World Records: 14 ఏళ్లకే 100కుపైగా ప్రపంచ రికార్డులు.. విభిన్న ప్రతిభాశాలి ప్రిషా విజయగాథ
అసాధారణ ప్రతిభ, అంకితభావంతో 14 ఏళ్ల బాలిక ప్రిష యోగా పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా 100కుపైగా రికార్డులు, 200కు పైగా బంగారు పతకాలు నొలకొల్పింది. పట్టుదలతో నిరంతర సాధన చేసి పిన్నవయసులోనే ప్రపంచ ఖ్యాతి గడించింది. తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా వన్నారపేట్ ప్రాంతానికి చెందిన కార్తికేయ, దేవిప్రియ దంపతుల కుమార్తె ప్రిష (14). ప్రిశా తండ్రి వ్యాపారవేత్త కాగా, తల్లి దేవీప్రియ న్యాయవాది. ప్రిష యోగాసనాల్లో దిట్ట. చదువులో రాణిస్తూనే యోగాలోనూ సాధన చేసింది. కేవలం యోగా ఆసనాలు మాత్రమే కాదు, నీటి అడుగున యోగా..
చెన్నై, డిసెంబర్ 3: అసాధారణ ప్రతిభ, అంకితభావంతో 14 ఏళ్ల బాలిక ప్రిష యోగా పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా 100కుపైగా రికార్డులు, 200కు పైగా బంగారు పతకాలు నొలకొల్పింది. పట్టుదలతో నిరంతర సాధన చేసి పిన్నవయసులోనే ప్రపంచ ఖ్యాతి గడించింది. తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా వన్నారపేట్ ప్రాంతానికి చెందిన కార్తికేయ, దేవిప్రియ దంపతుల కుమార్తె ప్రిష (14). ప్రిశా తండ్రి వ్యాపారవేత్త కాగా, తల్లి దేవీప్రియ న్యాయవాది. ప్రిష యోగాసనాల్లో దిట్ట. చదువులో రాణిస్తూనే యోగాలోనూ సాధన చేసింది. కేవలం యోగా ఆసనాలు మాత్రమే కాదు, నీటి అడుగున యోగా, స్విమ్మింగ్, ఆక్వా యోగా, సవ్యసాచి రచన, రూబిక్స్ క్యూబ్ సాల్వింగ్ కెమిస్ట్రీ, కళ్లకు గంతలతో సైకిలు తొక్కడం, స్కేటింగ్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ వంటి మరెన్నింటోలో విభిన్న ప్రతిభ ప్రదర్శిస్తూ అందరినీ అబ్బురపరుస్తోంది. తన అమ్మమ్మ, తల్లి నుంచి ప్రేరణ పొందిన ప్రిషా రెండేళ్ల నుంచి యోగా సాధన చేస్తోంది. వజ్రాసనం, హనుమాన్ ఆసనం, శుకసనం, వామదేవ ఆసనం వంటి ఎన్నో ఆసనాలను సునాయాసంగా వేస్తుంది. యోగా ప్రాముఖ్యతపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడానికి యోగా అవగాహన శిబిరాలను కూడా నిర్వహిస్తుంది.
ఆమె విజయాన్ని సాధించాలనే మక్కువతో తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటుంది. ఇప్పటికే ఆమె పేర 70 ప్రపంచ రికార్డులు ఉండగా.. తాజాగా మరో 30 ప్రపంచ రికార్డులను సాధించింది. ఇంత చిన్న వయస్సులో 100 ప్రపంచ రికార్డులను నెలకొల్పిన మైలురాయిని సాధించిన మొదటి అమ్మాయిగా ప్రిషా నిలిచింది. ప్రిషా సాదించిన అవార్డులను ప్రదర్శించడానికి ఆమె తల్లిదండ్రులు తమ ఇంటిలో ప్రత్యేక గదిని కేటాయించారు. ఆ గదిని ప్రిషా సాధించిన ట్రోఫీలు, బంగారు పతకాలు, ప్రశంసా పత్రాలతో అలంకరించారు. అతి పిన్న వయసులో మూడు డాక్టరేట్లు పొంది చరిత్ర సృష్టించింది. థాయ్‌లాండ్, మలేసియాల్లో జరిగిన ప్రపంచ యోగా పోటీల్లో ఛాంపియన్‌గా నిలిచింది.
గత నాలుగేళ్లుగా అనేక పాఠశాలలు, కాలేజీల్లో ఈమె ఉచితంగా యోగా నేర్పుతోంది. ప్రపంచంలోనే అతి పిన్న వయస్సులో యోగా టీచర్‌గా మారిన ప్రిషాకు జాతీయ బాలల హక్కుల కమిషన్ ధ్రువపత్రం అందించింది. అంతేకాకుండా ‘లెట్స్ డూ ఇట్ టుడే.. ఎంజాయ్ ఇట్’ అనే పుస్తకాన్ని కూడా ప్రిషా రాసింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా లెక్కలేనన్ని అవార్డులు, రివార్డులతో చిన్నతనంలోనే ప్రపంచఖ్యాతికెక్కిన ప్రిషా భవిష్యత్తులో మరిన్నో సాధించాలని ఉందని ఆనందం వ్యక్తం చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.