Ayodhya:తెలుగువారి అదృష్టం.. అయోధ్య రామయ్య గుడి తలుపులు తయారీ భాగ్యనగరంలోనే .. ఎవరు చేశారంటే..
రామమందిరం ప్రకృతి లో ఎటువంటి విపత్తి ఏర్పడినా చెక్కు చెదరకుండా.. పటిష్టంగా ఉండేలా అత్యుత్తమ నాణ్యత కలిగిన మెటీరియల్, ఫర్నీచర్, వస్తువులను వినియోగిస్తున్నారు. ఈ అత్యంత ప్రతిష్టాత్మక నిర్మాణంలో మేము సైతం అంటూ అనేక మంది భక్తులు పాలు పంచుకుంటున్నారు. ఆలయ నిర్మాణంలో హైదరాబాద్‌కు చెందిన ఓ టింబర్ కంపెనీ కూడా పాలుపంచుకుంది. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఓ పోస్ట్ షేర్ చేశారు.
హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడు జన్మించిన అయోధ్యలో రామయ్య కొలువు దీరే సమయం ఆసన్నం అయింది. దాదాపు 500 ఏళ్ల తర్వాత అయోధ్యాపురి సరయు నది తీరంలో రామ్ లల్లా ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. శరవేగంగా నిర్మాణం జరుపుకుంటున్న రామమందిరం ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను శరవేగంగా చేస్తున్నారు. కోట్లాది మంది కలతీర్చే విధంగా నిర్మిస్తున్న ఈ ఆలయం ఎటువంటి ప్రకృతి విపత్తు ఏర్పడినా చెక్కు చెదరకుండా నిలబడనుంది. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా రామాలయాన్ని నాగర శైలిలో, అష్టభుజి ఆకారంలో నిర్మిస్తున్నారు.
ఈ రామాలయాన్ని జనవరి 22వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. బాల రామయ్య విగ్రహం గర్భ గుడిలో మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రతిష్టించనున్నారని పండితులు చెప్పారు. ఈ శుభ ముహర్త సమయంలో విగ్రహ ప్రతిష్ఠాపన జరిగితే దేశం పేరు మార్మోగిపోతుందని చెబుతున్నారు.
రామమందిరం ప్రకృతి లో ఎటువంటి విపత్తి ఏర్పడినా చెక్కు చెదరకుండా.. పటిష్టంగా ఉండేలా అత్యుత్తమ నాణ్యత కలిగిన మెటీరియల్, ఫర్నీచర్, వస్తువులను వినియోగిస్తున్నారు. ఈ అత్యంత ప్రతిష్టాత్మక నిర్మాణంలో మేము సైతం అంటూ అనేక మంది భక్తులు పాలు పంచుకుంటున్నారు. ఆలయ నిర్మాణంలో హైదరాబాద్‌కు చెందిన ఓ టింబర్ కంపెనీ కూడా పాలుపంచుకుంది. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఓ పోస్ట్ షేర్ చేశారు.
రామమందిరం తలుపులు భాగ్యనగరంలోని తయారవుతున్నాయి. సికింద్రాబాద్ లోని న్యూ బోయినపల్లిలో ఉన్న అనూరాధ టింబర్ డిపోలో రామాలయానికి సంబంధించిన తలుపులను రెడీ చేస్తున్నారు. తమిళనాడుకు చెందిన కుమారస్వామితో పాటు దాదాపు 60 మంది ఈ తలుపులను ఏడాది క్రితం నుంచే తయారీ చేయడం ప్రారంభించారు.
Ayodhya Ram temple doors made in #Hyderabad
They are being made at Anuradha Timbers International in New Boinpally, #Secunderabad
Sarath Babu, the owner of the company said they are making over 100 doors required for the Ram Temple in Ayodhya.
The inauguration of the… pic.twitter.com/sYhqxXhHce
— Sudhakar Udumula (@sudhakarudumula) December 26, 2023
ఈ తలుపుల తయారీకి బల్లార్షాకి చెందిన అత్యంత న్యాయమైన టేకును ఉపయోగిస్తున్నామని అనురాధ టింబర్ డిపో యజమాని శరత్ బాబు వెల్లడించారు. రామాలయంతో పాటు.. ఆలయ ప్రాంగణానికి అవసరమైన 100 తలుపులను రెడీ చేస్తున్నారు. ప్రారంభోత్సవ సమయం దగ్గర పడడంతో నిర్మాణ పనిలో వేగం పెంచడంతో పాటు.. చరిత్రలో నిలిచే ఈ క్రతువులో పాల్గొనడం పాల్గొనే భాగ్యం తమకు దక్కడం అదృష్టమని చెప్పారు.
రామాలయం ప్రాణప్రతిష్ట కార్యక్రమం కనులారా వీక్షించేందుకు అయోధ్యకు చేరుకోవడానికి లక్షలాది మంది సన్నాహాలు చేస్తున్నారు. వీవీఐపీలతో పాటు భారీగా భక్తులు రానుండడంతో పోలీసులు భారీ బందోబస్తీని ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు బస చేయడానికి హోటల్స్ బుకింగ్స్ కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..