Dream Astrology: కలలో కోతులు కనిపిస్తున్నాయా.. కోతి ఎలా కనిపిస్తే ఎలాంటి ఫలితం కనిపిస్తుందంటే

చాలా సార్లు కలలో కోతులు కనిపిస్తూ ఉంటాయి. ఇలా కోతి కనిపిస్తే ఆ కలకు అర్థం తెలుసుకోవాలని చాలామంది భావిస్తారు. డ్రీమ్ సైన్స్ ప్రకారం కలలో కోతి కనిపించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. కలలో కోతి కనిపించడం అంటే హనుమంతుని ఆశీస్సులు సదరు వ్యక్తిపై  ఉన్నాయని.. ఉంటాయని అర్థం. ఎవరి కలలో కోతి కనిపిస్తే ఆ వ్యక్తి జీవితంలో త్వరలో కొంత మార్పు వస్తుందని..  శుభవార్త వింటారని.. డబ్బు సంపాదించవచ్చని నమ్మకం. 

Dream Astrology: కలలో కోతులు కనిపిస్తున్నాయా.. కోతి ఎలా కనిపిస్తే ఎలాంటి ఫలితం కనిపిస్తుందంటే
Dream Of Monkey
Follow us
Surya Kala

|

Updated on: Dec 14, 2023 | 4:43 PM

ప్రతి మనిషి నిద్రపోయే సమయంలో కలలు కంటాడు. ఈ కలలకు అర్ధం ఉందంటూ స్వప్న శాస్త్రం పేర్కొంది. ఈ స్వప్న శాస్త్రం ప్రకారం కలలు కనడం కేవలం యాదృచ్చికం కాదు. కలలు భవిష్యత్తులో మంచి, చెడు సంకేతాలను తెలియజేస్తాయి. కలలు కొన్నిసార్లు మనల్ని భయపెట్టే విధంగా ఉంటాయి. అయితే  కలలో కనిపించే ప్రతిదానికీ ఖచ్చితంగా కొంత అర్థం ఉంటుంది. ఇది భవిష్యత్తులో జరిగే సంఘటనల గురించి మమ్మల్ని అప్రమత్తం చేస్తుందని స్వప్న శాస్త్రం పేర్కొంది. అయితే కలలో కోతిని చూడటం చాలా సంకేతాలను ఇస్తుంది. ఈ సంకేతాలు మంచివి లేదా చెడువి కూడా కావచ్చు.

చాలా సార్లు కలలో కోతులు కనిపిస్తూ ఉంటాయి. ఇలా కోతి కనిపిస్తే ఆ కలకు అర్థం తెలుసుకోవాలని చాలామంది భావిస్తారు. డ్రీమ్ సైన్స్ ప్రకారం కలలో కోతి కనిపించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. కలలో కోతి కనిపించడం అంటే హనుమంతుని ఆశీస్సులు సదరు వ్యక్తిపై  ఉన్నాయని.. ఉంటాయని అర్థం. ఎవరి కలలో కోతి కనిపిస్తే ఆ వ్యక్తి జీవితంలో త్వరలో కొంత మార్పు వస్తుందని..  శుభవార్త వింటారని.. డబ్బు సంపాదించవచ్చని నమ్మకం.

కోతిని హిందూ మతంలో హనుమంతుని రూపంగా పరిగణిస్తారు. అటువంటి పరిస్థితిలో కలలో ఒక కోతిని చూడటం చాలా ప్రత్యేకమైనది. కలలో కోతిని చూడటం అంటే హనుమంతుని ఆశీర్వాదం లభిస్తాయని విశ్వాసం. అయితే ఇది కాకుండా కోతుల కలకి సంబంధించిన మరికొన్ని సంకేతాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

కోపంగా ఉన్న కోతి కనిపిస్తే..

కలలో కోపంగా ఉన్న కోతి కనిపిస్తే అది అశుభం. స్వప్న శాస్త్రం ప్రకారం ఎవరితో నైనా గొడవ పడవచ్చు.. ఆత్మగౌరవం తగ్గవచ్చు.. జీవితంలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.

ఆహారం తింటున్న కోతి కలలో కనిపిస్తే..

స్వప్న శాస్త్రం ప్రకారం కోతి ఏదైనా తింటున్నట్లు కలలో కనిపిస్తే అది అశుభకరమైన కలగా పరిగణించబడుతుంది. ఈ కల త్వరలో భారీ నష్టాన్ని చవిచూస్తారని అర్ధం. అంతేకాదు కుటుంబ సభ్యులు  భవిష్యత్తులో ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుందని సూచిస్తుంది. రానున్న రోజుల్లో కష్టాలు కూడా తప్పవని సూచిస్తోంది.

సంతోషంగా ఉన్న కోతి కలలో కనిపిస్తే..

స్వప్న శాస్త్రం ప్రకారం సంతోషంగా ఉన్న కోతి కలలో కనిపించడం శుభ స్వప్నం. ఈ కల కంటే మీరు గొడవ పడిన వ్యక్తితో మీరు మళ్లీ స్నేహితులు అవుతారు. పాత స్నేహితులు మిమ్మల్ని కలవబోతున్నారు. అదే సమయంలో సమాజంలో గౌరవం పెరుగుతుందనేది అర్ధం.

గుంపులుగా కోతులు కనిపిస్తే..

స్వప్న శాస్త్రం ప్రకారం కలలో కోతులు గుంపుగా కనిపిస్తే అది శుభ కలగా పరిగణించబడుతుంది. ఇలాంటి కల కలిగి ఉంటే మీ కుటుంబం అంతా మీతో ఉందని.. భారీగా డబ్బు సంపాదించబోతున్నారని అర్థం. అలాగే  కుటుంబ సభ్యులు అందరూ ఎప్పుడూ కలిసి ఉంటారని.. సంతోషంగా జీవితాన్ని గడుపుతారని అర్ధం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు