- Telugu News Photo Gallery Cinema photos Makers Shares Mahesh Babu's new mass poster from Guntur Karam movie telugu cinema news
Guntur Karam: రమణగాడి మాస్ జాతర షూరు.. పోస్టర్స్‌తో అదరగొట్టేస్తోన్న ‘గుంటూరు కారం’ ప్రమోషన్స్..
టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ మూవీ 'గుంటూరు కారం'. డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అతడు, ఖలేజా తర్వాత వీరిద్దరి కాంబో వస్తున్న ఈ సినిమా కోసం ఘట్టమనేని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్, సాంగ్స్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు.
Updated on: Dec 27, 2023 | 12:43 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ మూవీ 'గుంటూరు కారం'. డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.

అతడు, ఖలేజా తర్వాత వీరిద్దరి కాంబో వస్తున్న ఈ సినిమా కోసం ఘట్టమనేని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్, సాంగ్స్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేశాయి.

ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు. ఇందులో మహేష్ బాబు పూర్తిగా మాస్ యాక్షన్ హీరోగా కనిపించనున్నట్లు పోస్టర్స్ చూస్తే తెలుస్తోంది.

విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో ఇప్పుడు మేకర్స్ ప్రమోషన్స్ షూరు చేశారు. గుంటూరు కారం సినిమా నుంచి మహేష్ పోస్టర్స్ రిలీజ్ చేస్తూ బజ్ క్రియేట్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఫ్యాన్ హ్యాండిల్స్ ద్వారా ఒక్కో పోస్టర్ రిలీజ్ చేయిస్తూ విభిన్న కాన్సెప్ట్ తో గుంటూరు కారం టీమ్ అభిమానులలో జోష్ నింపుతుంది.

ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, శ్రీలీల కథానాయికలుగా నటిస్తుండగా.. థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, సునీల్, హైపర్ ఆది కీలకపాత్రలలో నటిస్తున్నారు.

సోషల్ మీడియాలోగుంటూరు కారం టైటిల్‌తోనే పక్కా మాస్ మూవీ అని చెప్పేశారు మేకర్స్. ఇక ఇందులో మహేష్ సైతం లుంగీ.. చేతిలో బీడి పట్టుకుని మాస్ అవతారంలో కనిపిస్తూ సినిమా పై ఆసక్తిని కలిగిస్తున్నారు. ఫ్యాన్ హ్యాండిల్స్ ద్వారా ఒక్కో పోస్టర్ రిలీజ్ చేయిస్తూ విభిన్న కాన్సెప్ట్ తో గుంటూరు కారం టీమ్ అభిమానులలో జోష్ నింపుతుంది.

రమణగాడి మాస్ జాతర షూరు.. పోస్టర్స్‌తో అదరగొట్టేస్తోన్న 'గుంటూరు కారం' ప్రమోషన్స్..




