- Telugu News Photo Gallery Spiritual photos Ayodhya Ram Mandir: A Whopping Rs 3,000 Crore Still Remain With Trust
Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయ నిర్మాణానికి భారీగా విరాళాలు.. ఖర్చు, మిగులు వివరాలు ఇవే..
కోట్లాది హిందువుల కల నెరవేరే సమయం ఆసన్నం అవుతోంది. రామయ్య జన్మించిన అయోధ్యలో రామ మందిర నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. కొత్త ఏడాదిలో రామమందిర ప్రాణప్రతిష్ఠ నిర్వహిచనున్నారు. బాల రామయ్య గర్భ గుడిలో కొలువుదీరే సమయం సమీపిస్తుండటంతో చక చకా ఏర్పాట్లు చేస్తున్నారు.
Surya Kala | Edited By: TV9 Telugu
Updated on: Dec 28, 2023 | 5:51 PM

2020 లో రామ మందిర శంకుస్థాపన మొదలు.. 2023 మార్చి 31 వరకూ రామాలయ నిర్మాణ సంబంధిత పనులతో పాటు, భక్తులకు సౌకర్యాల కల్పన నిమిత్తం మొత్తం రూ.900 కోట్లకు పైగా ఖర్చు చేశామని అయోధ్య ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవగిరి వెల్లడించారు.

రామ మందిర నిర్మాణం కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు భారీ మొత్తంలో విరాళం ఇచ్చారని.. ఈ విరాళాలతో ట్రస్టుకు కుబేరుడిని ఆశీర్వాదం ఉందని.. అందుకనే రాముడికి సంబంధించిన స్థిర ఆస్తులు, పొదుపు ఖాతాల్లో రూ. 3000 కోట్ల కంటే ఎక్కువ మొత్తం నిధులు మిగిలి ఉందని వెల్లడించారు.

మందిర నిర్మాణంలో భాగంగా రాంలాలా గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం డిసెంబర్ 2023 చివరికి పూర్తి అవుతుందని.. ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణం డిసెంబర్ 2024 నాటికి పూర్తవుతుంది. డిసెంబరు 2025 నాటికి రాంలాలా ఆలయం పూర్తి కానుంది. అయితే 2023 జనవరి 22వ తేదీన జరిగే రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు వస్తారని ట్రస్ట్ బోర్డు అంచనావేస్తోంది.

ఈ మేరకు భక్తులకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. సాధువులతో సహా ఆహ్వానితులతో పాటు.. 12 వేల నుంచి 15 వేల మంది అయోధ్యలో బస చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తుంది.

మరోవైపు ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం అయోధ్యలో వేర్వేరుచోట్ల 10 పడకల ఆసుపత్రులను సిద్ధం చేస్తున్నట్లు రామమందిర ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్ర తెలిపారు. ఆహుతుల కోసం ఏర్పాట్లు చేయడానికి వేర్వేరు బృందాలకు బాధ్యతలు అప్పగించినట్లు ట్రస్ట్ బోర్డు సభ్యులు చెప్పారు.





























