- Telugu News Photo Gallery Cinema photos Prabhas Salaar to Vijay Thalapathy 68 latest movie updates from Film Industry
Movie Updates: సలార్ కథ విషయంలో క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్.. దళపతి 68పై వార్తలు వైరల్..
రిలీజ్‌కు కొన్ని గంటల ముందు సలార్ కథ విషయంలో క్లారిటీ ఇచ్చారు దర్శకుడు ప్రశాంత్ నీల్. వ్యూహం సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆ మూవీని భారీగా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అఫీషియల్ అప్‌డేట్ లేకపోయినా... సోషల్ మీడియాను షేక్ చేస్తోంది దేవర. రజనీకాంత్ గెస్ట్ రోల్‌లో నటిస్తున్న అప్ కమింగ్ మూవీ లాల్ సలామ్. దళపతి విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.
Updated on: Dec 27, 2023 | 3:22 PM

రిలీజ్‌కు కొన్ని గంటల ముందు సలార్ కథ విషయంలో క్లారిటీ ఇచ్చారు దర్శకుడు ప్రశాంత్ నీల్. చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్నట్టుగా ఈ సినిమా ఉగ్రం కథతోనే రూపొందింది అన్నారు. అయితే ఇది రీమేక్ కాదని, రీ టెల్లింగ్ అని చెప్పారు. 2014లో రిలీజ్ అయిన ఉగ్రం అప్పట్లో అనుకున్న స్థాయిలో వసూళ్లు సాధించలేదు.

వ్యూహం సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆ మూవీని భారీగా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా వ్యూహం నైజాం రిలీజ్‌కు సంబంధించి కీలక అప్‌డేట్ ఇచ్చారు. నైజాంలో దిల్ రాజు రిలీజ్ చేస్తున్నట్టుగా వెల్లడించారు. 2009 నుంచి 2019 మధ్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరిగిన సంఘటనల నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు.

అఫీషియల్ అప్‌డేట్ లేకపోయినా... సోషల్ మీడియాను షేక్ చేస్తోంది దేవర. సెట్‌లో ఎన్టీఆర్, కొరటాలకు సంబంధించిన ఫోటో బయటకు రావటంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతున్న దేవర ఏప్రిల్‌లో రిలీజ్‌కు రెడీ అవుతోంది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

రజనీకాంత్ గెస్ట్ రోల్‌లో నటిస్తున్న అప్ కమింగ్ మూవీ లాల్ సలామ్. రజనీ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. కానీ అదే సీజన్‌లో కోలీవుడ్‌లో భారీ చిత్రాలు రిలీజ్ అవుతుండటంతో లాల్ సలామ్‌ను వాయిదా వేసింది చిత్రయూనిట్. జనవరి 26న ఈ సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

దళపతి విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకు బాస్, పజిల్ అనే టైటిల్స్‌ను పరిశీలిస్తున్నట్టుగా జరుగుతున్న ప్రచారాన్ని చిత్రయూనిట్ ఖండించింది. ఇంతవరకు టైటిల్ ఫిక్స్ చేయలేదని, త్వరలోనే అఫీషియల్‌గా టైటిల్ ఏంటన్నది ఎనౌన్స్ చేస్తామన్నారు.




