Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Assembly Election Results 2023: మేజిక్ అంటే ఇదే..! వెయ్యి లోపు మెజారిటీతో గెలుపొందిన ఎమ్మెల్యేలు!

ఈ సంవత్సరం చివరిలో జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ముఖ్యంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ఫలితాలు డిసెంబర్ 3న వచ్చాయి. హిందీ రాష్ట్రాల్లో బీజేపీ బంపర్ విజయం సాధించగా, తెలుగు రాష్ట్రం తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్‌ను ఆదరించారు.

Assembly Election Results 2023: మేజిక్ అంటే ఇదే..! వెయ్యి లోపు మెజారిటీతో గెలుపొందిన ఎమ్మెల్యేలు!
Assembly Election Results
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 04, 2023 | 4:34 PM

ఈ సంవత్సరం చివరిలో జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ముఖ్యంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ఫలితాలు డిసెంబర్ 3న వచ్చాయి. హిందీ రాష్ట్రాల్లో బీజేపీ బంపర్ విజయం సాధించగా, తెలుగు రాష్ట్రం తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్‌ను ఆదరించారు.

మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కొన్ని స్థానాల్లో అత్యల్ప మెజారిటీతో ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. 4 రాష్ట్రాల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. తెలంగాణలో త్రిముఖ పోరు సాగింది. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అభ్యర్థుల మధ్య నెట్ టు నెట్ పోటీ కనిపించిందనేదీ తెలుసుకుందాం…

మధ్యప్రదేశ్

ముందుగా భారతీయ జనతా పార్టీ 163 సీట్లు, కాంగ్రెస్ 66 సీట్లు గెలుచుకున్న మధ్యప్రదేశ్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ అరుణ్ భీమావత్ అతి తక్కువ తేడాతో గెలిచిన అభ్యర్థి. షాజాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి అరుణ్ భీమావత్ కేవలం 28 ఓట్ల తేడాతో గెలుపొందారు. కాంగ్రెస్‌కు చెందిన హుకుమ్ సింగ్ కరాదాపై ఆయన విజయం సాధించారు. వారాశివాని నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి ప్రదీప్ జైస్వాల్ 46 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆ తర్వాత మహిద్‌పూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి దినేష్ జైన్ 290 ఓట్ల తేడాతో గెలుపొందారు. కాగా, ధర్మపురి నుంచి బీజేపీ అభ్యర్థి కాలు సింగ్ ఠాకూర్ 356 ఓట్లతో గెలుపొందగా, బైహార్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సంజయ్ ఉకే 551 ఓట్లతో గెలుపొందారు.

ఛత్తీస్‌గఢ్

ఛత్తీస్‌గఢ్‌లో చూస్తే.. తక్కువ ఓట్ల తేడాతో గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంకేర్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థి ఆశారాం నేతమ్ కాంగ్రెస్ అభ్యర్థి శంకర్ ధ్రువపై కేవలం 16 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇది కాకుండా, ఛత్తీస్‌గఢ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు టిఎస్ సింగ్ డియో హోరాహోరీ పోటీలో ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి రాజేష్ అగర్వాల్ చేతిలో కేవలం 94 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

రాజస్థాన్

అదేవిధంగా, రాజస్థాన్‌లో కూడా చాలా స్థానాలు అత్యల్ప మెజారిటీతో గెలిచినవి ఉన్నాయి. ఇక్కడి కోట్‌పుట్లి అసెంబ్లీ స్థానంలో హోరాహోరీ పోటీ నెలకొంది. ఇందులో బీజేపీ అభ్యర్థి హన్సరాజ్ పటేల్ 321 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి రాజేంద్ర సింగ్‌పై విజయం సాధించారు. ఇది కాకుండా కతుమర్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి రమేష్ ఖేడీ 409 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి సంజనపై విజయం సాధించారు. అలాగే, జుంజును జిల్లా ఉదయపూర్వతి స్థానంపై జరిగిన ఆసక్తికర పోటీలో కాంగ్రెస్ అభ్యర్థి భగవాన్ రామ్ సైనీ 416 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి శుభకరన్ చౌదరిపై విజయం సాధించారు. అదేవిధంగా, భిల్వారా జిల్లాలోని జహజ్‌పూర్ స్థానంలో బీజేపీకి చెందిన గోపీచంద్ మీనా కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి ధీరజ్ గుర్జార్‌పై 580 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

తెలంగాణ

దీంతో పాటు తెలంగాణలోని కొన్ని స్థానాల్లో గట్టి పోటీ నెలకొంది. ఇక్కడ గెలుపు కనీస ఆధిక్యం 268 ఓట్లు. చేవెళ్ల అసెంబ్లీ స్థానంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కాలె యాదయ్యపై కాంగ్రెస్‌ అభ్యర్థి బీం భరత్‌‌పై 268 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అదే సమయంలో, హైదరాబాద్‌లోని యాకుత్‌పురాలో అసదుద్దీన్ ఒవైసీ పార్టీ AIMIM అభ్యర్థి జాఫర్ హుస్సేన్ MBT అభ్యర్థి అమ్జదుల్లా ఖాన్‌పై 878 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…