Telangana Congress CM: కాసేపట్లో తెలంగాణ సీఎం పేరు.. సీఎల్పీ నేత ఎంపికపై ఢిల్లీలో కొనసాగుతున్న కసరత్తు..
Telangana Congress CLP Leader: సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు అప్పగించింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. 40 నిమిషాల పాటు సాగిన సీఎల్పీ సమావేశంలో.. ఏకవాక్య తీర్మానాన్ని ఢిల్లీకి పంపించారు పరిశీలకులు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన ఏకవాక్య తీర్మానాన్ని.. భట్టి, ఉత్తమ్ సహా పదిమంది ఎమ్మెల్యేలు బలపరిచారు.
Telangana Congress CLP Leader: సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు అప్పగించింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. 40 నిమిషాల పాటు సాగిన సీఎల్పీ సమావేశంలో.. ఏకవాక్య తీర్మానాన్ని ఢిల్లీకి పంపించారు పరిశీలకులు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన ఏకవాక్య తీర్మానాన్ని.. భట్టి, ఉత్తమ్ సహా పదిమంది ఎమ్మెల్యేలు బలపరిచారు. ఢిల్లీ నుంచి కాసేపట్లో నిర్ణయం వెలువడనుంది. సీఎల్పీ సమావేశానికి ఏఐసీసీ పరిశీలకులుగా డీకే శివకుమార్‌తో పాటు దీప్‌దాస్ మున్షీ, జార్జ్, అజయ్, మురళీధరన్ హాజరయ్యారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానం చేశామన్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఇవ్వాలని ఎమ్మెల్యేలు చెప్పారన్నారు. ఆ మేరకు ఈ సమావేశంలో తీర్మానం చేసినట్లు చెప్పారు.
హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి సీఎల్పీ నేత ఎంపిక జరుగుతుంది. అనంతరం CLP నిర్ణయాన్ని రాజ్‌భవన్‌కు తెలుపుతుంది కాంగ్రెస్ పార్టీ. అధిష్టానం నిర్ణయం వచ్చిన వెంటనే సీఎం అభ్యర్థి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సంప్రదాయం ప్రకారం ఇప్పటికే గవర్నర్‌తో సమావేశమైన కాంగ్రెస్ నేతలు.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిదిగా విజ్ఞప్తి చేశారు. మరోవైపు ప్రమాణ స్వీకారానికి ఇప్పటికే రాజ్‌భవన్ అధికారులు ఏర్పాట్లు చేశారు. రాజ్‌భవన్ దగ్గర బందోబస్తును కూడా పెంచారు పోలీసులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..