కారు. అది ఉదయం గం. 8.35కు ఢిల్లీలో ల్యాండ్ అవ్వాలి. అనుకున్న సమయానికి విమానం ఢిల్లీకి చేరుకుని ఉంటే. పార్లమెంట్ లైబ్రరీ భవనంలో ఉదయం గం. 11.00కు ప్రారంభమైన ఆల్ పార్టీ మీటింగ్‌కు హాజరై ఉండేవారు. కానీ ఆ విమానం ఢిల్లీ చేరుకునే సమయానికి ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొంగమంచు అలుముకుంది.

ఎదురుగా కనీసం 50 మీటర్ల దూరంలో ఉన్నవేవీ కనిపించని పరిస్థితి నెలకొంది. ‘రన్ వే’ కంటికి కనిపించని స్థితిలో విమానాన్ని కిందికి దించడం సాధ్యపడదు. అందుకే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) అధికారులు విమానాన్ని సమీపంలోని జైపూర్‌కు దారి మళ్లించారు. ఢిల్లీలో వాతావరణం మెరుగుపడ్డ తర్వాత జైపూర్ నుంచి ఢిల్లీకి విమానం బయల్దేరింది. ఈ కారణంగా విజయసాయి రెడ్డి ఆల్ పార్టీ మీటింగ్‌కు అందుకోలేకపోయారు.

మొత్తం 18 విమానాల దారిమళ్లింపు..

ఇదిలా ఉంటే.. ఢిల్లీ సహా ఉత్తరాదిన శీతాకాలంలో పొగమంచు కొత్తేమీ కాదు. శీతాకాలపు ఉదయాల్లో దట్టమైన పొగమంచు రోడ్డు రవాణా, రైల్వే వ్యవస్థతో పాటు విమానయానంపై కూడా తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. పొగమంచులో ఎదురుగా ఉన్న వాహనం కనిపించక ప్రమాదాలు జరుగుతుంటాయి. రైళ్లను కూడా నిర్దేశించిన వేగంతో నడపలేని స్థితి నెలకొంటుంది. అందుకే శీతాకాలం రైళ్లన్నీ గంటల తరబడి ఆలస్యంగా నడుస్తుంటాయి.

ఇక విమానాల విషయానికొస్తే అవి మేఘాల కంటే ఎక్కువ ఎత్తులో ఎగురుతాయి కాబట్టి ప్రయాణానికి పొగమంచు తీసుకొచ్చే ఇబ్బందేమీ ఉండదు. కానీ ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ చేయాలన్నా.. ఎక్కడైనా విమానాన్ని దించాలన్నా పొగమంచు ఒక అవరోధంగా మారుతుంది. దట్టమైన పొగమంచు ఎదురుగా 50 మీటర్ల దూరంలో ఉన్నవాటిని కనిపించకుండా చేస్తుంది. దాన్నే విజిబిలిటీ అంటారు. విజిబిలిటీ సరిగా లేనప్పుడు విమానాలను దించడానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) సిబ్బంది అనుమతించరు. ప్రస్తుతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చి పొగమంచులోనూ టేకాఫ్ చేసే సదుపాయం అందుబాటులోకి వచ్చినప్పటికీ, పొగమంచులో ల్యాండింగ్ మాత్రం ప్రమాదకరమే. అందుకే రిస్క్ తీసుకోడానికి ఎవరూ ఇష్టపడరు.

శనివారం ఉదయం కమ్ముకున్న దట్టమైన పొగమంచు కారణంగా విజయసాయి రెడ్డి ప్రయాణిస్తున్న ఎయిరిండియా (AI 559) విమానం ఒక్కటే కాదు, మొత్తం 18 విమానాలను దారి మళ్లించాల్సి వచ్చింది. వాటిలో కొన్నింటిని జైపూర్‌ (రాజస్థాన్)కు, కొన్నింటిని లక్నో (ఉత్తర్‌ప్రదేశ్)కు, మరికొన్నింటిని అహ్మదాబాద్ (గుజరాత్), అమృత్‌సర్ (పంజాబ్)కు తరలించారు.

పొగమంచు మాత్రమే కాదు..

శీతాకాలంలో పొగమంచు భౌగోళిక, వాతావరణ పరిస్థితుల కారణంగా ఏర్పడుతుంది. కానీ మానవ తప్పిదాలతో ఏర్పడే వాయు కాలుష్యం ఈ పొగమంచుకు తోడైతే పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. దేశ రాజధాని న్యూఢిల్లీ సహా ఉత్తరాదిన అనేక నగరాలు, పట్టణాలు శీతాకాలంలో అత్యంత దారుణమైన వాయుకాలుష్యాన్ని ఎదుర్కొంటున్నాయి. పొగమంచు (FOG), వాయుకాలుష్యం (SMOKE) కలగలిసిన స్థితిని స్మాగ్ (SMOKE+FOG = SMOG)గా వ్యవహరిస్తుంటారు. ఇది ప్రజారోగ్యంపై తీవ్ర దుష్ప్రభావాన్ని చూపుతుంది.

అదే సమయంలో ప్రజా రవాణాకు సైతం తీవ్ర విఘాతం, అంతరాయం కల్గిస్తుంది. ఢిల్లీలో గత కొద్ది రోజులుగా సగటున ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 400కు పైగా నమోదవుతోంది. ఈ స్థితికి పొగమంచు తోడైనప్పుడు ఎదురుగా కొద్ది దూరంలో ఉన్న మనిషి కూడా కనిపించడు. ఇలాంటప్పుడు ఏ ప్రయాణమైనా ప్రమాదాలకు ఆస్కారం కల్గిస్తుంది. సూర్యోదయానికి ముందు నుంచి సూర్యోదయం తర్వాత కొన్ని గంటల పాటు దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే శీతాకాలం ఉదయం పూట ఢిల్లీ చేరుకునే విమానాలు, రైళ్లు ఆలస్యంగా నడుస్తుంటాయి. విమానాలను ల్యాండింగ్ చేయడం సాధ్యపడనప్పుడు దారిమళ్లించడం కూడా పరిపాటే.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

శాంతించు గోదారి.! గంటగంటకు పెరుగుతున్న గోదావరి వరద..
శాంతించు గోదారి.! గంటగంటకు పెరుగుతున్న గోదావరి వరద..
బ్లూ టీ తాగితే ఆరోగ్యంతో పాటు అందం అమాంతం పెరుగుతుందా? లాభాలు ఇలా
బ్లూ టీ తాగితే ఆరోగ్యంతో పాటు అందం అమాంతం పెరుగుతుందా? లాభాలు ఇలా
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి
డయాబెటీస్ పేషెంట్లకు బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ ఇదే..!
డయాబెటీస్ పేషెంట్లకు బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ ఇదే..!
విజయసాయి రెడ్డి ఫ్యామిలీని కలిసిన తారకరత్న భార్య అలేఖ్య..
విజయసాయి రెడ్డి ఫ్యామిలీని కలిసిన తారకరత్న భార్య అలేఖ్య..
వద్దంటే చేపలు.. పట్టుకున్నోళ్లకు పట్టుకున్నన్ని.! వీడియో..
వద్దంటే చేపలు.. పట్టుకున్నోళ్లకు పట్టుకున్నన్ని.! వీడియో..
August Horoscope: ఆగస్టు నెలలో ఆ రాశుల వారికి అందలాలు, ఆదాయాలు
August Horoscope: ఆగస్టు నెలలో ఆ రాశుల వారికి అందలాలు, ఆదాయాలు
నోరూరించే ఆలూ పాలక్ పరాటా ఇలా చేశారంటే.. కరిగిపోతుంది!
నోరూరించే ఆలూ పాలక్ పరాటా ఇలా చేశారంటే.. కరిగిపోతుంది!
మా జిల్లాను మహారాష్ట్రాలో కలిపేయండి.అసెంబ్లీలో సిర్పూర్ ఎమ్మెల్యే
మా జిల్లాను మహారాష్ట్రాలో కలిపేయండి.అసెంబ్లీలో సిర్పూర్ ఎమ్మెల్యే
ఎక్కువ కాలం జీవించాలంటే.. ఇలాంటి అలవాట్లను ఫాలో అవ్వండి..!
ఎక్కువ కాలం జీవించాలంటే.. ఇలాంటి అలవాట్లను ఫాలో అవ్వండి..!
శాంతించు గోదారి.! గంటగంటకు పెరుగుతున్న గోదావరి వరద..
శాంతించు గోదారి.! గంటగంటకు పెరుగుతున్న గోదావరి వరద..
వద్దంటే చేపలు.. పట్టుకున్నోళ్లకు పట్టుకున్నన్ని.! వీడియో..
వద్దంటే చేపలు.. పట్టుకున్నోళ్లకు పట్టుకున్నన్ని.! వీడియో..
మా జిల్లాను మహారాష్ట్రాలో కలిపేయండి.అసెంబ్లీలో సిర్పూర్ ఎమ్మెల్యే
మా జిల్లాను మహారాష్ట్రాలో కలిపేయండి.అసెంబ్లీలో సిర్పూర్ ఎమ్మెల్యే
భర్తలకు పాకెట్‌ మనీ ఇచ్చే భార్యలు.. ఎంత పాకెట్‌ మనీ ఇస్తే అంతే.!
భర్తలకు పాకెట్‌ మనీ ఇచ్చే భార్యలు.. ఎంత పాకెట్‌ మనీ ఇస్తే అంతే.!
శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర తప్పిన పెను ప్రమాదం..
శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర తప్పిన పెను ప్రమాదం..
సెక్యూరిటీ గార్డు‌గా పిల్లి.. జీతం ఎంతో తెలుసా.? వీడియో.
సెక్యూరిటీ గార్డు‌గా పిల్లి.. జీతం ఎంతో తెలుసా.? వీడియో.
పేరుకే విడాకులు.. కానీ కలిసే ఉంటున్నారట.! పూజా ఖేద్కర్‌ మోసం.!
పేరుకే విడాకులు.. కానీ కలిసే ఉంటున్నారట.! పూజా ఖేద్కర్‌ మోసం.!
ఇంటి అద్దెలో సగం క్యాబ్‌కే ధారపోస్తున్నట్లు మహిళ ఆవేదన.! వీడియో..
ఇంటి అద్దెలో సగం క్యాబ్‌కే ధారపోస్తున్నట్లు మహిళ ఆవేదన.! వీడియో..
తెలంగాణాలో అల్పపీడనం ప్రభావం.! మరో రెండ్రోజులు భారీ వర్షాలు..
తెలంగాణాలో అల్పపీడనం ప్రభావం.! మరో రెండ్రోజులు భారీ వర్షాలు..
అది ఆమె ఇష్టం.! గర్భం విషయంలో హైకోర్టు స్పష్టం.!
అది ఆమె ఇష్టం.! గర్భం విషయంలో హైకోర్టు స్పష్టం.!