AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BJP Observers: మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో తేలని సీఎం.. ఎంపిక బాధ్యత బీజేపీ పరిశీలకులకు అప్పగింత

ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మూడు రాష్ట్రాలకు భారతీయ జనతా పార్టీ పరిశీలకులను ప్రకటించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ పరిశీలకుల పేర్లను వెల్లడించింది. మూడు రాష్ట్రంలోని ఎమ్మెల్యేలతో పరిశీలకులు సమావేశం కానున్నారు. ఎమ్మెల్యేలతో చర్చించిన అనంతరం ముఖ్యమంత్రి పేరును ఖరారు చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

BJP Observers: మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో తేలని సీఎం.. ఎంపిక బాధ్యత బీజేపీ పరిశీలకులకు అప్పగింత
Pm Modi, Jp Nadda, Amit Shah
Balaraju Goud
|

Updated on: Dec 08, 2023 | 12:27 PM

Share

ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మూడు రాష్ట్రాలకు భారతీయ జనతా పార్టీ పరిశీలకులను ప్రకటించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ పరిశీలకుల పేర్లను వెల్లడించింది. మూడు రాష్ట్రంలోని ఎమ్మెల్యేలతో పరిశీలకులు సమావేశం కానున్నారు. ఎమ్మెల్యేలతో చర్చించిన అనంతరం ముఖ్యమంత్రి పేరును ఖరారు చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించినా.. ఇంకా ముఖ్యమంత్రులు ఎవరనేది స్పష్టత రాలేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించారు. అనంతరం అయా రాష్ట్రాలకు పరిశీలకు పంపి, ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకోవాలని భావించారు. ఈ నేపథ్యంలో పార్టీ పరిశీలకులను నియమించింది బీజేపీ హైకమాండ్. మూడు రాష్ట్రాల సీఎంలపై డిసెంబర్ 10న తుది నిర్ణయం తీసుకుంటామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను రాజస్థాన్ పరిశీలకునిగా చేసింది బీజేపీ. వినోద్ తావ్డే, సరోజ్ పాండేలను తన అసిస్టెంట్ సర్వేయర్లుగా పంపారు. అదే సమయంలో హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, రాజ్యసభ సభ్యులు కే. లక్ష్మణ్, ఆశా లక్రాలను మధ్యప్రదేశ్‌కు పరిశీలకులుగా పంపారు. ఛత్తీస్‌గఢ్ సీఎం ఎంపిక చేసే బాధ్యతను బీజేపీ కేంద్ర మంత్రి సర్బానంద సోనేవాల్‌కు అప్పగించింది బీజేపీ అధిష్టానం. అతనికి సహాయం చేయడానికి అర్జున్ ముండాను పంపారు.

ఇదిలావుంటే మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి పేరు చెప్పకుండానే ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ క్రమంలోనే మూడు రాష్ట్రాల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల సమావేశాలను పర్యవేక్షించే బాధ్యతను పరిశీలకులకు అప్పగించింది. బీజేపీ శాసనసభ్యులు తమ నాయకులను ఎన్నుకోనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Follow Us
టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
టాయిలెట్లు శుభ్రం చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
సినిమాలో మ్యాటర్ ఉంటే.. అది మ్యాటరే కాదసలు..!
సినిమాలో మ్యాటర్ ఉంటే.. అది మ్యాటరే కాదసలు..!
త్రివిక్రమ్, శ్రీను వైట్ల అడుగుల్లో ఆ ఇద్దరు డైరెక్టర్స్
త్రివిక్రమ్, శ్రీను వైట్ల అడుగుల్లో ఆ ఇద్దరు డైరెక్టర్స్
చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్‌!
చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్‌!
యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు
యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు
వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా
లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?
లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?
మటన్‌ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్‌
మటన్‌ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్‌
నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు..
నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు..