- Telugu News Photo Gallery Are you struggling with financial problems? Do these remedies on Sunday, check details in Telugu
Spirituality Tips: ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా.. ఆదివారం ఈ పరిహారాలు చేయండి!
చాలా మంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. సమయానికి డబ్బు చేతికి అందక ఎన్నో సమస్యలను ఎదుర్కొనే ఉంటారు. ఇలా డబ్బుకు సంబంధించి పలు సమస్యలను ఎదుర్కొంటూ ఉంటే.. ఆదివారం ఈ పరిహారాలు చేయండి. ఆదివారం చాలా మంది సూర్య దేవున్ని పూజిస్తారు. నిష్టగా పూజలు కూడా చేస్తారు. ఆదివారం ప్రత్యేకంగా సూర్య దేవున్ని ప్రార్థిస్తే పలు రకాల సమస్యలు, ఇబ్బందులు తొలగి పోతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు..
Chinni Enni | Edited By: Ram Naramaneni
Updated on: Dec 27, 2023 | 9:36 PM

చాలా మంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. సమయానికి డబ్బు చేతికి అందక ఎన్నో సమస్యలను ఎదుర్కొనే ఉంటారు. ఇలా డబ్బుకు సంబంధించి పలు సమస్యలను ఎదుర్కొంటూ ఉంటే.. ఆదివారం ఈ పరిహారాలు చేయండి.

ఆదివారం చాలా మంది సూర్య దేవున్ని పూజిస్తారు. నిష్టగా పూజలు కూడా చేస్తారు. ఆదివారం ప్రత్యేకంగా సూర్య దేవున్ని ప్రార్థిస్తే పలు రకాల సమస్యలు, ఇబ్బందులు తొలగి పోతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

ఆదివారం ఉదయం స్నానం చేశాక సూర్య దేవుడికి నమస్కారం చేసి, నీటిని సమర్పించాలి. ఆ తర్వాత మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద నెయ్యి దీపాన్ని వెలిగించాలి. ఇలా చేస్తే సూర్య దేవునితో పాటు లక్ష్మీ దేవి అనుగ్రహం కూడా కలుగుతుంది.

ఆదివారం ఏదైనా పనిమీద బయటకు వెళ్తే ఎర్ర చందనంతో బొట్టు పెట్టుకోవాలి. దీని వల్ల మీరు చేపట్టిన అన్ని పనుల్లో విజయాన్ని సాధిస్తారు. అలాగే ఎరుపు రంగు దుస్తులు ధరించినా కూడా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి.

సూర్య భగవానుడి అనుగ్రహం పొంది.. ఆర్థిక సమస్యలన్నీ పోవాలంటే.. ఆదివారం బెల్లం, పాలు, బియ్యం, ఎరుపు రంగు వస్త్రాన్ని.. సూర్యదేవునికి సమర్పించండి. ఆ తర్వాత వీటిని నిస్సహాయులకు దానం చేస్తే మంచిది. ఇలా చిన్న పరిహారాల వల్ల ఆర్థిక సమస్యలను పోగొట్టుకోవచ్చని జోత్యిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.





























