Rajasthan Politics: రాజస్థాన్‌లో సీఎం పదవికి పెరుగుతున్న పోటీ.. రేసులో ఎవరున్నారో తెలుసా?
రాజస్థాన్‌లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడంతో ముఖ్యమంత్రి పదవిపై ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం అభ్యర్థిపై ఉత్కంఠ కొనసాగుతోన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి పోటీ పడేవారి జాబితా మరింత పెరుగుతోంది. ఇందులో మొదటి పేరు మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే.
రాజస్థాన్‌లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడంతో ముఖ్యమంత్రి పదవిపై ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం అభ్యర్థిపై ఉత్కంఠ కొనసాగుతోన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి పోటీ పడేవారి జాబితా మరింత పెరుగుతోంది. ఇందులో మొదటి పేరు మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే. ఆ తర్వాత కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్, రాష్ట్ర అధ్యక్షుడు సీపీ జోషి, బాబా బాలక్ నాథ్, రాజ్యవర్ధన్ సింగ్, దియా కుమారి, కిరోరి లాల్ మీనా ఓం బిర్లా, ఓం మాథుర్, సునీల్ బన్సాల్ పేర్లు ముఖ్యమంత్రి పదవి రేసులో బలంగా వినిపిస్తున్నాయి.
ఈ పేర్లు కాకుండా, మరికొన్ని పేర్లు కూడా మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఉత్తరప్రదేశ్ తరహాలో రాజస్థాన్‌లో ఒకరిని ముఖ్యమంత్రిని, ఇద్దరు ఉపముఖ్యమంత్రులను చేయాలని కేంద్ర నాయకత్వం మేధోమథనం చేస్తోంది. అయితే రాజస్థాన్‌లో మాత్రం మోదీ మ్యాజిక్ ద్వారానే సీఎం, ఇద్దరు డిఫ్యూటీ సీఎం పేర్లు వెల్లడి కానున్నాయి. రాజస్థాన్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు ముందు పరిశీలకులను నియమించే యోచనలో ఉంది పార్టీ అధినాయకత్వం. ఆ తర్వాత శాసనసభా పక్ష సమావేశం నిర్వహించి, ఆ శాసనసభా పక్ష సమావేశంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయిస్తారు.
ఇదిలావుంటే మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలందరినీ తన ఇంటికి విందుకు ఆహ్వానించారు. ఈ ఆహ్వానం మేరకు 35 మందికి పైగా ఎమ్మెల్యేలు రాజే ఇంటికి చేరుకున్నారు. ఇది మాజీ సీఎం వసుంధర రాజే బలప్రదర్శనగా రాజకీయ వర్గాల్లో భావిస్తున్నారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే ఢిల్లీ చేరుకున్నారు. ఇక్కడ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో రాజే భేటీ అయ్యారు. ఈ భేటీలో వసుంధరా రాజే కుమారుడు దుష్యంత్ సింగ్ కూడా ఆమెతోనే ఉన్నారు. రాజస్థాన్‌లో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా గంటన్నరపాటు సాగిన ఈ సమావేశం అత్యంత కీలకంగా మారింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…