AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Luxurious Vacation: విదేశాల్లో టూర్‌కు ప్లాన్‌ చేస్తున్నారా? ఆ దేశాల్లో మనమే మహరాజులం..

ముఖ్యంగా టెన్షన్స్‌ నుంచి రిలీఫ్‌ పొందడంతో పాటు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడానికి దూర ప్రాంతాలను సందర్శిస్తూ ఉంటారు. అయితే ఇలా విహారయాత్రలకు వెళ్లే వారు విదేశాలకు వెళ్లాలని చాలా ప్లాన్‌లు వేస్తూ ఉంటారు. అయితే బడ్జెట్‌ దెబ్బకు దూరంగా ఉంటారు. ముఖ్యంగా విదేశాల్లో మన దేశపు కరెన్సీ అయిన రూపాయి మారకం విలువ భారీగా ఉండడంతో విదేశాల టూర్లు అనేవి మన ఆలోచనల్లోకి కూడా రానివ్వరు. అయితే ప్రపంచవ్యాప్తంగా రూపాయి మారకం విలువ భారీగా ఉన్న దేశాలు కూడా ఉన్నాయి.

Luxurious Vacation: విదేశాల్లో టూర్‌కు ప్లాన్‌ చేస్తున్నారా? ఆ దేశాల్లో మనమే మహరాజులం..
Tours
Nikhil
| Edited By: Ram Naramaneni|

Updated on: Dec 31, 2023 | 7:09 PM

Share

ఉరుకుల పరుగుల జీవితంలో కొంత రిలాక్సేషన్‌ కోసం చాలా మంది విహారయాత్రలకు ప్లాన్‌ చేస్తారు. ముఖ్యంగా టెన్షన్స్‌ నుంచి రిలీఫ్‌ పొందడంతో పాటు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడానికి దూర ప్రాంతాలను సందర్శిస్తూ ఉంటారు. అయితే ఇలా విహారయాత్రలకు వెళ్లే వారు విదేశాలకు వెళ్లాలని చాలా ప్లాన్‌లు వేస్తూ ఉంటారు. అయితే బడ్జెట్‌ దెబ్బకు దూరంగా ఉంటారు. ముఖ్యంగా విదేశాల్లో మన దేశపు కరెన్సీ అయిన రూపాయి మారకం విలువ భారీగా ఉండడంతో విదేశాల టూర్లు అనేవి మన ఆలోచనల్లోకి కూడా రానివ్వరు. అయితే ప్రపంచవ్యాప్తంగా రూపాయి మారకం విలువ భారీగా ఉన్న దేశాలు కూడా ఉన్నాయి. భారతీయ కరెన్సీ మిమ్మల్ని రాజుగా భావించేలా చేసే అనేక దేశాల్లో మీరు అద్భుతమైన టూర్‌ను ప్లాన్‌ చేసుకోవచ్చు. ఏయే దేశాల్లో మన బడ్జెట్‌ ఫ్రెండ్లీగా టూర్‌ను ప్లాన్‌ చేసుకోవచ్చో? ఓ సారి తెలుసుకుందాం.

ఇండోనేషియా

ఇండోనేషియా సహజమైన బ్లూ వాటర్‌, అద్భుతమైన ద్వీపాలు, ఉష్ణమండల వాతావరణానికి ప్రసిద్ధి చెందింది. భారతీయ కరెన్సీ అనుకూలమైన మారకపు రేటును పొందే గమ్యస్థానంగా ఉంది. ఈ దేశంలో బడ్జెట్‌ను మించకుండా మన టూర్‌ను ఎంజాయ్‌ చేయవచ్చు. ఇక్కడ మన రూపాయి అక్కడ కరెన్సీలో186.4తో సమానం.

కంబోడియా

కంబోడియా దేశంలో ఆకట్టకునే పురాతన కట్టడాలు ప్రయాణికులను ఆకర్షిస్తున్నాయి. ఇక్కడ మన రూపాయి 49.40తో సమానం. ఇక్కడ ఉండే విభిన్న కార్యకలాపాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి. అంతే కాకుండా మీ బ్యాంకు బ్యాలెన్స్‌ ఎలాంటి ఇబ్బంది లేదకుండా ఈ ప్రదేశాలను సందర్శించవచ్చు. 

ఇవి కూడా చదవండి

వియాత్నాం

వియత్నాంలో భారతీయ రూపాయి మంచి మారకపు విలువ ఉంది. ఇక్కడ మన రూపాయి వారి కరెన్సీలో 292.87తో సమానం. అందువల్ల ఈ దేశంలో మనం టూర్‌ను ఎంజాయ్‌ చేయవచ్చు. ఈ దేశంలో మన రాజ అనుభవాన్ని మరింత సుముఖం చేస్తుంది. 

నేపాల్‌ 

భారతీయ పొరుగు దేశమైన నేపాల్‌ భారతీయ సంస్కృతికి కొంచెం దగ్గరగా ఉంటుంది. నేపాల్‌ అడవిలో అడ్వెంచర్స్‌ విన్యాసాలు పర్యాటకులను ఆకట్టకుంటుంది. ఈ సాహసోపేతమైన స్వర్గధామంలో మిమ్మల్ని మీరు విలాసపరచుకోవడానికి, మరపురాని క్షణాలను సృష్టించుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది. ఇక్కడ భారతీయ రూపాయి 1.60తో సమానం.

శ్రీలంక

పరిమిత బడ్జెట్‌తో విదేశాల్లో ప్రయాణం గురించి ఆలోచించే వారికి శ్రీలంక మంచి ఎంపిక. ఇక్కడ మన భారత రూపాయి అక్కడ కరెన్సీలు 3.93 రూపాయితో సమానం. కాబట్టి ఇక్కడ విలాసవంతమైన సెలవులను ఆస్వాదించడానికి మంచిగా ఉంటుంది. ముఖ్యంగా ఇది ఈ ఆకర్షణీయమైన గమ్యస్థానంలో సగం ఖర్చుతో ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..