Taj Mahal: యమునలో పెరుగుతున్న కాలుష్యం.. కీటకాల కారణంగా గ్రీన్ కలర్‌లోకి మారుతున్న తాజ్‌మహల్

గోల్డీ చిరోనోమస్ అనేది ఒక రకమైన కీటకం. ఇది మురికి, కలుషితమైన నీటిలో వృద్ధి చెందుతుంది. ఆడ కీటకం ఒకేసారి వెయ్యి గుడ్లు పెడుతుంది. కొత్త కీటకాలు పుడతాయి. ఇది రెండు రోజులు జీవించి ఉంటుంది.  తాజ్ మహల్ గోడల సహా వివిధ భాగాల గోడలమీద తన మలం విడిచి .. తెల్లని రాయిని ఆకుపచ్చగా మారుస్తోంది. ASI ప్రకారం ఈ కీటకం మార్చి-ఏప్రిల్ నుండి సెప్టెంబర్-అక్టోబర్ వరకు యమునా నదిలో కనిపిస్తుంది, ఉష్ణోగ్రత 28-35 డిగ్రీల సెల్సియస్ వద్ద జీవించి ఉంటుంది.

Taj Mahal: యమునలో పెరుగుతున్న కాలుష్యం.. కీటకాల కారణంగా గ్రీన్ కలర్‌లోకి మారుతున్న తాజ్‌మహల్
Taj Mahal Turned Green Coloured
Follow us
Surya Kala

|

Updated on: Dec 02, 2023 | 3:50 PM

ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటి తాజ్ మహల్. తెల్లని పాలరాయితో వెండి వెన్నెలతో పోటీపడుతూ ప్రేమకు చిహ్నంగా కీర్తించబడుతున్న తాజ్ మహల్ తన రంగుని కోల్పోతుంది. తెల్లటి పాలరాయి పచ్చగా కనిపిస్తుంది. ఇలా రంగు మారడానికి కీటకమే కారణం అని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తెలిపింది. ఈ చిన్న కీటకాల వల్ల తాజ్‌మహల్‌కు ప్రమాదం పొంచి ఉందని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) తెలిపింది. ఈ కీటకాలు పాలరాయి రంగును మారుస్తున్నాయి. 2015లో తొలిసారిగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే 2020లో కోవిడ్ సమయంలో ఈ కీటకాల ప్రభావం తగ్గింది. అయితే ఇప్పుడు మరోసారి ఈ కీటకాలు స్మారక చిహ్నానికి సమస్యగా మారాయి. వీటిని గోల్డీ చిరోనోమస్ అని పిలుస్తారు.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గతేడాది ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు ఈ కీటకాలు కనుమరుగయ్యాయి. అయితే ఇప్పుడు వాతావరణంలో అనేక మార్పులు వచ్చాయి. దీంతో ఉష్ణోగ్రతలో తగ్గుదల ఉన్నప్పటికీ ఈ గోల్డీ చిరోనోమస్ కీటకాల సంఖ్య  ఎక్కువగా ఉంది. దీనికి కారణం ఈ కీటకాల పునరుత్పత్తి అని.. అందుకనే వీటి సంఖ్య పెరుగుతోంది.

ఆగ్రాలోని ASI సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ రాజ్‌కుమార్ పటేల్ మాట్లాడుతూ .. తాజ్ మహల్ ఉపరితలంపై ఈ కీటకాల పెరుగుదలను  నిరోధించడానికి ASI ఒక అధ్యయనం చేస్తోందని తెలిపారు. గోల్డీ చిరోనోమస్ అంటే ఏమిటి.. ఇవి తాజ్ మహల్‌ను ఎందుకు పాడు చేస్తున్నాయి.. ఇవి ఇక్కడికి చేరుకున్నాయంటే..

ఇవి కూడా చదవండి

గోల్డీ చిరోనోమస్ అంటే ఏమిటి?

