World Coldest City: -50 డిగ్రీల ఉష్ణోగ్రతలో చలి ఎలా ఉంటుందో తెలుసా.? వీడియో చూస్తే వణుకే..!
చలి కారణంగా ఇక్కడి ప్రజలు అవస్థలు పడుతున్నారు. పూర్తి ప్రిపరేషన్ లేకుండా ఎవరూ బయటకు వెళ్లడం లేదు. ఇంటినుంచి కాలు బయటపెట్టాలంటే జనం గజగజలాడుతున్నారు. అక్కడి చలి తీవ్రత ఎలా ఉందో చూపించే ఈ వీడియోలో ఒక వ్యక్తి కారులో కూర్చొని ఉండటం కనిపించింది. అతని ముఖం మొత్తం స్నోతో నిండికనిపిస్తుంది. దాంతో అతను సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు..
భారతదేశంతో సహా ప్రపంచంలోని చాలా దేశాలలో శీతాకాలం ప్రారంభమైంది. అయితే రష్యా, అమెరికాలో చలికాలం భారత్ కంటే చాలా రెట్లు ఎక్కువ. భారతదేశంలో వేసవి కాలం కూడా చాలా చోట్ల చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కానీ, డిసెంబర్ నెలలో ఈ దేశాల్లో ఉష్ణోగ్రత -0 డిగ్రీల కంటే తక్కువకు పడిపోతుంది. ఈ క్రమంలోనే రష్యాలో చలి వణికిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. ఇందులో ఒక వ్యక్తి నోరు, చెవులు, ముక్కు చలితో గడ్డకట్టిపోవటం కనిపించింది. అతని చెవులు, కనురెప్పలు పూర్తిగా మంచుగడ్డలా మారిన దృశ్యం భయానకంగా ఉంది.. అయితే, ఈ వైరల్ వీడియోలోని దృశ్యం ఎప్పటిది అనేది మాత్రం ఖచ్చితంగా తెలియలేదు. అయితే, పూర్తి వివరాల్లోకి వెళితే..
ఈ వీడియో రష్యాలోని యాకుట్స్క్ నగరానికి చెందినది. ఇక్కడ ఉష్ణోగ్రత -50 డిగ్రీలకు చేరుకుందని సమాచారం. చలి కారణంగా ఇక్కడి ప్రజలు అవస్థలు పడుతున్నారు. పూర్తి ప్రిపరేషన్ లేకుండా ఎవరూ బయటకు వెళ్లడం లేదు. ఇంటినుంచి కాలు బయటపెట్టాలంటే జనం గజగజలాడుతున్నారు. అక్కడి చలి తీవ్రత ఎలా ఉందో చూపించే ఈ వీడియోలో ఒక వ్యక్తి కారులో కూర్చొని ఉండటం కనిపించింది. అతని ముఖం మొత్తం స్నోతో నిండికనిపిస్తుంది. దాంతో అతను సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు..
The world’s coldest city, Yakutsk, at -50 degrees. People were shocked to see a man who survived the freeze, his ears and eyelashes encased in ice. 🥶❄️🌍
— Wow Videos (@ViralXfun) December 5, 2023
ఈ వ్యక్తి కళ్లు, చెవులు, కనురెప్పలపై కూడా గడ్డకట్టుకుపోతున్నాయి. అతని ముఖంమీద మంచు పొరలు వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. వైరల్ వీడియోలో అతను పూర్తిగా మంచుతో కప్పబడిన తన చెవులను చూపించాడు. ఈ వీడియో Xలో పోస్ట్ చేయగా వైరల్ గా మారింది.. దీనితో పాటు, ఇక్కడ ఉష్ణోగ్రత స్థాయి -50 డిగ్రీలకు చేరుకుందని చెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో అంతకంతకూ వైరల్ అవుతోంది. ఇది చూసిన జనాలు ఆశ్చర్యపోయి తమ స్పందనను తెలియజేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..