DK Shivakumar: వ్యూహం.. ప్రతివ్యూహం.. తెలంగాణ రాజకీయాల్లో డీకే శివకుమార్ మార్క్.. ఫలించిన ట్రబుల్ షూటర్ మంత్రం..!

Telangana Election Results : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ మధ్య జరిగిన హోరాహోరి పోరులో కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకుంది. 119 నియోజకవర్గాల్లో 64 స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా.. బీఆర్ఎస్ పార్టీ 39, బీజేపీ 8, ఎంఐఎం 7, సీపీఐ 1 గెలుపొందాయి. ఆసక్తికరంగా సాగిన ఎన్నికల పోరులో కర్ణాటక రాజకీయాలు సైతం ప్రభావితం చేశాయి. 2023 మేలో జరిగిన ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించడం.. ఆ తర్వాత జరిగిన పరిణామాలు తెలంగాణ రాజకీయాలను, కాంగ్రెస్ పుంజుకోవడంలో వ్యూహాత్మకంగా మార్చాయి.

DK Shivakumar: వ్యూహం.. ప్రతివ్యూహం.. తెలంగాణ రాజకీయాల్లో డీకే శివకుమార్ మార్క్.. ఫలించిన ట్రబుల్ షూటర్ మంత్రం..!
Revanth Reddy Dk Shivakumar
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 04, 2023 | 4:01 PM

Telangana Election Results : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ మధ్య జరిగిన హోరాహోరి పోరులో కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకుంది. 119 నియోజకవర్గాల్లో 64 స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా.. బీఆర్ఎస్ పార్టీ 39, బీజేపీ 8, ఎంఐఎం 7, సీపీఐ 1 గెలుపొందాయి. ఆసక్తికరంగా సాగిన ఎన్నికల పోరులో కర్ణాటక రాజకీయాలు సైతం ప్రభావితం చేశాయి. 2023 మేలో జరిగిన ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించడం.. ఆ తర్వాత జరిగిన పరిణామాలు తెలంగాణ రాజకీయాలను, కాంగ్రెస్ పుంజుకోవడంలో వ్యూహాత్మకంగా మార్చాయి. ముఖ్యంగా ఆరు నెలల కాలంలో కాంగ్రెస్ పుంజుకోవడంలో కర్ణాటక రాజకీయం తెలంగాణలో పనిచేసిందని పరోక్షంగా చెప్పవచ్చు.. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు తర్వాత అక్కడి ఉప ముఖ్యమంత్రి, ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ వ్యూహాలు తెలంగాణలో బాగా పనిచేశాయి. అందుకే అప్పట్లో తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం.. వయా బెంగళూరు.. ఢిల్లీ కేంద్రంగా కొనసాగింది. తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఉన్న అసంతృప్తులను డీకే శివకుమార్ మంత్రం బుజ్జగించడంలో బాగా పనిచేసింది. తెలంగాణ కాంగ్రెస్ పంచాయితీ.. బెంగళూరు వేదికగా పరిష్కరించడంలో డీకే మార్క్ ప్రభావితం చేసిందని చెప్పవచ్చు.. వరుసగా డీకే శివకుమార్ ను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కలవడం.. ఆ తర్వాత భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. పలువురు నేతలు భేటీ అవ్వడం అప్పట్లో సంచలనంగా నిలిచింది. ఆ తర్వాత కాంగ్రెస్ అసంతృప్తులకు చెక్ పెట్టడంలో కూడా ఆయన మంత్రాంగమే పనిచేసిందని చెప్పవచ్చు. ఆ తర్వాత బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు కూడా డీకే శివకుమార్ మార్క్ బాగానే పనిచేసింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, మైనంపల్లి హనుమంతరావు.. ఇలా బీఆర్ఎస్ ను వీడిన నేతలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే విషయంలో డీకే శివకుమార్ కీలకంగా వ్యవహరించారు. చాలామంది నేతలతో డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి బెంగళూరు వేదికగా భేటీ అవ్వడం.. ఆ తర్వాత వారిని కాంగ్రెస్ లోకి రప్పించడంలో ప్రధాన పాత్ర పోషించారు.

అంతేకాకుండా.. వైఎస్ఆర్‌టీపీ కాంగ్రెస్ లో విలీనం అంశంపై చర్చ కూడా బెంగళూరు వేదికగానే జరిగింది. వైఎస్ షర్మిల.. డీకే శివకుమార్ తో భేటీ తర్వాతనే ఈ అంశం తెరపైకి వచ్చింది. ఆ తర్వాత వైఎస్ షర్మిల సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో భేటీ అయినప్పటికీ.. కొన్ని కారణాలతో విలీనం ప్రక్రియ నిలిచింది. ఈ క్రమంలోనే షర్మిల తెలంగాణలో పోటీ చేస్తానని ప్రకటించారు.. ఆ తర్వాత డీకే శివకుమార్ ఆమెతో సంప్రదించి.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చకుండా.. ఆమెను పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి సహకారం అందించేలా చేయడంలో డీకే శివకుమార్ కీలక పాత్ర పోషించారు.

డీకే శివకుమార్ మార్క్ రాజకీయం..

అయితే, కర్ణాటకలో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ.. అదే వ్యూహంతో తెలంగాణలో కూడా ముందుకుసాగింది. తెలంగాణ రాజకీయాలను, ఇక్కడ పరిస్థితుల గురించి ముందునుంచే అవగాహనతో ఉన్న డీకే శివకుమార్ వ్యూహాలను కూడా పార్టీ పరిగణలోకి తీసుకుంది. అంతేకాకుండా ప్రచారంలో సైతం డీకే అస్త్రం బాగానే పనిచేసింది. కానీ.. డీకే శివకుమార్.. చేసిన కరెంట్ వ్యాఖ్యలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కాస్త ఇబ్బంది కలిగించాయి. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డీకే శివకుమార్.. బీఆర్ఎస్ వ్యూహాలను ఎదుర్కొవడంలో వారు చేసిన ప్రసంగాలు బాగానే కలిసొచ్చాయి.

ప్రచారం ముగిసే వరకు తెలంగాణలోనే తిష్టవేసిన డీకే శివకుమార్.. ఇక్కడి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా బాగానే తన మార్క్ రాజకీయాలను చేశారు. అంతేకాకుండా.. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపునకు కీలకంగా వ్యవహరించిన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు వ్యూహాలు.. డీకే శివకుమార్ మంత్రాంగం బాగానే పనిచేసిందని చెప్పవచ్చు.. అంతేకాకుండా.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే లాంటి అగ్రనేతలు ప్రచారం.. వ్యూహాలు కూడా బాగా పనిచేశాయి. ఆరు గ్యారెంటీల వ్యూహాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ వ్యూహం ఫలించింది.

డీకేను రంగంలోకి దింపిన అధిష్టానం..

ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనావేయడంతో ఎమ్మెల్యే కొనుగోళ్ల వ్యవహారం తెరపైకి వచ్చింది. చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీ మారబోతున్నారని ప్రచారం జరగడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అప్రమత్తమైంది. వెంటనే ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ ను రంగంలోకి దించింది. ఫలితాలకు ఒక్కరోజు ముందుగానే తెలంగాణకు వెళ్లాలని అధిష్టానం సూచించడంతో డీకే శివకుమార్ హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు. ఆ వెంటనే కర్ణాటక మంత్రులు, ఎమ్మెల్యేలను కూడా తెలంగాణకు రావాలని సూచించారు. ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో ఎమ్మెల్యేను పంపించి.. వారిని హైదరాబాద్ తీసుకురావాలని ఆదేశించారు. అంతేకాకుండా.. వారిని సమన్వయ పరుస్తూ, వారితో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు చేజారకుండా పన్నిన డీకే వ్యూహాలు బాగానే ఫలించాయని చెప్పవచ్చు.. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని.. ముఖ్యంగా అధిష్టానం డీకేను రంగంలోకి దించి.. కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకోవడంలో, ఎమ్మెల్యేను సమన్వయ పరచడంలో చేసిన మార్క్ రాజకీయం.. కాంగ్రెస్ లో మరింత జోష్ నింపింది.

ఎమ్మెల్యేలు హైదరాబాద్ వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలంటూ డీకే శివకుమార్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం రాజ్‌భవన్ కు వెళ్లి గవర్నర్ తమిళిసై కి లేఖను అందజేసింది. ఆ తర్వాత డీకే శివకుమార్, ఏఐసీసీ పరిశీలకులు దీప్‌దాస్‌ మున్షీ, జార్జ్‌, అజయ్‌, మురళీధరన్‌ కలిసి గచ్చిబౌలి లోని ఎల్లా హోటల్ లో గెలుపొందిన అభ్యర్థులతో భేటీ అయ్యారు.. సీఎల్పీ భేటీలో ఎమ్మెల్యే అభిప్రాయాలను.. అలాగే.. సీఎం రేసులో వారి అభిప్రాయాలను సేకరించి.. అధిష్టానానికి పంపించారు.

గతంలో జరిగిన పరిస్థితులు, అనుభవాలను దృష్టిలో ఉంచుకుని.. పార్టీ అధిష్టానం డీకే శివకుమార్ కు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పలు వ్యవహారాలను అప్పగించిందని పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఏదిఏమైనప్పటికీ.. తెలంగాణ రాజకీయాల్లో డీకే మంత్రాంగం బాగానే పనిచేసిందని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు సహకరించిందన్న విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
పిస్తా తింటున్నారా..? అయితే, ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి.!
పిస్తా తింటున్నారా..? అయితే, ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి.!
గోవాలో భార్యతో కలిసి ఎంఎస్‌ ధోనీ డ్యాన్స్‌..
గోవాలో భార్యతో కలిసి ఎంఎస్‌ ధోనీ డ్యాన్స్‌..
ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ ఫోన్‌లపై భారీ తగ్గింపు..!
ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ ఫోన్‌లపై భారీ తగ్గింపు..!
న్యూ ఇయర్ వేళ పుట్టపర్తి సాయిబాబా సన్నిధిలో సాయిప‌ల్ల‌వి..వీడియో
న్యూ ఇయర్ వేళ పుట్టపర్తి సాయిబాబా సన్నిధిలో సాయిప‌ల్ల‌వి..వీడియో
అనంత్ అంబానీ ధరించిన వాచ్‌ ధరెంతో తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే
అనంత్ అంబానీ ధరించిన వాచ్‌ ధరెంతో తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే
వావ్..! వాటే క్రేజీ ఐడియా.. బొకేలు, శాలువాలకి బదులు కూరగాయలు..
వావ్..! వాటే క్రేజీ ఐడియా.. బొకేలు, శాలువాలకి బదులు కూరగాయలు..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..