Kitchen Tips: ఇలా చేస్తే ఉడకబెట్టేటప్పుడు గుడ్లు పగలవు..

కోడిగుడ్లలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్లనే గుడ్డు రోజూ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. సాధారణంగా గుడ్లను రోజూ బ్రేక్ ఫాస్ట్ లేదా లంచ్‌లో తీసుకుంటూ ఉంటాం. అల్పాహారంగా గుడ్లు తింటే ఎక్కువసేపు ఆకలిగా అనిపించదు. కానీ గుడ్లు ఉడకబెట్టేటప్పుడు ఒక్కోసారి పగిలిపోవడం, పొట్టు సరిగా రాకపోవడం వంటి సమస్యలు వేదిస్తుంటాయి. గుడ్లు ఉడకబెట్టడంలో చాలా మంది చేసే చిన్న పొరపాట్ల వల్ల ఇలా గుడ్డు పగుళ్లకు దారితీస్తాయి. కొద్దిపాటి చిట్కాలు పాటిస్తే గుడ్లను సరైన..

Kitchen Tips: ఇలా చేస్తే ఉడకబెట్టేటప్పుడు గుడ్లు పగలవు..
Cracking Eggs While Cooking
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 05, 2023 | 5:37 PM

కోడిగుడ్లలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్లనే గుడ్డు రోజూ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. సాధారణంగా గుడ్లను రోజూ బ్రేక్ ఫాస్ట్ లేదా లంచ్‌లో తీసుకుంటూ ఉంటాం. అల్పాహారంగా గుడ్లు తింటే ఎక్కువసేపు ఆకలిగా అనిపించదు. కానీ గుడ్లు ఉడకబెట్టేటప్పుడు ఒక్కోసారి పగిలిపోవడం, పొట్టు సరిగా రాకపోవడం వంటి సమస్యలు వేదిస్తుంటాయి. గుడ్లు ఉడకబెట్టడంలో చాలా మంది చేసే చిన్న పొరపాట్ల వల్ల ఇలా గుడ్డు పగుళ్లకు దారితీస్తాయి. కొద్దిపాటి చిట్కాలు పాటిస్తే గుడ్లను సరైన క్రమంలో ఉడికించుకోవచ్చంటున్నారు నిపుణులు.

గుడ్లు పగలకుండా ఉడికించడానికి సింపుల్ చిట్కాలు..

వెడల్పాటి పాత్రలో ఉడికించాలి..

రెండు గుడ్లు ఉడకబెడుతున్నట్లయితే, వెడల్పాటి పాత్రను ఎంచుకోవాలి. రెండు లేదా అంతకంటే ఎక్కువ గుడ్లు వండేటప్పుడు చిన్న పాత్రలో ఉడికిస్తే, అవి ఒకదానికొకటి తాకి పగిలిపోయే అవకాశం ఉంది. గుడ్లు ఒకదానికొకటి తాకకుండా వెడల్పాటి పాన్‌లో ఉడికించాలి.

ఫ్రిజ్ నుండి తీసివేసిన వెంటనే ఉడికించవద్దు..

కోడి గుడ్డు చాలా శీతల వాతావరణంలో ఉంచిన తర్వాత వాటిని నేరుగా ఉడకబెట్టినట్లయితే, అది పగిలిపోయే అవకాశం ఉంది. వీటిని ఫ్రిజ్ నుంచి తీసిన తర్వాత నేరుగా నీళ్లలో వేసి మరిగిస్తే కచ్చితంగా పగుళ్లు వస్తాయి. కాబట్టి మీరు మొదట ఫ్రిజ్ నుంచి గుడ్లను తీసి, గది ఉష్ణోగ్రత వద్ద 10 లేదా 15 నిమిషాలు పక్కనపెట్టుకోవాలి. అప్పుడు వాటి ఉష్ణోగ్రత సాధారణ స్థితికి చేరుకుంటుంది. ఆ తర్వాత ఉడకబెట్టడం మంచిది.

ఇవి కూడా చదవండి

మరిగే నీటిలో ఉప్పు కలపాలి

కొన్నిసార్లు గుడ్డు సరిగ్గా ఉడకబెట్టిన తర్వాత కూడా పొట్టు సరిగ్గా ఊడి రాదు. అలాంటప్పుడు గుడ్లు ఉడికించే నీటిలో కొంచెం ఉప్పు కలుపుకోవాలి. ఉప్పు నీటిలో గుడ్లను ఉడకబెట్టడం వల్ల వాటి తొక్కలు సులభంగా ఊడి వస్తాయి.

మీడియం మంట మీద ఉడికించాలి..

గుడ్లు ఉడకబెట్టేటప్పుడు మంట ఎక్కువగా ఉండకూడదు. గుడ్డు ఎప్పుడూ మీడియం మంట మీద ఉడికించాలి. ఇలా చేయడం వల్ల గుడ్డు పగలదు. అంతేకాకుండా పై తొక్క సులభంగా తొలగించబడుతుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!