Ayodhya: 6వేల ఆహ్వానాలు పంపుతున్న ట్రస్ట్.. ప్రారంభోత్సవానికి ఒక రోజు ముందు చేరుకుని.. ఒక రోజు తర్వాత వెళ్లిపొమ్మని సూచన

శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ పంపుతున్న ఆహ్వాన లేఖలను దేశవ్యాప్తంగా నివసిస్తున్న సాధువులకు, ఆశ్రమాలకు పంపడం ప్రారంభించారు. ఎవరైతే రామ మందిర ప్రారంభోత్సవ  ఆహ్వానాలను అందుకున్నారో వారు పవిత్రోత్సవానికి ఒక రోజు ముందుగా అయోధ్యకు చేరుకోవాలని అభ్యర్థించారు. అంతేకాదు ఈ కార్యక్రమానికి హాజరయ్యే వ్యక్తులు జనవరి 23 తర్వాత తిరిగి వెళ్లేలా ప్లాన్ చేసుకోవాలని కూడా ఆహ్వాన లేఖలో అభ్యర్థించారు.

Ayodhya: 6వేల ఆహ్వానాలు పంపుతున్న ట్రస్ట్.. ప్రారంభోత్సవానికి ఒక రోజు ముందు చేరుకుని.. ఒక రోజు తర్వాత వెళ్లిపొమ్మని సూచన
మందిర నిర్మాణంలో భాగంగా రాంలాలా గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం డిసెంబర్ 2023 చివరికి పూర్తి అవుతుందని.. ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణం డిసెంబర్ 2024 నాటికి పూర్తవుతుంది. డిసెంబరు 2025 నాటికి రాంలాలా ఆలయం పూర్తి కానుంది. అయితే 2023 జనవరి 22వ తేదీన జరిగే రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు వస్తారని ట్రస్ట్ బోర్డు అంచనావేస్తోంది. 
Follow us
Surya Kala

|

Updated on: Dec 02, 2023 | 2:26 PM

కోట్లాది హిందువుల కల తీరే సమయం ఆసన్నం కానుంది. రామయ్య జన్మ భూమి అయోధ్యలో స్వామి వారు కొలువుదీరే రామ మందిర నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. జనవరి 22న జరగనున్న ప్రాణ ప్రతిష్ట వేడుకకు శరవేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రధాని మోడీ సహా దేశంలోని వేలాది మంది సాధువులు, భక్తులు ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ ఫంక్షన్‌కు సంబంధించిన ఇన్విటేషన్ కార్డులు కూడా సిద్ధం చేసి పోస్ట్ ద్వారా పంపుతున్నారు. ఈ వేడుకకు హాజరయ్యేందుకు మొత్తం 6 వేల మందికి ఆహ్వాన పత్రికలు పంపుతున్నారు.

శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ పంపుతున్న ఆహ్వాన లేఖలను దేశవ్యాప్తంగా నివసిస్తున్న సాధువులకు, ఆశ్రమాలకు పంపడం ప్రారంభించారు. ఎవరైతే రామ మందిర ప్రారంభోత్సవ  ఆహ్వానాలను అందుకున్నారో వారు పవిత్రోత్సవానికి ఒక రోజు ముందుగా అయోధ్యకు చేరుకోవాలని అభ్యర్థించారు. అంతేకాదు ఈ కార్యక్రమానికి హాజరయ్యే వ్యక్తులు జనవరి 23 తర్వాత తిరిగి వెళ్లేలా ప్లాన్ చేసుకోవాలని కూడా ఆహ్వాన లేఖలో అభ్యర్థించారు.

ఇవి కూడా చదవండి

అయోధ్యలో ‘రామ్ లల్లా’ పట్టాభిషేక మహోత్సవం ఆహ్వాన పత్రికల పంపిణీ ప్రక్రియ

ఆహ్వానపత్రికలో ఏం రాసి ఉందంటే

రామయ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో అయోధ్యకు భారీ సంఖ్యలో ప్రజలు చేరుకునే అవకాశం ఉంది. ఈ విషయాన్నీ దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. హాజరయ్యేందుకు వచ్చేవారంతా వీలైనంత త్వరగా రావాలని కూడా ఆహ్వాన పత్రికలో పేర్కొన్నారు. ఆలస్యంగా రావడం వల్ల సమస్యలు తలెత్తుతాయని కూడా కార్డులో పేర్కొన్నారు.

రామ మందిర నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాలేదని మీకు తెలియజేద్దాం. దేవాలయం మొదటి అంతస్తు పూర్తయింది కానీ ఇంకా పూర్తి చేసే పనులు జరుగుతున్నాయి. సంప్రోక్షణ అనంతరం కూడా ఆలయ నిర్మాణ పనులు కొనసాగుతాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..