APPSC Group 2 Revised Syllabus: ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 సిలబస్‌లో కీలక మార్పులు.. త్వరలో నోటిఫికేషన్‌ విడుదల

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 ఖాళీల భర్తీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ త్వరలో నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. ఇప్పటికే గ్రూప్‌ 2 ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక శాఖ ఆమోదం తెలుపుతూ జీవో జారీ చేసింది కూడా. ఈ మేరకు త్వరలో ప్రకటన విడుద‌ల చేయనున్నట్లు ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ గతంలో వెల్లడించారు. వచ్చే వారంలో నోటిఫికేషన్‌ విడదల చేయనున్నట్లు సమాచారం. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో ఏపీపీఎస్సీ గ్రూప్-2 రాత పరీక్షలకు కొత్త సిలబస్ విడుదల చేసింది. మొత్తం 450 మార్కులకు గాను రెండు దశల రాత పరీక్షల ద్వారా..

APPSC Group 2 Revised Syllabus: ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 సిలబస్‌లో కీలక మార్పులు.. త్వరలో నోటిఫికేషన్‌ విడుదల
APPSC Group 2 Revised Syllabus
Follow us

|

Updated on: Dec 03, 2023 | 3:10 PM

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 ఖాళీల భర్తీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ త్వరలో నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. ఇప్పటికే గ్రూప్‌ 2 ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక శాఖ ఆమోదం తెలుపుతూ జీవో జారీ చేసింది కూడా. ఈ మేరకు త్వరలో ప్రకటన విడుద‌ల చేయనున్నట్లు ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ గతంలో వెల్లడించారు. వచ్చే వారంలో నోటిఫికేషన్‌ విడదల చేయనున్నట్లు సమాచారం. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో ఏపీపీఎస్సీ గ్రూప్-2 రాత పరీక్షలకు కొత్త సిలబస్ విడుదల చేసింది. మొత్తం 450 మార్కులకు గాను రెండు దశల రాత పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు అప్పట్లో ప్రకటించింది. మొదటి దశ (ప్రిలిమ్స్‌)లో 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. రెండో దశలో 300 మార్కులకు మెయిన్స్‌ పరీక్ష నిర్వహిస్తారు. అయితే మొదటి దశ పరీక్ష అయిన ప్రిలిమ్స్‌లో అర్హత సాధిస్తేనే మెయిన్స్‌కు ఎంపికవుతారు.

కాగా తాజాగా గ్రూప్‌-2 సిలబస్‌లో ఏపీపీఎస్సీ కొన్ని కీలక మార్పులు చేసింది. ప్రిలిమ్స్‌లో కొత్తగా భారతీయ సమాజం టాపిక్‌ను చేర్చారు. దీంతో ప్రిలిమినరీ పరీక్షలో భారతదేశ చరిత్ర, భూగోళశాస్త్రం, భారతీయ సమాజం, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ అంశాల నుంచి 150 మార్కులకు ప్రశ్నలు రానున్నాయి. మెయిన్స్‌ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌ 150 మార్కులకు ఉంటుంది. అంటే మొత్తం 300 మార్కులకు పరీక్ష ఉంటుంది. మెయిన్స్‌ పేపర్ 1 పరీక్షలో ఆంధ్రప్రదేశ్ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం అంశాలు ఉంటాయి. పేపర్-2లో భారతదేశ-ఏపీ ఆర్థిక వ్యవస్థ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ టాపిక్‌ల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 ప్రిలిమ్స్ పరీక్ష విధానం ఇలా..

గ్రూప్‌ 2 ప్రిలిమ్స్ పరీక్ష 150 మార్కులకు ఉంటుంది. భారతదేశ చరిత్ర (ప్రాచీన, మధ్య, ఆధునిక చరిత్ర)లో 30 మార్కులకు 30 ప్రశ్నలు, భూగోళశాస్త్రం(జనరల్‌, ఫిజికల్‌ జాగ్రఫీలో 30 మార్కులకు 30 ప్రశ్నలు, ఎకనమిక్‌ జాగ్రఫీ ఆఫ్‌ ఇండియా అండ్‌ ఏపీలో 30 మార్కులకు 30 ప్రశ్నలు, హ్యూమన్‌ జాగ్రఫీ ఆఫ్‌ ఇండియా అండ్‌ ఏపీ)లో 30 మార్కులకు 30 ప్రశ్నలు, భారతీయ సమాజం (స్ట్రక్చర్‌ ఆఫ్‌ ఇండియన్‌ సొసైటీ, సోషియల్‌ ఇష్యూస్‌, వెల్ఫేర్‌ మెకానిజం)లో 30 మార్కులకు 30 ప్రశ్నలు, కరెంట్ అఫైర్స్ (రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలు)లో 30 మార్కులకు 30 ప్రశ్నలు, మెంటల్ ఎబిలిటీ (లాజికల్‌ రీజనింగ్‌,మెంటల్‌ ఎబిలిటీ, బేసిక్‌ న్యూమరసీ)లో 30 మార్కులకు 30 ప్రశ్నలు.. మొత్తం 7 అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

ఇవి కూడా చదవండి

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్ష విధానం ఇలా..

గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్ష 300 మార్కులకు ఉంటుంది. పేపర్-1 (ఆంధ్రప్రదేశ్ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం)లో 150 మార్కులకు 150 ప్రశ్నలు అడుగుతారు. పేపర్-2 (భారతదేశ, ఏపీ ఆర్థిక వ్యవస్థ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ)లో 150 మార్కులకు 150 ప్రశ్నలు అడుగుతారు.

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 కొత్త సిలబస్ ఒక్క క్లిక్‌తో డౌన్‌లోడ్‌ చేసుకోండి.

మరిన్ని విద్యాసంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.

పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు