Horoscope Today: ఈ రాశివారికి అన్నింటా శత్రువులే! జర జాగ్రత్త.. గురువారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?
ఉద్యోగ సంబంధమైన విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. వృత్తి, ఉద్యోగాల్లో శత్రు బాధ కాస్తంత ఎక్కువగా ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. ఏ విషయంలో అయినా యత్న కార్యసిద్ధి ఉంటుంది. నూతన వస్త్రాభర ణాలు కొనుగోలు చేస్తారు.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
చేపట్టిన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. రుణ సమస్యల నుంచి చాలావరకు బయటపడగలుగుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థికంగా మరింత పుంజుకుంటారు. కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సల హాలు తీసుకోవడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరిగి, దైవ కార్యాల్లో పాల్గొంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులకు బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ముఖ్యమైన వ్యవహారాల్లో మిశ్రమ ఫలితాలుంటాయి. బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు ముందుకు దూసుకు వెడతాయి. అనవసర పరిచయాలు చికాకు కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. కొందరు స్నేహితులు ఇబ్బంది పెడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థుల మీద ఒత్తిడి పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
వ్యాపారాలు ఆశించిన విధంగా ముందుకు సాగుతాయి. కుటుంబ సభ్యులతో ఇబ్బందిపడే అవ కాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ప్రతి వ్యవహారాన్ని పెద్దలతో ఆలోచించి ముందుకు సాగడం మంచిది. సతీమణితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యక్తిగత సమస్యని పరిష్కరించుకుంటారు. ఆదాయం పెరుగు తుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమల్లో ముందడుగు వేస్తారు.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
కొందరు బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా ఇబ్బందులుంటాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసు కోకపోవడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఆహార, విహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజన కంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలు వ్యయ ప్రయాసలతో పూర్తవుతాయి. బంధువుల రాకపోక లుంటాయి. విద్యార్థులు పురోగతి చెందుతారు. ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఆర్థికంగా కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవు తాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వ్యాపారాల్లో మార్పులు, చేర్పులు తలపెడతారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. ప్రముఖులతో పరిచ యాలు ఏర్పడతాయి. ఇంటా బయటా అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు నత్తనడక నడుస్తాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. పిల్లలు చదువుల్లో బాగా కష్టపడాల్సి ఉంటుంది. తలపెట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. ధన పరంగా ఎవరికీ ఎటువంటి వాగ్దానాలూ చేయకపోవడం మంచిది. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారంలో కొన్ని కీలక నిర్ణయాలు అమలు చేసి, లబ్ధి పొందుతారు. నిరు ద్యోగులు శుభవార్త అందుకుంటారు. విద్యార్థులకు పరవాలేదు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకు పోతారు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఆర్థిక లావాదేవీల్లో కొద్దిగా లాభాలు తగ్గే అవకాశం ఉంది. ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది. విదేశాల్లో ఉన్న పిల్లలు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విద్యార్థులు శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఉత్సాహం పెరుగు తుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ప్రయాణాల్లో విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంది. ప్రయాణాల్లోనే కాకుండా, ఆరోగ్యం విషయంలో కూడా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. నిరుద్యోగులు తమకు అందిన అవకా శాలను సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ లభిస్తుంది. మొండి బాకీలు వసూలవుతాయి. విద్యార్థులకు పురోగతి ఉంటుంది. ప్రేమల్లో సాన్నిహిత్యం పెరు గుతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యమైన పనులు కూడా నిదానంగా కొనసాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి ఉండకపోవచ్చు. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంటా బయటా మాటకు విలువ ఉంటుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులకు శ్రమ తప్పదు. ప్రేమ వ్యవహారాలు ఆనందంగా సాగిపోతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సమేతంగా దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు శుభవార్తలు తీసుకు వస్తారు. ప్రేమ వ్యవహారాలలో ఉత్సాహం పెరుగు తుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగ సంబంధమైన విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. వృత్తి, ఉద్యోగాల్లో శత్రు బాధ కాస్తంత ఎక్కువగా ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. ఏ విషయంలో అయినా యత్న కార్యసిద్ధి ఉంటుంది. నూతన వస్త్రాభర ణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపో తాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. విలువైన వస్తు సామగ్రి కొనుగోలు చేస్తారు. సోదరులతో సఖ్యత పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అవరోధాలను అధిగమిస్తారు. ఒకటి రెండు వ్యక్తిగత సమ స్యలను పరిష్కరించుకుంటారు. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. దైవ సేవా కార్య క్రమాల్లో పాల్గొంటారు. తలపెట్టిన పనులు సమయానికి పూర్తి చేస్తారు. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా ముందుకు సాగు తాయి.