Andhra Pradesh: మేఘాల్లో తేలిపోవాలని వంజంగి టూర్ ప్లాన్ చేస్తున్నారా…? నో ఎంట్రీ
మేఘాల్లో తేలిపోవాలని వంజంగి టూర్ ప్లాన్ గట్రా వేస్తున్నారా? జస్ట్ హోల్డ్ ఆన్. జనవరి 9 వరకు టూరిస్టులకు నో పర్మిషన్. ఎందుకంటే..రీజన్ అలాంటిది మరి. ఆ డీటేల్స్ ఏంటో తెలుసుకుందాం పదండి...
స్వచ్ఛమైన గాలి.. నీలి నీలి ఆకాశం.. మూన్‌లైట్.. పచ్చని శాలువ చుట్టినట్టు ఉండే కొండలు.. కొండల మధ్య సన్నని రహదార్లు.. కోయిల కుహు కుహూ రాగాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో అందాలు. పచ్చని ప్రకృతి ఒడిలో మేఘాల లోకం.. వంజింగి.. మేఘాల్లో తేలిపోవాలని థ్రిల్ వున్న వాళ్లకు వంజింగి.. ది బెస్ట్ డిస్టినేషన్. అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలోని వంజింగిలో సోయగం అంతా ఇంతా కాదు. దేవ లోకం భువికి దిగొచ్చిందా అన్నట్టుగా మంచు మేఘాలు కనువిందు చేస్తాయి. పాల నరుగులాంటి మంచు మేఘాల మధ్య విహరిస్తూ ఆనందిస్తారు పర్యాటకులు.
ఇక న్యూ ఇయర్ వచ్చిందంటే..వంజింగిలో సెలబ్రేషన్స్ మాములుగా ఉండవు. ఈసారి కూడా చాలా మంది వంజింగి టూర్‌కు ప్లాన్ చేసే ఉంటారు. చేసివుంటే జర్నీని పోస్ట్ పోన్ చేసుకోవాలి ఇక. ఎందుకంటే జనవరి 2 నుంచి 9వ తేది వరకు వంజింగికి పర్యాటకులను అనుమతించరు. ఆ విధంగా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు కూడా . మరోలా అనుకోవద్దు. ఆ నిర్ణయం కూడా పర్యాటకుల మంచికోసమే. ఇంకా చెప్పాలంటే క్లీన్‌లైన్స్ పాటించని కొందరి వల్ల కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవు. వద్దన్నా వినకుండా ప్లాస్టిక్ బాటిల్స్..కవర్స్‌ను వాడ్డం..మన ఇల్లు కాదుకదా అన్నట్టు పడేయం పరిపాటయింది. దాని ఫలితం వంజింగిలో ప్లాస్టిక్ వ్యర్థాలు భారీగా పేరుకుపోయాయి.
ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడం సహా వంజింగిలో రోడ్ల మరమతుల కోసం ఓ వారం వంజింగిలో పర్యాటకులకు అనుమతి లేదని అధికారులు చెబుతున్నారు. ఇది జస్ట్ చిన్న బ్రేక్. జనవరి 9 నుంచి వంజింగి మేఘాల లోకానికి అందరూ ఆహ్వానితులే. కాకపోతే పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని గుర్తుపెట్టుకోవాలి. సహకరించాలి.
జనవరి 9 తరువాత వంజింగి ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. కొడైకెనాల్‌లోనో… కులుమనాలి ఎందకంటూ వంజింగి ట్రిప్‌కు ప్లాన్ చేస్తుంటారెందరో. చేతికి అందే మేఘాలను తాకుతూ సెల్ఫీలు దిగితే లైఫ్ టైమ్ హ్యాప్పీస్. ఆ లెవల్‌లో ఎంజాయ్ చేస్తుంటారు. అద్భుత లోకంలో విహరిస్తున్నట్లు తన్మయత్వం చెందుతారు. .నిజమే..కానీ. జనవరి 9 వరకు కాస్త బ్రేక్ ఇవ్వండి. ఆ తరువాత వంజింగిలో ఎంజాయ్‌మెంట్ తగ్గేదే ఉండదిక.