Shani Dev: శని గ్రహ సంచార ప్రభావం.. తీవ్ర పని భారంతో ఆ రాశుల వారు ఉక్కిరిబిక్కిరి..!
శనీశ్వరుడి కారణంగా ఆరు రాశుల వారిపై విపరీతంగా పనిభారం, పని ఒత్తిడి, బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. శని గ్రహం ప్రస్తుతం రాహు నక్షత్రమైన శతభిషంలో సంచారం చేస్తున్నందువల్ల రకరకాల కారణాల వల్ల ఉద్యోగంలో బాధ్యతలు పెరగడం, పని భారం పెరగడం వంటివి జరుగుతాయి. దీర్ఘకాలం పాటు ఈ రాశుల వారికి పని భారం పెరగడం, మరో ఉద్యోగానికి ప్రయత్నించడం వంటివి జరిగే అవకాశం ఉంది.
శనీశ్వరుడి కారణంగా ఆరు రాశుల వారిపై విపరీతంగా పనిభారం, పని ఒత్తిడి, బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. శని గ్రహం ప్రస్తుతం రాహు నక్షత్రమైన శతభిషంలో సంచారం చేస్తున్నందువల్ల రకరకాల కారణాల వల్ల ఉద్యోగంలో బాధ్యతలు పెరగడం, పని భారం పెరగడం వంటివి జరుగుతాయి. దీర్ఘకాలం పాటు ఈ రాశుల వారికి పని భారం పెరగడం, మరో ఉద్యోగానికి ప్రయత్నించడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఈ ఆరు రాశులుః వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, కుంభం.
- వృషభం: ఈ రాశివారికి ఉద్యోగ స్థానంలో శనీశ్వరుడి సంచారం వల్ల ఉద్యోగంలో పని భారం కంటే బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. అధికారులు ఎంతో నమ్మకంతో కొత్త బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. అయితే, ఈ అదనపు బాధ్యతల వల్ల వ్యక్తిగతంగా కొద్దిగా ఇబ్బంది, విశ్రాంతి లేకపోవడం, సెలవులు దొరకకపోవడం వంటివి ఉన్నప్పటికీ ఆశించిన ప్రతిఫలం, ప్రోత్సాహకాలు ఉండే అవకాశం ఉంది. దీర్ఘకాలంలో ఈ అదనపు భారం వల్ల గుర్తింపు, ప్రయోజనం ఉంటాయి.
- కర్కాటకం: ఈ రాశివారికి అష్టమ స్థానంలో శనీశ్వరుడి సంచారం కారణంగా ఉద్యోగం పట్ల విరక్తి, విముఖత కలిగేంతగా పని భారం, ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఈ శనీశ్వరుడి దృష్టి ఉద్యోగ స్థానం మీద పడుతున్నందువల్ల, ఉద్యోగాలు మారే అవకాశం కూడా ఉంటుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించడం జరుగుతుంది. దీనివల్ల కొన్ని ఈతి బాధలుంటాయి. మొత్తానికి ఉద్యోగంలో వెట్టి చాకిరీకి అవకాశం ఉంది. సహోద్యోగులతో కూడా బాధ్యతలు పంచుకోవాల్సి వస్తుంది.
- సింహం: ఈ రాశివారికి సప్తమ స్థానంలో శని సంచారం వల్ల ఉద్యోగంలో అధికారులు ఈ రాశివారిని వీలై నంతగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. విశ్రాంతి కూడా లభ్యం కాని పరిస్థితి ఏర్పడు తుంది. సరైన ప్రతిఫలం లేదా ప్రోత్సాహకం కూడా ఉండే అవకాశం లేదు. త్వరగా ఉద్యోగాలు మారడానికి కూడా అవకాశం ఉండకపోవచ్చు. ఉద్యోగరీత్యా ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. నిరుద్యోగులకు ఈ సమయంలో లభించే ఉద్యోగాలలో పని భారం, ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి.
- వృశ్చికం: ఈ రాశివారికి ఉద్యోగ స్థానం మీద శని దృష్టిపడిన కారణంగా తప్పకుండా పని భారం పెరుగు తుంది. అధికారులు అలవికాని లక్ష్యాలను నిర్దేశించడం జరుగుతుంది. సహచరులతో బాధ్యతలు పంచుకోవాల్సి వస్తుంది. తరచూ బాధ్యతలను మార్చడం జరుగుతుంది. నిరుద్యోగులు చిన్న ఉద్యోగాలతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో కూడా ఈ రాశివారికి శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. ఉద్యోగం మారడానికి ప్రయత్నం చేయకపోవడం మంచిది.
- మకరం: ఈ రాశివారికి కొద్దిగా ఏలిన్నాటి శని ప్రభావం ఉన్నందువల్ల కష్టపడితేనే గానీ ఫలితం ఉండని విధంగా ఉద్యోగ జీవితం కొనసాగుతుంది. ఎంత కష్టపడినా అధికారులకు ఒక పట్టాన సంతృప్తి ఉండదు. ప్రతిభా పాటవాలను గుర్తించే అవకాశం ఉంది కానీ, అందుకు తగ్గట్టుగా పని భారం, ఒత్తిడి బాగా పెరిగే సూచనలున్నాయి. అధికారులతో పాటు సహోద్యోగులు కూడా పని భారాన్ని ఈ రాశివారితో పంచుకోవడం జరుగుతుంది. అయితే, ఈ రాశివారికి కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది.
- కుంభం: ఈ రాశివారికి శని ప్రభావం ఎక్కువగా ఉన్నందువల్ల పని భారం బాగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ రాశివారి ఉద్యోగ స్థానం మీద శని దృష్టి పడినందువల్ల ఉద్యోగంలో తప్పకుండా బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. అయితే, ఈ కష్టానికి ఉత్తరోత్రా మంచి ఫలితం లభించే అవకాశం ఉంది. కష్టే ఫలీ అన్నట్టుగా ఉంటుంది. ఉద్యోగం మారాలనే ఆలోచన ఎక్కువగా కలుగుతుంది. నిరుద్యోగులు కూడా ఈ సమయంలో వచ్చే ఉద్యోగం వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంది.