Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhavani Deeksha: జనవరి 3 నుంచి భవానీ దీక్షల విరమణ ప్రారంభం.. రూ.3 కోట్ల బడ్జెట్‌తో ఏర్పాట్లు

భవానీ దీక్ష విరమణకు వచ్చే భక్తులు తలనీలాలు సమర్పించేందుకు మూడు ఘాట్స్‌లో 600 మందికి పైగా క్షురకులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఘాట్లలో స్నానానికి 800 షవర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 17 లక్షల లడ్డూ ప్రసాదాలు తయారు చేస్తున్నామన్నారు. ఉచిత అన్నదానం, ప్రసాదం పంపిణీ చేస్తామన్నారు చైర్మన్ కర్నాటి రాంబాబు.

Bhavani Deeksha: జనవరి 3 నుంచి భవానీ దీక్షల విరమణ ప్రారంభం.. రూ.3 కోట్ల బడ్జెట్‌తో ఏర్పాట్లు
Bhavani Deeksha
Follow us
Surya Kala

|

Updated on: Dec 26, 2023 | 6:53 AM

ఇంద్రకీలాద్రి పై కొలువైన కనక దుర్గమ్మవారి కరుణా కటాక్షం కోసం భక్తులు అమ్మవారి దీక్షను చేపడతారు. నియమ నిష్టలతో అమ్మవారిని పూజించడానికి భవానీ దీక్షను తీసుకుంటారు. మండల, అర్ధ మండల దీక్ష చేపట్టి.. తమ భవానీ దీక్ష విరమణ కోసం ఇంద్రకీలాద్రికి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో దీక్ష విరమణ మహోత్సవాలకు దుర్గగుడి దగ్గర ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న ఏర్పాట్లను చైర్మన్‌ కర్నాటి రాంబాబు పర్యవేక్షిస్తున్నారు.

ఇంద్ర కీలాద్రిపై జనవరి మూడు నుంచి ఏడో తేదీ వరకు జరిగే భవానీ దీక్ష విరమణలకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. రూ.3 కోట్ల బడ్జెట్‌తో దీక్షల విరమణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు. ఈసారి 5 లక్షల మంది భవానీలు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు రాంబాబు. భవానీ దీక్ష విరమణకు వచ్చే భక్తులు తలనీలాలు సమర్పించేందుకు మూడు ఘాట్స్‌లో 600 మందికి పైగా క్షురకులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఘాట్లలో స్నానానికి 800 షవర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 17 లక్షల లడ్డూ ప్రసాదాలు తయారు చేస్తున్నామన్నారు. ఉచిత అన్నదానం, ప్రసాదం పంపిణీ చేస్తామన్నారు చైర్మన్ కర్నాటి రాంబాబు.

దీక్ష విరమణలపై ఆలయ ఈవో కె.ఎస్‌.రామారావు, అధికారులతో కలిసి సమీక్ష చేశారు. ఏర్పాట్ల కోసం రూ.3  కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. మరోవైపు భవానీ దీక్ష విరమణ మహోత్సవాలకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. వినాయకుడి గుడి వద్ద నుంచి క్యూలైన్ల ఏర్పాటు దాదాపు పూర్తయింది. కనక దుర్గనగర్‌లో ప్రసాదం కౌంటర్ల కోసం క్యూలైన్లు ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. లక్ష్మీ గణపతి ప్రాంగణంలో షెడ్డు నిర్మాణం, మహా మండపం దిగువన హోమ గుండాల పనులు జరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..