News Year 2024: 2024లో ఈ రాశులవారికి అదృష్టం, పట్టిందల్లా బంగారం.. అందులో మీరున్నారో చెక్ చేయండి..

జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం 2024 సంవత్సరంలో నాలుగు రాశుల వ్యక్తులు ఎక్కువ ప్రయోజనం పొందుతారు. 2024లో దేవగురువు బృహస్పతి ఏప్రిల్ 30 వరకు మేషరాశిలో ఉంటాడు. మరుసటి రోజు అంటే మే 1వ తేదీన బృహస్పతి తన రాశిని మార్చుకుంటాడు. ఇది 4 రాశుల వారికి అదృష్టాన్ని తెస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు 4 అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం..

News Year 2024: 2024లో ఈ రాశులవారికి అదృష్టం, పట్టిందల్లా బంగారం.. అందులో మీరున్నారో చెక్ చేయండి..
Horoscope 2024
Follow us
Surya Kala

| Edited By: TV9 Telugu

Updated on: Dec 26, 2023 | 11:07 AM

జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలలో ఒకటైన బృహస్పతి స్థానం చాలా ముఖ్యమైనది. ఈ గురువు మన దైనందిన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాడో ఒక వ్యక్తి జాతకం లేదా కుండలి, రాశి ద్వారా తెలుసుకోవచ్చు. ఎవరి  జాతకంలో బృహస్పతి బలంగా ఉంటే వారి జీవితంలో డబ్బుకు కొరత ఉండదు. గురువు ఆశీర్వాదంతో మనిషి జీవితంలో అన్ని రకాల భౌతిక ఆనందాలను పొందుతాడు. అంతేకాదు సమాజంలో పరువు ప్రతిష్ట కూడా పెరుగుతుంది. ఏడు రోజుల్లో కొత్త సంవత్సరం 2024 ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏ రాశిలో  బృహస్పతి స్థానం ఎలా ఉంది.. ఏ విధమైన ఫలితం ఇస్తుందో తెలుసుకుందాం..

జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం 2024 సంవత్సరంలో నాలుగు రాశుల వ్యక్తులు ఎక్కువ ప్రయోజనం పొందుతారు. 2024లో దేవగురువు బృహస్పతి ఏప్రిల్ 30 వరకు మేషరాశిలో ఉంటాడు. మరుసటి రోజు అంటే మే 1వ తేదీన బృహస్పతి తన రాశిని మార్చుకుంటాడు. ఇది 4 రాశుల వారికి అదృష్టాన్ని తెస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు 4 అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మేష రాశి: కొత్త ఏడాదిలోని మే 1న బృహస్పతి మేషరాశిని వదిలి వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. అయితే తాను విడిచి పెడుతున్న మేషరాశికి చెందిన వ్యక్తులకు బృహస్పతి ఆశీర్వాదం ఉంటుంది. ఈ కాలంలో మేష రాశివారి ఆదాయంలో ఆకస్మిక పెరుగుదల ఉంటుంది. కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. అనేక విధాలుగా ఆదాయ వనరులుంటాయి. సంపద రాక మనసుకు సంతోషం కలుగుతుంది. పెండింగ్‌లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మొత్తంమీద మేషరాశికి 2024లో డబ్బుకు లోటు ఉండదు.

ఇవి కూడా చదవండి

కర్కటక రాశి: బృహస్పతి 2024లో కర్కాటక రాశికి చెందిన వారిపై తన అనుగ్రహాన్ని కురిపిస్తాడు. ఈ రాశిలో బృహస్పతి ఉన్నతంగా ఉంటాడు. అందువల్ల కర్కాటక రాశి వారిపై బృహస్పతి ఆశీస్సులు ఉంటాయి. ఈ కాలంలో కర్కాటక రాశి వారికి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి చెంది  వ్యాపారంలో భారీ ఆదాయం ఉంటుంది.

సింహ రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులు వారి కోరికల ప్రకారం వృత్తి, వ్యాపారాల్లో విజయాన్ని పొందుతారు.  ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లయితే ఖచ్చితంగా 2024లో ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్నట్లయితే మే నుండి వ్యాపారం ప్రారంభించవచ్చు. మొత్తంమీద 2024 సింహరాశి వారికి శుభప్రదమైన సంవత్సరం.

కన్య రాశి: ఈ రాశి వారికి 2024లో బృహస్పతి ప్రవేశం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అదృష్టం ఈ రాశి వారి సొంతం.. కొత్త సంవత్సరంలో శుభ కార్యాలు చేసే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో చెల్లించాల్సిన రుణాలను తీరుస్తారు. స్థిర, చర ఆస్తుల నుంచి మాత్రమే కాదు పలు రకరకాలుగా డబ్బు వస్తూనే ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు