Assembly Election: నాలుగు రాష్ట్రాల్లో గెలుపెవరిది.. ప్రస్తుతం ఎవరికి అనుకూలం..
దేశవ్యాప్తంగా జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఈరోజు నాలుగు రాష్ట్రాల ఫలితాలు వెల్లడి కానున్నాయి. దీనికి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ మొత్తం పూర్తి చేశారు ఎలక్షన్ కమిషన్ అధికారులు. ఐదు రాష్ట్రాల్లో నెలన్నరకు పైగా ప్రచారంలో తిరిగి అలిసిపోయిన రాజకీయ నాయకులకు నేడు ఫలితాలపై నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది.
దేశవ్యాప్తంగా జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఈరోజు నాలుగు రాష్ట్రాల ఫలితాలు వెల్లడి కానున్నాయి. దీనికి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ మొత్తం పూర్తి చేశారు ఎలక్షన్ కమిషన్ అధికారులు. ఐదు రాష్ట్రాల్లో నెలన్నరకు పైగా ప్రచారంలో తిరిగి అలిసిపోయిన రాజకీయ నాయకులకు నేడు ఫలితాలపై నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. అయితే ఈరోజు తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్ ఈ నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మాత్రమే వెలువడనున్నాయి. మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సోమవారానికి వాయిదా వేసింది ఈసీ. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలలో దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలను కీలకంగా భావిస్తున్నాయి పలు ప్రధాన రాజకీయ పార్టీలు.
నువ్వా.. నేనా అన్న విధంగా..
మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో రెండు ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. మధ్యప్రదేశ్‌లో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉండగా.. రాజస్తాన్, ఛత్తీస్గఢ్‌లలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అయితే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి దేశ వ్యాప్తంగా సరికొత్త జోష్‌ను క్యాడర్లో తీసుకొచ్చింది. దీంతో ఈ ఐదు రాష్ట్రాల్లో వాడివేడిగా ప్రచారం చేశారు ఇరు పార్టీలకు చెందిన నాయకులు. ఈ సారి రాజస్తాన్, ఛత్తీస్గఢ్‌లలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ మధ్యప్రదేశ్, తెలంగాణలో పాగా వేస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. మిజోరాంలో మాత్రం లోకల్ పార్టీలకే ఓటర్లు పట్టంగట్టినట్లు తెలుస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..