ప్రపంచంలోని అతిపెద్ద ఆలయాల వరుసలో అయోధ్య రామ మందిరం.. టాప్‌ 5 ఆలయాలు ఏవంటే..

ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా 5 గోపురాలతో, 69 ఎకరాల్లో 3 అంతస్థుల్లో 161 అడుగుల ఎత్తులో ఆలయం నిర్మితమవుతోంది. అయోధ్యలోని ఈ రామ మందిరం మ్యాప్ 37 ఏళ్ల క్రితం తయారు చేయబడింది. అప్పుడు ఈ ప్రణాళికలో కొన్ని మార్పులు చేయడం ద్వారా నిర్మాణంలో ఉన్న ఆలయం మరింత పెద్దదిగా, మరింత అందంగా నిర్మితమవుతోంది. ఆలయ నిర్మాణం పూర్తై, భక్తులకు అందుబాటులోకి వస్తే.. అయోధ్యలోని రామమందిరం ప్రపంచంలోనే

| Edited By: TV9 Telugu

Updated on: Dec 28, 2023 | 5:43 PM

Akshardham Temple In Delhi- అక్షరధామ్ అంటే భగవంతుని దివ్య నివాసం అని అర్థం. ఇది భక్తి, స్వచ్ఛత, శాంతి లభించే ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది.  అక్షరధామ్ ఆలయ నిర్మాణం అక్షర పురుషోత్తం స్వామినారాయణ సంస్థ ఆధ్వర్యంలో జరిగింది. ఈ ఆలయం 59.3 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయ సముదాయం కావడంతో అక్షర‌ధామ్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. ఈ ఆలయంలో భారతదేశపు పౌరాణిక నాగరికత అణువణువునా కనిపిస్తుంది.

1 / 7
Sri Ranganathaswamy Temple-తమిళనాడులోని తిరుచ్చిలో ఉన్న శ్రీరంగనాథ దేవాలయం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద దేవాలయం గా పేరుగాంచింది. ఇది దక్షిణ భారత దేశంలోనే అతి పురాతన వైష్ణవ దేవాలయాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ ఆలయం 156 ఎకరాల్లో 4,116 మీటర్ల చుట్టుకొలతతో భారత దేశంలోనే అతిపెద్ద దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. విష్ణువు కి ఎంతో ప్రీతికరమైన 108 దేవాలయాల్లో ఒకటి. తమిళ నాడు లోని తిరుచిరాపల్లి లో ఉన్న శ్రీ రంగం అనే గ్రామం లో రంగనాథుడు కొలువై ఉన్నాడు.

2 / 7
Chidambaram- తమిళనాడులోని ఈ శివాలయాన్ని చిదంబరం ఆలయం అని కూడా అంటారు. చిదంబరం అంటే ఆకాశలింగం. ఈ ఆలయంలో స్వామి నటరాజ రూపం, ఇదీ అని చెప్పలేని చంద్రమౌళీశ్వర స్పటిక లింగరూపం, ఏ రూపం లేని దైవసాన్నిధ్యం అనే మూడు స్వరూపాల్లో దర్శనమిస్తాడు స్వామి. మూడో రూపమే చిదంబర రహస్యం.  ఈ ఆలయాన్ని 39 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. . ఈ ఆలయం 79.6935 E డిగ్రీల రేఖాంశంలో ఉంది. 108 నృత్య భంగిమలకు సంబంధించిన పురాతన దృష్టాంతం చిదంబరంలో మాత్రమే కనుగొనబడింది.

3 / 7
Chennakeshava Temple- ప్రసిద్ధి చెందిన బేలూరులోని చెన్నకేశవ దేవాలయం ఐదవ స్థానంలో ఉంది. చరిత్రలో నిలిచిపోయే ఆలయాల్లో చెన్నకేశవ ఆలయం ఒకటి. ఇది కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఉంది. ఈ ఆలయ ప్రాంతాన్ని దక్షిణ కాశి అని అంటారు. ఈ ఆలయ గాలిగోపురం ఎత్తు ఎంతో ప్రసిద్ధి. ఈ ఆలయంలోని రక రకాల శిల్పాలు సజీవంగానే ఉన్నాయా అనే సందేహం కలుగుతుంది. చెన్న కేశవ ఆలయాన్ని విష్ణు భగవానుడి కోసం నిర్మించారు. ఈ ఆలయాన్ని మృదువైన సున్నపు రాయితో నిర్మించారు. ఈ ఆలయంలో విష్ణువు అవతారమైన చెన్నకేశవ స్వామిని పూజిస్తారు.

4 / 7
Annamalaiyar Temple - తమిళనాడులోని తిరువణ్ణామలైలో ఉన్న ఈ శివాలయం భారీ ఎత్తైన స్తంభాలకు ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం 24.9 ఎకరాల విస్తీర్ణంలో ఉంది.

5 / 7
Brihadeeswarar Temple- తమిళనాడులోని తంజావూరులో ఉన్న ఈ శివాలయం 1000 సంవత్సరాలకు పైగా పురాతనమైనది. ఇది 25 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది.

6 / 7
Ayodhya Ram Mandir- ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా 5 గోపురాలతో, 69 ఎకరాల్లో 3 అంతస్థుల్లో 161 అడుగుల ఎత్తులో ఆలయం నిర్మితమవుతోంది.
అయోధ్యలోని ఈ రామ మందిరం మ్యాప్ 37 ఏళ్ల క్రితం తయారు చేయబడింది. అప్పుడు ఈ ప్రణాళికలో కొన్ని మార్పులు చేయడం ద్వారా నిర్మాణంలో ఉన్న ఆలయం మరింత పెద్దదిగా, మరింత అందంగా నిర్మితమవుతోంది. ఆలయ నిర్మాణం పూర్తై, భక్తులకు అందుబాటులోకి వస్తే.. అయోధ్యలోని రామమందిరం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆలయం అవుతుంది. 237 అడుగుల ఎత్తైన ఈ ఆలయాన్ని 71 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు.

Ayodhya Ram Mandir- ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా 5 గోపురాలతో, 69 ఎకరాల్లో 3 అంతస్థుల్లో 161 అడుగుల ఎత్తులో ఆలయం నిర్మితమవుతోంది. అయోధ్యలోని ఈ రామ మందిరం మ్యాప్ 37 ఏళ్ల క్రితం తయారు చేయబడింది. అప్పుడు ఈ ప్రణాళికలో కొన్ని మార్పులు చేయడం ద్వారా నిర్మాణంలో ఉన్న ఆలయం మరింత పెద్దదిగా, మరింత అందంగా నిర్మితమవుతోంది. ఆలయ నిర్మాణం పూర్తై, భక్తులకు అందుబాటులోకి వస్తే.. అయోధ్యలోని రామమందిరం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆలయం అవుతుంది. 237 అడుగుల ఎత్తైన ఈ ఆలయాన్ని 71 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు.

7 / 7
Follow us