Ayodhya Travel: రామ్ లల్లా అనుగ్రహం కోసం అయోధ్యకు వెళ్తున్నారా..! మీ యాత్రను ఇలా ప్లాన్ చేసుకోండి.

పవిత్రోత్సవం సందర్భంగా సుమారు 4000 మంది సాధువులు, మునులు అయోధ్యకు చేరుకోనున్నారు. ఈ శుభ ముహర్తం  కోసం యావత్ హిందువులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చారిత్రక ఘట్టాన్ని చూసేందుకు దేశ, విదేశాల నుంచి ప్రజలు అయోధ్య నగరానికి తరలిరానున్నారు. అటువంటి పరిస్థితిలో మీరు కూడా అయోధ్యకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే.. ఇక్కడకు ఎలా చేరుకోవాలి? అక్కడ ఏయే ప్రదేశాలను సందర్శించాలో ఈ రోజు తెలుసుకుందాం.. 

Ayodhya Travel: రామ్ లల్లా అనుగ్రహం కోసం అయోధ్యకు వెళ్తున్నారా..! మీ యాత్రను ఇలా ప్లాన్ చేసుకోండి.
Ayodhya Travel
Follow us

|

Updated on: Dec 30, 2023 | 8:33 AM

అయోధ్యలోని శ్రీరాముని జన్మస్థలంలో జరిగే పవిత్రోత్సవం హిందువులకు అత్యంత పవిత్రమైన చారిత్రక ఘట్టం. దాదాపు 500 ఏళ్లుగా కంటున్న కల ఇన్నాళ్లకు నెరవేరబోతోంది. జనవరి 22న అయోధ్యలో గర్భ గుడిలో బాల రాముడి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ఈ చారిత్రక ఘట్టాన్ని చూసేందుకు దేశ, విదేశాల నుంచి ప్రజలు అయోధ్య నగరానికి తరలిరానున్నారు. అటువంటి పరిస్థితిలో మీరు కూడా అయోధ్యకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే.. ఇక్కడకు ఎలా చేరుకోవాలి? అక్కడ ఏయే ప్రదేశాలను సందర్శించాలో ఈ రోజు తెలుసుకుందాం..

పవిత్రోత్సవం సందర్భంగా సుమారు 4000 మంది సాధువులు, మునులు అయోధ్యకు చేరుకోనున్నారు. ఈ శుభ ముహర్తం  కోసం యావత్ హిందువులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్యాపురి  పర్యటనకు వెళ్లాలనుకునేవారికి పూర్తి సమాచారం..

ఇవి కూడా చదవండి

కనక భవనం

శ్రీ రాముడు, సీతను వివాహం చేసుకుని అయోధ్యకు వచ్చిన సందర్భంగా తల్లి కైకేయి సీతారాములకు తన కనక భవనాన్ని బహుమతిగా ఇచ్చినట్లు పురాణాల కథనం. ఈ అందమైన కనక భవనం ఒక ప్యాలెస్ లా కనువిందు చేస్తుంది. కనకం అంటే బంగారం. పసుపు రంగులో ఉండే ఈ భవనాన్ని ముందు నుంచి చూస్తే.. బంగారంతో చేసినట్టు కనిపిస్తుంది. బుందేల్‌ఖండ్, రాజస్థానీ హస్తకళల కలయిక ఈ భవన నిర్మాణం..  తలుపు ఫ్రేమ్‌లు, వైపులా స్పష్టంగా అలనాటి నిర్మాణ శైలికి అద్దం.

హనుమాన్‌గర్హి

హనుమంతుడు లేకుండా శ్రీరాముని పని పూర్తి కాదని నమ్మకం. అదే విధంగా.. ఎవరైనా అయోధ్యకు వెళ్తే..  హనుమాన్‌మర్హిని సందర్శించకుండా అతని తీర్ధ యాత్ర పూర్తి కాదని.. ఆ యాత్ర అసంపూర్తి అని విశ్వాసం. గుట్టపై నిర్మించిన ఈ ఆలయానికి చేరుకోవాలంటే 70 మెట్లు ఎక్కాలి.

దశరథ్ మహల్

అయోధ్య వెళ్లిన వారు దశరథుడి భవనాన్ని చూడటం మర్చిపోవద్దు. అందమైన కళాకృతులతో అలంకరించబడిన రంగు రంగుల గోడలు..  తమలో తాము సరళత్వాన్ని నింపుకుని ఠీవిగా నిలబడి దర్శనమిస్తాయి.  దశరథ మహారాజు తన కుటుంబంతో ఇక్కడ నివసించినట్లు నమ్ముతారు.

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

View this post on Instagram

A post shared by Satish (@globe_scanner)

అయోధ్య ఎలా చేరుకోవాలంటే

విమాన ప్రయాణం :

అయోధ్యకు వెళ్లేవారు విమాన ప్రయాణాన్ని ఎంచుకుంటే గోరఖ్‌పూర్ లేదా లక్నో విమానాశ్రయానికి వెళ్లవచ్చు. గోరఖ్‌పూర్ విమానాశ్రయం నుండి ఇక్కడ దూరం 140 కిలోమీటర్లు, లక్నో నుండి దూరం 150 కిలోమీటర్లు. అంటే విమానాశ్రయం నుండి 3-4 గంటలు ప్రయాణం చేసి అయోధ్య చేరు చేరుకోవాలి.

రైలు ప్రయాణం:

దేశం నుంచి అన్ని వైపుల నుంచి రైలు ప్రయాణ కనెక్టివిటీ సదుపాయాలున్నాయి. అయోధ్య రైల్వే స్టేషన్‌లో నేరుగా దిగవచ్చు. న్యూఢిల్లీ నుండి అయోధ్యకు వెళుతున్నట్లయితే దాదాపు 670 కిలోమీటర్లు ప్రయాణించవలసి ఉంటుంది. దానిని 10 నుండి 11 గంటల జర్నీ ఉండనుంది. అదే సికింద్రాబాద్ నుంచి రైలులో ప్రయాణించాలనుకుంటే దాదాపు 31 గంటల జర్నీ చేయాల్సి ఉంటుంది. గోరఖ్ పూర్ నుంచి అయోధ్యకు చేరుకోవాలి.

బస్సు ప్రయాణం:

అయోధ్యకు వెళ్లేందుకు ఢిల్లీతోపాటు అన్ని ప్రాంతాల నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ బస్సులు అందుబాటులో ఉంటాయి. అయితే బస్సు ప్రయాణం కాస్త అలసటగా ఉంటుంది. హైదరాబాద్ నుంచి అయోధ్యకు ప్రవేట్ ట్రావెల్స్ బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఏసీ బస్సులో కూడా దాదాపు 6వేల రూపాయల టికెట్ తో అయోధ్యకు చేరుకోవచ్చు. అయితే దాదాపు 42 గంటలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అదే ఢిల్లీ వరకు చేరుకొని అక్కడ నుంచి బస్సులో వెళ్లాలనుకుంటే ఢిల్లీ నుంచి అయోధ్యకు సులభంగా ప్రయాణించవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు