Kishan Reddy: లోపాలు సరిదిద్దుకుంటాం.. లోక్‌సభ ఎన్నికలే టార్గెట్‌గా పనిచేస్తాం.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
లోక్‌సభ ఎన్నికలే టార్గెట్‌గా పనిచేస్తామని తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో తాము ఆశించిన సీట్లు రాకపోయినప్పటికీ.. ఓటు శాతం పెరిగిందన్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రజాతీర్పును గౌరవిస్తామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తామని కిషన్ రెడ్డి స్పష్టంచేశారు. ఇప్పటిదాకా బీజేపీని తిట్టిన వాళ్లని తెలంగాణ ప్రజలు ఫామ్ హౌస్‌కి పంపించారని ఎద్దేవా చేశారు. దీన్ని బట్టి చూస్తే ప్రజలు మోదీని కోరుకుంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

లోక్‌సభ ఎన్నికలే టార్గెట్‌గా పనిచేస్తామని తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో తాము ఆశించిన సీట్లు రాకపోయినప్పటికీ.. ఓటు శాతం పెరిగిందన్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రజాతీర్పును గౌరవిస్తామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తామని కిషన్ రెడ్డి స్పష్టంచేశారు. ఇప్పటిదాకా బీజేపీని తిట్టిన వాళ్లని తెలంగాణ ప్రజలు ఫామ్ హౌస్‌కి పంపించారని ఎద్దేవా చేశారు. దీన్ని బట్టి చూస్తే ప్రజలు మోదీని కోరుకుంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. నాంపల్లి బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో మాట్లాడిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించిందని తెలిపారు. తెలంగాణలో 7 నుంచి 14 శాతానికి ఓటు బ్యాంకు పెరిగిందని.. గత ఎన్నికలతో పోల్చుకుంటే 100 శాతం ఓటింగ్ శాతం పెరిగిందని పేర్కొన్నారు. ఎంతో కష్టపడ్డాం.. అయినా అనుకున్న స్థాయిలో ఫలితాలు రాలేదన్నారు. జాతీయ స్థాయి నుంచి.. మండల, బూత్ స్థాయి వరకు సమీక్ష జరిపి పార్లమెంట్ ఎన్నికలకు తమ తప్పులను సరిదిద్దుకుంటామని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు డబ్బులను పంచి గెలవాలని చూశాయన్నారు. కాంగ్రెస్ కు.. తెలంగాణలో ఉన్న పరిస్థితి ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో లేదన్నారు. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారాన్ని బీజేపీ తీసుకుందని.. మధ్యప్రదేశ్ లో గతంలో కాంటే ఎక్కువ మెజారిటీ ఇచ్చారన్నారు. కామారెడ్డిలో ఒక ముఖ్యమంత్రి, ఇంకొకరు కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డిని ఓడించి రికార్డు సృష్టించామని పేర్కొన్నారు. కాటిపల్లి వెంకట రమణా రెడ్డిని అభినందిస్తున్నామన్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో భారీ విజయం సాధిస్తామని తెలిపారు.
ఇవ్వాళ వచ్చిన 14 శాతం నుంచి ఇంకా పెంచుకుంటూ వెళ్ళాలని.. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని పార్టీ శ్రేణులకు పిలునిచ్చారు. ప్రచారానికి వెళ్లిన సమయంలో బిఆర్ఎస్, కాంగ్రెస్ ఓటర్లు కూడా.. తాము అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి ఓటు వేస్తామో తెలియదు.. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బీజేపీకి వేస్తామని చెప్పారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తగ్గేదే లేదు.. 5 ఏండ్ల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికలపైనా ఇప్పటి నుంచే దృష్టి పెడతామన్నారు. తాము గెలిచింది 8 స్థానాలే కావచ్చు.. కానీ తమకు 80 మంది బలాన్ని ఇచ్చారన్నారు. భవిష్యత్ లో మరింత కసితో పనిచేస్తామని.. క్రియాశీల ప్రతిపక్ష పార్టీగా తమ పాత్ర పోషిస్తాం.. ప్రజల పక్షాన నిలబడుతామని చెప్పారు. తమపై బురద జల్లి చివరకు కేసీఆరే.. ఫామ్ హౌజ్ కు వెళ్ళారన్నారు. తమ పోరాటం కాంగ్రెస్ కు లాభం చేకూర్చింది.. అయినా పోరాటం చేస్తూనే ఉంటామన్నారు.
తమ ఓటమిపై అన్ని స్థాయిల్లో సమీక్ష నిర్వహించుకుని ముందుకు వెళతామన్నారు. ఇవ్వాళ ఢిల్లీకి వెళ్తున్నానని.. పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవ్వడంపై, ఈ ఎన్నికల్లో జరిగిన పోలింగ్ సరళిపై వివరిస్తానన్నారు. తమ పార్టీ వాళ్లే.. తనను ఓడించారని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కిషన్ రెడ్డి.. ఆ వ్యాఖ్యలు తన దృష్టికి రాలేదన్నారు. కర్ణాటక ఎన్నికలు, తమపై బురద జల్లడం, ఇతర కారణాల వల్ల ఓడిపోయామని.. ఇతర కారణాలపై కూడా విశ్లేషణ చేసుకుంటామని తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..