- Telugu News Photo Gallery Cinema photos Tollywood To Bollywood Movies Updates on 26 12 2023 Telugu Entertainment Photos
Entertainment: డంకీ మూవీకి భారీ డిమాండ్.. 150 కోట్లు. | శ్రుతి క్రేజ్.. అమ్మడి లెగ్ గోల్డే.
శ్రుతి క్రేజ్: అడివి శేష్, శ్రుతి హాసన్ లీడ్ రోల్స్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ డెకాయిట్. శత్రువులుగా మారిన ఇద్దరు ప్రేమికుల కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం తన కెరీర్‌లోనే హయ్యస్ట్ పేమెంట్ అందుకుంటున్నారు శ్రుతి హాసన్. ఈ సినిమాలో ఓ పాట కూడా పాడేందుకు ఓకే చెప్పిన శ్రుతి, మూడు కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటున్నారన్న టాక్ వినిపిస్తోంది. | హై ఓల్టేజ్ ఎంటర్‌టైన్మెంట్: అన్‌స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్‌లో మూడో ఎపిసోడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.
Updated on: Dec 26, 2023 | 9:55 PM

జగ గర్జన: రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మరికొద్ది గంటల్లో జరగనుంది. ఇప్పటికే విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభం కానున్న ఈ ఈవెంట్‌కు వ్యూహం జగ గర్జన అనే పేరు పెట్టింది చిత్రయూనిట్.

ఫైటర్ సింగిల్: ఇండియాస్ ఫస్ట్ ఏరియల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న మూవీ ఫైటర్. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ తాజాగా సెకండ్ సింగిల్‌ను రిలీజ్ చేసింది. హృతిక్, దీపికపై చిత్రీకరించిన రొమాంటిక్ నెంబర్ వైరల్ అవుతోంది.

భారీ డిమాండ్: ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన షారూఖ్ డంకీ సినిమాకు ఆడియన్స్ నుంచి మిక్స్‌డ్ రెస్పాన్స్ వస్తోంది. ఫస్ట్ టైమ్ రాజ్‌కుమార్ హిరానీ, షారూఖ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా కావటంతో డంకీ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా ఓటీటీ డీల్ 150 కోట్లకు పైగా పలికినట్టుగా ప్రచారం జరుగుతోంది.

శ్రుతి క్రేజ్: అడివి శేష్, శ్రుతి హాసన్ లీడ్ రోల్స్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ డెకాయిట్. శత్రువులుగా మారిన ఇద్దరు ప్రేమికుల కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం తన కెరీర్‌లోనే హయ్యస్ట్ పేమెంట్ అందుకుంటున్నారు శ్రుతి హాసన్. ఈ సినిమాలో ఓ పాట కూడా పాడేందుకు ఓకే చెప్పిన శ్రుతి, మూడు కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటున్నారన్న టాక్ వినిపిస్తోంది.

హై ఓల్టేజ్ ఎంటర్‌టైన్మెంట్: అన్‌స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్‌లో మూడో ఎపిసోడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ ఎపిసోడ్‌కు డైరెక్టర్లు జయంత్ సీ పరాన్జీ, హరీష్ శంకర్‌తో పాటు హీరోయిన్ శ్రియ గెస్ట్‌లుగా హాజరయ్యారు. బాలయ్య మార్క్ మాస్ ఎంటర్‌టైన్మెంట్‌తో సాగిన ఈ ఎపిసోడ్‌కు ఆహా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.




