Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizag Tour: చలికాలంలో చిల్.. జిల్.. ఒకేసారి వైజాగ్, అరకు చుట్టేసి రావొచ్చు.. అతి తక్కువ ధరలో..

IRCTC Tour: దక్షిణ భారత దేశంలోనే మంచి టూరిస్ట్ స్పాట్ గా అరకలోయలు ప్రసిద్ధి గాంచాయి. అక్కడి కాఫీ తోటలు, ప్రకృతి రమణీయతను ఎవరైనా ముగ్ధులవ్వాల్సిందే. ఆ ప్రాంతాన్ని చూడాలంటే ఇదే సరైన సమయం. అంటే శీతాకాలం. ఇప్పుడే అక్కడి అందాలను ఆస్వాదించగలం.మీరు వైజాగ్ నగరంతో పాటు, అరకు వ్యాలీని చూడాలని భావిస్తే.. ఈ కథనం మీ కోసమే.. ఐఆర్ సీటీసీ టూరిజమ్ ఒకేసారి రెండింటిని చుట్టేసి వచ్చేలా ప్రత్యేకమైన ప్యాకేజీని అందిస్తోంది.

Vizag Tour: చలికాలంలో చిల్.. జిల్.. ఒకేసారి వైజాగ్, అరకు చుట్టేసి రావొచ్చు.. అతి తక్కువ ధరలో..
Beauty Of Araku Valley
Follow us
Madhu

| Edited By: TV9 Telugu

Updated on: Dec 26, 2023 | 5:14 PM

విశాఖపట్నం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రసిద్ధ నగరం. ప్రకృతి వరప్రసాదం. సముద్ర తీర అందాలు, కొండలు ఎంత చూసినా తనివితీరని వర్ణాలు. అందుకే ఈ నగరాన్ని సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు. ఇక ఆంధ్రా ఊటీ అరకు. దీనిని చూడటానికి ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదు. దక్షిణ భారత దేశంలోనే మంచి టూరిస్ట్ స్పాట్ గా అరకలోయలు ప్రసిద్ధి గాంచాయి. అక్కడి కాఫీ తోటలు, ప్రకృతి రమణీయతను ఎవరైనా ముగ్ధులవ్వాల్సిందే. ఆ ప్రాంతాన్ని చూడాలంటే ఇదే సరైన సమయం. అంటే శీతాకాలం. ఇప్పుడే అక్కడి అందాలను ఆస్వాదించగలం.మీరు వైజాగ్ నగరంతో పాటు, అరకు వ్యాలీని చూడాలని భావిస్తే.. ఈ కథనం మీ కోసమే.. ఐఆర్ సీటీసీ టూరిజమ్ ఒకేసారి రెండింటిని చుట్టేసి వచ్చేలా ప్రత్యేకమైన ప్యాకేజీని అందిస్తోంది. వైజాగ్-అరకు హాలిడే ప్యాకేజీ పేరిట దీనిని ఏర్పాటు చేస్తోంది. ఎంచక్కా ఏసీ కారులో వెళ్లి, కారులో వచ్చే ఆ ప్రయాణం చాలా సుఖవంతంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

టూర్ వివరాలు ఇవి..

ప్యాకేజీ పేరు: వైజాగ్-అరకు హాలిడే ప్యాకేజీ(ఎస్సీబీహెచ్13) వ్యవధి: రెండు రాత్రులు/మూడు పగళ్లు కవరయ్యే ప్రాంతాలు: వైజాగ్, అరకులోయ ప్రయాణ తేదీ: ప్రతి రోజూ ప్రయాణ సాధనం: ఏసీ కారు

టూర సాగుతుందిలా..

