- Telugu News Photo Gallery Cinema photos Prabhas fans pressure on director prashanth neel about salaar part 2 update in Film industry Telugu Entertainment photos
Prashanth neel – Salaar – 2: ప్రశాంత్ నీల్ పై ఒత్తిడి చేస్తున్న డార్లింగ్ ఫ్యాన్స్.! సలార్ 2 నే సమాధానం.
అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ప్రభాస్‌ను బిగ్ స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన ప్రశాంత్ నీల్, మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. సలార్ సినిమాతో డార్లింగ్ ఫ్యాన్స్ ఆకలి తీర్చిన నీల్, అంతుకు మించి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా వదిలేశారు. సలార్ 2లో ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వబోతున్నారా..? అసలు అభిమానులు క్లారిటీ కోరుతున్న ప్రశ్నలేంటి.? సలార్ సినిమా సక్సెస్‌తో ప్రభాస్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. డార్లింగ్ కటౌట్‌కు సరైన కంటెంట్ పడితే బాక్సాఫీస్ ఏ రేంజ్‌లో షేక్ అవుతుందో ఈ సినిమాతో ప్రూవ్ అయ్యింది.
Updated on: Dec 26, 2023 | 9:54 PM

అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ప్రభాస్‌ను బిగ్ స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన ప్రశాంత్ నీల్, మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. సలార్ సినిమాతో డార్లింగ్ ఫ్యాన్స్ ఆకలి తీర్చిన నీల్, అంతుకు మించి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా వదిలేశారు. సలార్ 2లో ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వబోతున్నారా..? అసలు అభిమానులు క్లారిటీ కోరుతున్న ప్రశ్నలేంటి.?

సలార్ సినిమా సక్సెస్‌తో ప్రభాస్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. డార్లింగ్ కటౌట్‌కు సరైన కంటెంట్ పడితే బాక్సాఫీస్ ఏ రేంజ్‌లో షేక్ అవుతుందో ఈ సినిమాతో ప్రూవ్ అయ్యింది. అయితే ఈ సినిమా సక్సెస్ సీక్వెల్ మీద అంచనాలను డబుల్ చేసింది. సలార్ పార్ట్ 1లో ఎక్కువగా ప్రభాస్ ఎలివేషన్,

అసలు కథకు లీడ్ చేసే సీన్స్ మీదే దృష్టి పెట్టిన దర్శకుడు, మెయిన్ కథ అంతా పార్ట్ 2లోనే చూపించాల్సి ఉంది. ముఖ్యంగా ప్రాణ స్నేహితులైన దేవా, వరద ఎలా శత్రువులవుతారు? ఖాన్‌సార్ సింహాసనానికి తానే వారసుడు అని దేవాకు ఇప్పటికే తెలుసా..? సీక్వెల్‌లో తెలుస్తుందా..? ప్రభాస్ తండ్రి పాత్రలో ఎవరు కనిపిస్తారు..? డార్లింగే డ్యూయల్ రోల్ చేయబోతున్నారా.?

పార్ట్ 2లో మిస్ అయిన లవ్ ఎపిసోడ్స్ సీక్వెల్‌లో కనిపిస్తాయా..? ఇలా ఎన్నో ప్రశ్నలు అభిమానుల మదిలో మెదలుతున్నాయి. ఇన్ని ప్రశ్నలు వేదిస్తుండటంతో సీక్వెల్ త్వరగా థియేటర్లలోకి రావాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. కానీ ప్రశాంత్ నీల్ మాత్రం ఈ సస్పెన్స్ కొన్నేళ్ల పాటు కంటిన్యూ చేసేలా ఉన్నారు.

ఆల్రెడీ నెక్ట్స్ మూవీ ఎన్టీఆర్‌తో చేయబోతున్నట్టుగా ఎనౌన్స్ చేశారు నీల్. ఒక్కో సినిమాకు రెండు మూడేళ్ల సమయం తీసుకుంటున్న ఈ డైరెక్టర్, ఎన్టీఆర్ సినిమాను స్టార్ట్ చేసి పూర్తి చేసే సరికీ ఏళ్లు గడిచిపోతాయి. అందుకే ముందు సలార్ 2ను పట్టాలెక్కించమని రిక్వెస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

ప్రస్తుతం దేవర వర్క్‌లో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా పార్ట్ 1 ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత తారక్ దేవర సీక్వెల్ స్టార్ట్ చేస్తారా..? లేదంటే ప్రశాంత్ నీల్ మూవీ పట్టాలెక్కిస్తారా అన్న విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.

ఈ విషయం తేలితే గానీ సలార్ సీక్వెల్ విషయంలో ఓ అంచనాకు రాలేం. అందుకే ముందునుంచే ప్రశాంత్ నీల్ మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్న డార్లింగ్ ఫ్యాన్స్.