గోల్డీ చిరోనోమస్ అనేది ఒక రకమైన కీటకం. ఇది మురికి, కలుషితమైన నీటిలో వృద్ధి చెందుతుంది. ఆడ కీటకం ఒకేసారి వెయ్యి గుడ్లు పెడుతుంది. కొత్త కీటకాలు పుడతాయి. ఇది రెండు రోజులు జీవించి ఉంటుంది.  తాజ్ మహల్ గోడల సహా వివిధ భాగాల గోడలమీద తన మలం విడిచి .. తెల్లని రాయిని ఆకుపచ్చగా మారుస్తోంది.

ASI ప్రకారం ఈ కీటకం మార్చి-ఏప్రిల్ నుండి సెప్టెంబర్-అక్టోబర్ వరకు యమునా నదిలో కనిపిస్తుంది, ఉష్ణోగ్రత 28-35 డిగ్రీల సెల్సియస్ వద్ద జీవించి ఉంటుంది. అయితే ఈ ఏడాది నవంబరు వరకు ఈ ఉష్ణోగ్రత ఉంది. దీంతో వీటి సంతానోత్పత్తి సమయం పెరిగింది. తత్పలితంగా ఈ కీటకాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి.

ది ప్రింట్ నివేదికలో ASI సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ రాజ్‌కుమార్ పటేల్ దీనిని ఎదుర్కోవటానికి ఒక అధ్యయనం ప్రారంభించినట్లు చెప్పారు. ఇది పూర్తి కావడానికి దాదాపు ఒక సంవత్సరం పట్టవచ్చు. కీటకాల సంఖ్య పెరగడం తాజ్ మహల్ అందంపై నేరుగా ప్రభావం చూపుతోంది. 28 నుండి 35 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఈ కీటకాలు వృద్ధి చెందడానికి, చురుకుగా ఉండటానికి సరైన సమయం అని భావిస్తున్నారు. ఈ సంవత్సరం తక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ కీటకాలు చురుకుగా కదులుతాయి.

ASI రసాయన శాఖ ఈ కీటకాలను తొలగించడానికి కృషి చేస్తోంది. వీటి సంతానోత్పత్తి చక్రం, జీవన పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ..  వాటి నిర్ములించడం కోసం అధ్యయనం చేస్తోంది. ఈ కీటకాలు యమునా కలుషిత నీటి నుండి నేరుగా తాజ్ మహల్‌కు చేరుతున్నాయి. తాజ్ మహల్ వివిధ ప్రాంతాల్లో  పచ్చని మచ్చలు ఏర్పడడంతో చాలా చోట్ల తెల్లని పాల రాయి మీద నాచు మచ్చలు కనిపిస్తున్నాయి.

యమునా నుండి వచ్చిన కీటకం

పెరుగుతున్న కాలుష్యం వల్లే యమునా నదిలో కీటకాలు విజృంభింస్తున్నాయని.. వెల్లడించింది. అయితే యమునాలో కాలుష్యం ఎందుకు పెరుగుతుందో కూడా కారణం చెప్పారు. ఆగ్రా టూరిస్ట్ వెల్ఫేర్ ఛాంబర్ అధ్యక్షుడు యమునాలో కాలుష్య స్థాయిలు పెరగడానికి తాజ్ బ్యారేజీ నిర్మాణ ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం అని.. దీని నిర్మాణం పూర్తి చేసి ఉంటే పరిస్థితి అదుపులో ఉండేదని అంటున్నారు.

యమునా నదిని దిగువకు వెడల్పు చేయడం లేదా నీటి ప్రవాహాన్ని నిర్ధారించడానికి తాజ్ మహల్ నుండి దిగువకు బ్యారేజీని నిర్మించాలని ఆయన ప్రతిపాదించారు. ఇది సాధారణంగా నిల్వ ఉన్న నీటిలో సంభవించే కీటకాల సంతానోత్పత్తిని నిరోధించవచ్చు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..