  • డే1: ఉదయం 11 గంటల సమయంలో విశాఖపట్నం విమానాశ్రయం / రైల్వే స్టేషన్/బస్ స్టాండ్‌ ల నుంచి మిమ్మల్ని ఐఆర్సీటీసీ ఏర్పాటు చేసిన వాహనం పిక్ చేసుకొని హోటల్‌కు తీసుకెళ్తుంది. ఫ్రెష్ అప్ అయిన తర్వాత లంచ్ వరకు విశ్రాంతి తీసుకోవడానికి సమయం ఉంటుంది. భోజనం తర్వాత, తొట్లకొండ బౌద్ధ సముదాయం , కైలాష్ గిరి, రుషికొండ బీచ్ సందర్శన ఉంటుంది. సాయంత్రం తిరిగి హోటల్‌కి చేరుకొని అక్కడే డిన్నర్, రాత్రి బస ఉంటుంది.
  • డే2: ఉదయం 08:00 గంటలకు అల్పాహారం తర్వాత, అరకు బయలు దేరుతారు. టైడా జంగిల్ బెల్స్ (10 నిమిషాల విరామం), పద్మాపురం గార్డెన్స్ , ట్రైబల్ మ్యూజియం , లంచ్ (మీ స్వంత ఖర్చుతో), అనంతగిరి కాఫీ ప్లాంటేషన్ , గాలికొండ వ్యూ పాయింట్, బొర్రా గుహలను సందర్శిస్తారు. సాయంత్రం తిరిగి విశాఖపట్నం చేరుకొని హోటల్‌లో డిన్నర్, రాత్రి బస చేస్తారు.
  • డే3: అల్పాహారం తర్వాత, హోటల్ నుంచి చెక్ అవుట్ చేస్తారు. ఆ తర్వాత సబ్‌మెరైన్ మ్యూజియాన్ని సందర్శిస్తారు. బీచ్ రోడ్ అందాలను ఆస్వాదిస్తూ తిరిగి విశాఖపట్నం విమానాశ్రయం / రైల్వే స్టేషన్ / బస్ స్టాండ్ వద్ద డ్రాప్ చేస్తారు.

టూర్ చార్జీలు ఇలా..

  • మీరు ముగ్గురు కలిసి టూర్ ప్లాన్ చేస్తే.. హోటల్ రూంలో సింగిల్ ఆక్యుపెన్సీ అయితే మొత్తం రూ. 17,715 చార్జ్ చేస్తారు. అందే డ్యూయల్ ఆక్యుపెన్సీ అయితే రూ. 10,100, ట్రిపుల్ అయితే రూ. 7,980 చార్జ్ చేస్తారు. పిల్లలకు ప్రత్యేకమైన మంచం అవసరం లేకపోతే రూ. 2,795, ప్రత్యేకమైన బెడ్ కావాలంటే రూ. 5,915 వరకూ వసూలు చేస్తారు.
  • అదే మీరు నలుగురు నుంచి ఆరుగురు కలిసి టూర్ ప్లాన్ చేస్తే ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. హోటల్ రూమ్ లో ఇద్దరు ఉండేటట్లు అయితే రూ. 11,650, ముగ్గురు అయితే రూ. 9010 చార్జ్ చేస్తారు. పిల్లల విషయంలో ప్రత్యేకమైన బెడ్ అవసరం లేకపోతే రూ. 2795, ప్రత్యేకమైన మంచం అవసరం అయితే రూ. 6945 చార్జ్ చేస్తారు.

ప్యాకేజీలో కవర్ అయ్యేవి..

విశాఖపట్నం విమానాశ్రయం / రైల్వే స్టేషన్ / బస్ స్టాండ్ నుండి పికప్ & డ్రాప్, విశాఖపట్నంలో 02 రాత్రుల వసతి, భోజన ప్రణాళిక: అల్పాహారం, డిన్నర్, ప్రయాణం ఏసీ వాహనంలో ఉంటుంది. ప్రయాణ బీమా ఉంటుంది అయితే మధ్యాహ్న భోజనం, పర్యాటక ప్రాంతాల్లో ప్రవేశ రుసుములు, ఇతర ఖర్చులు మీరే భరించాల్సి ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..