Agnipath Scheme: చరిత్రలో తొలిసారిగా అగ్నివీర్ వాయులో యువతుల నియామకం.. శిక్షణ పూర్తి

'అగ్నిపథ్' పథకం అనేది మిలిటరీకి కొత్త రిక్రూట్‌మెంట్ మోడల్.. ఇది యువతీ యువకులకు ఇండియన్ ఆర్మీ (ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్)లోని 3 శాఖలలో సేవ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ పథకాన్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 14 జూన్ 2022న ప్రారంభించారు. ఈ అగ్నిపథ్ పథకంలో నియమించబడిన వ్యక్తులను అగ్నివీర్ అంటారు.

Agnipath Scheme: చరిత్రలో తొలిసారిగా అగ్నివీర్ వాయులో యువతుల నియామకం.. శిక్షణ పూర్తి
Agnipath Scheme
Follow us
Surya Kala

|

Updated on: Dec 03, 2023 | 8:11 PM

మన దేశ రక్షణ కోసం త్రివిధ దళాలు పనిచేస్తాయని తెలుసు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో తమ విధులను నిర్వహిస్తారు. అయితే తొలిసారిగా యువతులు భారత వైమానిక దళానికి చెందిన “అగ్నివీర్ వాయు”లో  తొలిసారిగా నియమితులయ్యారు. కర్ణాటక లోని బెలగావిలోని ఎయిర్‌మ్యాన్ ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షణ పొందిన 153 మంది యువతుల మొదటి బ్యాచ్ ఈరోజు (డిసెంబర్ 02 ) డిపార్చర్ మార్చ్ నిర్వహించింది. 2280 మంది యువకులు, 153 మంది యువతులు 22 వారాల పాటు కఠిన శిక్షణ పొందారు. ఇప్పుడు వైమానిక దళంలో చేరారు.

ఆరు నెలల శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు అందజేశారు. ఎయిర్ మార్షల్ రాధాకృష్ణన్ రాడిష్ ఫైర్‌మెన్ గౌరవాన్ని అందుకున్నారు. విజయవంతంగా శిక్షణ పొంది యువతులు  బయటకు రాగానే కుటుంబసభ్యులు తమ కుమార్తెలను హక్కును చేర్చుకున్నారు. ఆలింగనం చేసుకుని ఆనందాన్ని ముంచెత్తారు. వీర వనితలు తల్లిదండ్రులను కౌగిలించుకుని హర్షం వ్యక్తం చేశారు.

అగ్నివీర్ అంటే ఏమిటి?

‘అగ్నిపథ్’ పథకం అనేది మిలిటరీకి కొత్త రిక్రూట్‌మెంట్ మోడల్.. ఇది యువతీ యువకులకు ఇండియన్ ఆర్మీ (ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్)లోని 3 శాఖలలో సేవ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ పథకాన్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 14 జూన్ 2022న ప్రారంభించారు. ఈ అగ్నిపథ్ పథకంలో నియమించబడిన వ్యక్తులను అగ్నివీర్ అంటారు.

ఇవి కూడా చదవండి

అగ్నిపథ్ ప్రవేశం మొదట 4 సంవత్సరాల కాలానికి షెడ్యూల్ చేయబడింది. ఈ 4 సంవత్సరాలలో రిక్రూట్ అయిన వారికి అవసరమైన నైపుణ్యాల్లో సాయుధ దళాల ద్వారా శిక్షణ ఇస్తారు. ఈ పథకం కింద రిక్రూట్ అయిన వారిని అగ్నివీర్ అంటారు.

ఈ పథకం కింద ఏటా 46 వేల మంది సైనికులను నియమిస్తారు. శాశ్వతంగా 25% మంది సైనికులు పని చేస్తారు. 15 సంవత్సరాల పాటు విధులను నిర్వహిస్తారు. మిగిలిన వారు పదవీ విరమణ చేయవచ్చు. వారికి  సేవా నిధిని ఇస్తారు. ఇలా రూ.11.71 లక్షలు పొందే అవకాశం ఉంది. ఈ మొత్తం పన్ను రహితం. సాయుధ దళాల్లో  సాధారణ కేడర్‌గా నమోదు చేసుకోవడానికి ఎంపికైన వ్యక్తులు కనీసం 15 సంవత్సరాల పాటు సేవ చేయాలి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..