Horoscope Today: వారికి ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులే.. బుధవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.?

వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. అధికారుల నుంచి అండదండలు లభి స్తాయి. వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులుంటాయి. తోబుట్టువులతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.

Horoscope Today: వారికి ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులే.. బుధవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.?
Horoscope Today
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Ravi Kiran

Updated on: Dec 27, 2023 | 7:36 AM

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాలు చాలావరకు సానుకూలంగానే సాగిపోతాయి. అధికారులు బాగా సహకరించడం జరుగుతుంది. వ్యాపారాలు కూడా పరవాలేదనిపిస్తాయి. ముఖ్యంగా అనుకున్న పనులు అను కున్నట్టు పూర్తవుతాయి. తలపెట్టిన పనులు, వ్యవహారాల్లో బాగానే పురోగతి ఉంటుంది. బంధు మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. దైవ దర్శనం చేసుకుంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, వ్యాపారాలు బాగా బలం పుంజుకుంటాయి. తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యో గంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఇంటా బయటా గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఆశించిన స్థాయిలో ఆర్థిక పురోగతి ఉంటుంది. అనుకోకుండా కొందరు ఇష్టమైన బంధువులను కలుసుకుంటారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. కీలకమైన వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ వ్యవహారాలలో కొద్దిగా అపార్థాలకు అవకాశం ఉంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తారు. ఇంటా బయటా అనుకూల పరి స్థితులుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు చాలావరకు పూర్తవుతాయి. ప్రయాణాల వల్ల ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెంచడం మంచిది. ఇష్టమైన ఆలయాలకు వెడతారు. బంధుమిత్రుల రాకపోకలు ఉంటాయి. వ్యాపారాలు నిదానంగా కొనసాగుతాయి. కొత్త పరిచ యాలు ఏర్పడతాయి. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. స్పెక్యులేషన్ లాభిస్తుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ పెరుగుతుంది. వ్యాపారంలో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో వ్యయ ప్రయాసలుంటాయి. పెండింగు పనులు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆస్తి సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వ్యక్తి గత సమస్య పరిష్కారమవుతుంది. ప్రయాణాల్లో జాగ్తత్తగా ఉండాలి. ప్రేమ వ్యవహారాల్లో దూసుకు పోతారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, వ్యాపారాలలో లాభాలు పెరుగుతాయి. అప్రయత్న ధన లాభం ఉంటుంది. ఉద్యోగ వాతా వరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. మంచి పరిచ యాలు ఏర్పడతాయి. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడంలో వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. కుటుంబ సమస్యలు పరిష్కారం అవు తాయి. అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. పనిభారం పెరిగినా ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ముఖ్యంగా అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు. వ్యాపారాలలో ఆర్థిక పురోగతి ఉంటుంది. ఇంట్లో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులు సకాలంలో సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి విలువైన వస్తువులు కొను గోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మీద దృష్టి పెడతారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. ప్రమోషన్ రావడం గానీ, ఇష్టమైన ప్రాంతానికి బదిలీ కావడం గానీ జరగవచ్చు. బంధుమిత్రులతో మరింతగా సఖ్యత పెరుగుతుంది. అనారోగ్య సమస్యల నుంచి ఆశించినంతగా ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలకు ఆశించిన స్పందన వచ్చే అవకాశం ఉంది. స్వయం ఉపాధి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా ముందుకు వెడతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా సాగిపో తాయి. డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్ల వంటి వృత్తుల వారికి సమయం బాగా అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. ముఖ్యమైన ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఖర్చుల విషయంలో జాగ్తత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రేమ వ్యవహారాలు బాగా అనుకూలంగా సాగుతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాడ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. అధికార యోగానికి అవకాశం ఉంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ, వృథా ఖర్చులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యమైన పనులు చురుకుగా పూర్తవుతాయి. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. మంచి సంస్థలోకి ఉద్యోగం మారే ప్రయత్నాలు సఫలం అవుతాయి. విహార యాత్రకు అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం పెరిగినప్పటికీ ప్రతి ఫలం ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి. ఇతర సంస్థల నుంచి ఆఫర్లు అందు తాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా ముందుకు సాగుతాయి. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలతో పూర్తి చేయడం జరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. అధికారుల నుంచి అండదండలు లభి స్తాయి. వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులుంటాయి. తోబుట్టువులతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం కూడా శ్రేయస్కరం కాదు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు చోటు చేసుకోవచ్చు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగ జీవితం ఉల్లాసంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆర్థిక లావా దేవీల వల్ల ప్రయోజనం ఉంటుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యంగా మొండి బాకీలు వసూలు అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యో గులు, అవివాహితుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగి పోతాయి.