AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lord Shiva Puja: శివుడికి ఉమ్మెత్త పువ్వు అంటే అత్యంత ఇష్టం.. ఈ ఆలయానికి వెళ్తే ధాతూరాని సమర్పిస్తారు ఎందుకంటే..

విషం తాగిన తరువాత శివుడు విష ప్రభావంతో స్పృహ కోల్పోయాడు. దేవతలకు ఓ పెద్ద సమస్య తలెత్తింది. శివునికి తెలివి తెచ్చేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. ఈ పరిస్థితిలో ఆదిశక్తి ప్రత్యక్షమై దేవతలకు  మూలికలు, నీటితో చికిత్స చేయమని సూచించింది. విష ప్రభావాన్ని శివయ్య నుంచి తొలగించడానికి దేవతలు శివుని తలపై ఉమ్మెత్తను ఉంచారు.

Lord Shiva Puja: శివుడికి ఉమ్మెత్త పువ్వు అంటే అత్యంత ఇష్టం.. ఈ ఆలయానికి వెళ్తే ధాతూరాని సమర్పిస్తారు ఎందుకంటే..
Lord Shiva Puja Tips
Surya Kala
|

Updated on: Dec 18, 2023 | 9:42 PM

Share

హిందూ మతంలో త్రిమూర్తుల్లో ఒకరైన శివుడి పూజకు అత్యంత ప్రాధాన్యత ఉంది. సోమవారం శివుడికి అంకితం అయినా చాలా మంది రోజూ శివయ్యను నియమ నిష్టలతో పూజిస్తారు. జలాభిషేకం, బిల్వ పత్రాన్ని సమర్పించడమే కాదు.. ఉమ్మెత్త పువ్వులను కూడా సమర్పిస్తారు. అయితే పరమశివునికి ఉమ్మెత్త పువ్వును  సమర్పణ వెనుక కారణం ఏమిటి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా. ఈ రోజు దీనికి సంబంధించిన కథను గురించి తెలుసుకుందాం.. ఉమ్మెత్తను సమర్పించడం ద్వారా శివయ్య సంతోషిస్తాడు. జ్యోతిష్య శాస్త్రంలో  ధాతురాని రాహువు కారణమని భావిస్తారు.. అందుకే శివునికి ఉమ్మెత్త పువ్వుని, కాయలను సమర్పించడం వలన కాలసర్పం, పితృదోషం వంటి రాహువుకు సంబంధించిన దోషాలు తొలగిపోతాయి.

సముద్ర మథన సమయంలో ఇతర వస్తువులతో పాటు ఒకవైపు అమృతం వెలువడుతుండగా, మరోవైపు విషం కూడా వెలువడింది. ఆ విషపు పాత్ర ప్రభావంతో ప్రపంచంలోని జీవులు ఇబ్బందికి గురయ్యాయి. దీంతో ఆ విషంతో ఉన్న పాత్రను భూమిపై ఉంచినట్లయితే.. దీని ప్రభావంతో భూమి విషపూరితంగా మారవచ్చు . దీనిపై నివసించే అన్ని జీవుల జీవితాలు ఇబ్బందుల్లో పడవచ్చు.

అప్పుడు శివుడు ఆ విషపు పాత్రను తీసుకుని అందులోని విషాన్ని తాగి తన కంఠంలో దాచి పెట్టాడు. అపుడు  ఆ విషప్రభావానికి శివుని కంఠం నీలిరంగులోకి మారింది. అందుకే శివుడిని నీలకంఠుడు అని కూడా అంటారు.

ఇవి కూడా చదవండి

ఉమ్మెత్త పువ్వుని ఎందుకు సమర్పిస్తారంటే

విషం తాగిన తరువాత శివుడు విష ప్రభావంతో స్పృహ కోల్పోయాడు. దేవతలకు ఓ పెద్ద సమస్య తలెత్తింది. శివునికి తెలివి తెచ్చేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. ఈ పరిస్థితిలో ఆదిశక్తి ప్రత్యక్షమై దేవతలకు  మూలికలు, నీటితో చికిత్స చేయమని సూచించింది. విష ప్రభావాన్ని శివయ్య నుంచి తొలగించడానికి దేవతలు శివుని తలపై ఉమ్మెత్తను ఉంచారు.

అనంతరం శంకరుని నుదిటిపై ఉమ్మెత్తను ఉంచి జలాభిషేకం నిర్వహించారు. ఇలా చేసిన తర్వాత  పరమశివుడు విష ప్రభావం నుంచి బయట పడ్డాడు స్పృహలోకి వచ్చాడు. పురాణాల ప్రకారం శివుడికి ధాతుర, భాంగ్ ఉన్న జలాన్ని సమర్పించే సంప్రదాయం అప్పటి నుండి ప్రారంభమైంది. తనకు విషప్రభావాన్ని తగ్గించిన ఉమ్మెత్త, బాంగ్ అంటే అప్పటి నుంచి పరమశివునికి  ప్రీతిపాత్రమైనవిగా మారాయి. వీటిని సమర్పించిన భక్తుల పట్ల శివుడు  ప్రత్యేక అనుగ్రహాన్ని కలిగి ఉంటాడు.

నీలకంఠ మహాదేవ్ ఏ ప్రదేశంలో ఉన్నాడంటే

నీలకంఠ మహాదేవుడి ఆలయం రిషికేశ్ నుండి కొంత దూరంలో పర్వతాలలో ఉంది. విషం తాగిన తర్వాత శివుడు తన మనసును ఏకాగ్రత చేసుకోవడానికి ఇక్కడే ఉండిపోయాడని స్థానికుల కథనం. ఈ కొండ ప్రాంతంలో అడవుల్లో జనపనార విస్తారంగా పెరుగుతుంది. అడవులలో తీగ చెట్లు కూడా పుష్కలంగా కనిపిస్తాయి. ప్రజలు రిషికేశ్‌కు వెళ్లినప్పుడల్లా  ఖచ్చితంగా నీలకంఠ మహాదేవ్ ఆలయాన్ని సందర్శిస్తారు. అంతే కాకుండా ఆయుర్వేదంలో ఉమ్మెత్తని ఔషధంగా కూడా ఉపయోగిస్తారు.  దీర్ఘకాలిక జ్వరం, కీళ్ల నొప్పులు ,  విష ప్రభావాలను నయం చేసే అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు