Telangana Election Results 2023: కరీంనగర్‌లో బీజేపీ కీలక నేతల కొంపముంచిన గ్యాప్.. ఆరా తీస్తున్న అధిష్టానం

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఈటెల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ భారతీయ జనతా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. సంజయ్, అరవింద్ ఎంపీలుగా ఉన్నప్పటికీ, ఎంఎల్ఎగా పోటీ చేశారు. అయితే, ఈ ముగ్గురు ఖచ్చితంగా గెలుస్తారనే పూర్తి ధీమాతో ఉంది బీజేపీ అధిష్టానం. కానీ, ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా వచ్చాయి.

Telangana Election Results 2023: కరీంనగర్‌లో బీజేపీ కీలక నేతల కొంపముంచిన గ్యాప్.. ఆరా తీస్తున్న అధిష్టానం
Sanjay Kumar,aaravind, Etela Rajendar
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 04, 2023 | 3:52 PM

తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీలో వాళ్ళంతా కీలక నేతలు. అంతేకాదు, బీజేపీ అధికారంలోకి వస్తే, సీఎం రేసులో ఉన్న నేతలు. ఈ జిల్లాలో అధికంగా సీట్లు గెలుస్తామన్న నమ్మకం బీజేపీకి ఉంది. కానీ, ఆ ముగ్గురు నేతల లెక్కలు తప్పాయి. సమన్వయం లోపం, అంతర్గత వి బేధాలు కారణంగానే… గెలువలేకపోయారనే చర్చ సాగుతుంది. బీజేపీలో సీనియర్ నేతలు కరీంనగర్ జిల్లాకు చెందిన ఈటెల రాజేందర్, బండి సంజయ్ కుమార్, ధర్మపురి అరవింద్ ఓటమి పాలయ్యారు. ఈ ముగ్గురు నేతలు కలిసి పని చేస్తే ఖచ్చితంగా గెలిచేవారనే చర్చ సాగుతుంది. ఈ ముగ్గురు నేతలు ఓడిపోవడంతో అటు పార్టీ కూడా డీలా పడిపోయింది.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఈటెల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ భారతీయ జనతా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. సంజయ్, అరవింద్ ఎంపీలుగా ఉన్నప్పటికీ, ఎంఎల్ఎగా పోటీ చేశారు. అయితే, ఈ ముగ్గురు ఖచ్చితంగా గెలుస్తారనే పూర్తి ధీమాతో ఉంది బీజేపీ అధిష్టానం. కానీ, ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా వచ్చాయి. అయితే, ఈ ముగ్గురు నేతలు మాట్లాడుకోవడం లేదు. ఎక్కడ కూడా కలిసి పని చేయడంలేదు. బీజేపీ అధినాయకత్వం తెలంగాణ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ, ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో ఎలాంటి సమావేశం నిర్వహించుకోలేదు.

ఇదిలావుంటే, బండి సంజయ్ కుమార్‌ను అధ్యక్ష పదవి తొలగింపులో ఈటెల రాజేందర్ పాత్ర కీలకమని గుర్రుగా ఉన్నారు జిల్లా పార్టీ నేతలు. అప్పటి నుంచి దూరం.. దూరంగా ఉంటున్నారనే టాక్ ఉంది. అదేవిధంగా… అరవింద్ సంజయ్‌కు గ్యాప్ ఉంది. ఎలాంటి సమావేశం నిర్వహించుకోలేదు. ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురు పోటీ చేసినా, ఒక్కసారి కూడా కలపులేదు. అంతేకాదు, ఈ ఇద్దరి నేతల గ్యాప్ కారణంగా బేధాలు తలెత్తాయన్నదీ సగటు బీజేపీ కార్యకర్త అనుకుంటున్నారట.

అంతర్గత విబేధాలే బీజేపీ కొంప ముచ్చాయి. కరీంనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బండి సంజయ్ కుమార్ మాత్రమే గట్టి పోటీ ఇచ్చారు. స్వల్ప ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఈటెల రాజేందర్ 15వేలకు పైగా మెజారిటీ తేడాతో ఓడిపోయారు. అదే విధంగా ధర్మపురి అరవింద్ 10 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. రాష్ట్ర పార్టీలో కీలక పాత్ర పోషించే నేతలు ఓడిపోవడంతో అంతర్గత బేధాలు కారణమని చర్చించుకుంటున్నారు కార్యకర్తలు. ఈ ముగ్గురు కలిసి పని చేస్తే, ఫలితాలు తమకు అనుకూలంగా ఉండేవని పార్టీలో చర్చ మొదలైంది.

అదే విధంగా, చాలా వరకు కేడర్ కూడా ఉత్సాహంగా పని చేయలేదన్న టాక్ వినిపిస్తోంది. హుజురాబాద్‌లో ఈటెల రాజేందర్ పాత బీజేపీ నేతలను పట్టించుకోలేదట. ఈ కారణంగా చాలా మంది బీజేపీ నాయకులు సైలెంట్ అయ్యారట. హుజురాబాద్‌కు చెందిన కృష్ణారెడ్డి జిల్లా అధ్యక్షుడుగా పని చేస్తున్నారు. ఆయనకు రాజేందర్ ఎలాంటి బాధ్యతలు ఇవ్వలేదు. ముఖ్య నేతల బేధాల కారణంగా, సెకండ్ కేడర్ కూడా దూరంగా పని చేశారట. సంజయ్ కూడా కరీంనగర్‌లో ఓ వర్గం కనీస సహకరం అందించలేదని ఈటెల వర్గం చెప్పుకుంటుందట.

అయితే, కలిసి కట్టుగా పని చేస్తే, ఈ ముగ్గురు నేతలు గెలిచే వారే చర్చ బీజేపీలో సాగుతుంది. కీలకమైన నేతలు ఓడిపోవడంతో, అధిష్టానం ఆరా తీస్తుంది. ముఖ్య నేతలు దూరంగా ఉంటే, వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం పడుతుందని భావిస్తున్నారట కమలనాథులు. ఆదిలాబాద్, నిజమాబాద్ ఉమ్మడి జిల్లాల్లో బీజేపీకి మంచి ఫలితాలు వచ్చాయి. కానీ, కరీంనగర్‌లో మాత్రం ఎలాంటి ఫలితం రాలేదు. దీంతో ఓటమి సమీక్షా మొదలు పెట్టారు ముఖ్య నేతలు. మొత్తానికి ఈ ఫలితాలు భారతీయ జనతా పార్టీని తీవ్ర నిరాశకు గురి చేశాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…