Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kitchen Hacks: సిలిండర్‌లో గ్యాస్‌ ఎంత ఉందో ఇలా చెక్‌ చేయండి.. సింపుల్ టిప్స్‌..

మనం రోజూ ఉపయోగించుకునే నిత్యవసరాల్లో గ్యాస్ అతి ముఖ్యమైనది. గ్యాస్ లేనిదే ఏ పనీ జరగదు. కొన్ని అంటే.. కరెంట్ కుక్కర్ వంటి వాటిల్లో తయారు చేసుకోవచ్చు. కానీ ప్రతి రోజూ అంటే కష్టమే. ఖచ్చితంగా గ్యాస్ ఉండాల్సిందే. అయితే వంట చేసేటప్పుడు గ్యాస్ సడెన్ గా మధ్యలో అయిపోతుంది. దీంతో తెగ హైరానా పడి పోతూ ఉంటారు. తెలిసినవాళ్లను.. చుట్టు పక్కల వాళ్లను గ్యాస్ గురించి అడుగుతూ ఉంటారు. ఈ సమస్య నుండి బయట పడటానికి చాలా మంది రెండో గ్యాస్ బండని మెయిన్ టైన్ చేస్తూ ఉంటారు. కానీ కొన్ని మధ్య తరగతి ఫ్యామిలీస్..

Kitchen Hacks: సిలిండర్‌లో గ్యాస్‌ ఎంత ఉందో ఇలా చెక్‌ చేయండి.. సింపుల్ టిప్స్‌..
Gas Cylinders
Follow us
Chinni Enni

| Edited By: TV9 Telugu

Updated on: Dec 26, 2023 | 7:23 PM

మనం రోజూ ఉపయోగించుకునే నిత్యవసరాల్లో గ్యాస్ అతి ముఖ్యమైనది. గ్యాస్ లేనిదే ఏ పనీ జరగదు. కొన్ని అంటే.. కరెంట్ కుక్కర్ వంటి వాటిల్లో తయారు చేసుకోవచ్చు. కానీ ప్రతి రోజూ అంటే కష్టమే. ఖచ్చితంగా గ్యాస్ ఉండాల్సిందే. అయితే వంట చేసేటప్పుడు గ్యాస్ సడెన్ గా మధ్యలో అయిపోతుంది. దీంతో తెగ హైరానా పడి పోతూ ఉంటారు. తెలిసినవాళ్లను.. చుట్టు పక్కల వాళ్లను గ్యాస్ గురించి అడుగుతూ ఉంటారు. ఈ సమస్య నుండి బయట పడటానికి చాలా మంది రెండో గ్యాస్ బండని మెయిన్ టైన్ చేస్తూ ఉంటారు. కానీ కొన్ని మధ్య తరగతి ఫ్యామిలీస్ ఇది సాధ్యం కాదు. అలాంటి గ్యాస్ అయిపోతుందో లేదో ముందుగానే చెక్ చేసుకోవచ్చు.

సిలిండర్ స్ట్రాంగ్ గా ఉండటానికి కారణం ఇదే..

గ్యాస్ సిలిండర్ అధిక పీడనాన్ని తట్టుకోవడానికి, గ్యాస్ ను నిల్వ చేయడానికి, నియంత్రించడానికి అధిక కార్బన్ స్టీల్, మాంగనీస్ స్టీల్ లేదా అల్యూమినియం మిశ్రమంతో తయారు చేస్తారు. అందుకే గ్యాస్ బండ స్ట్రాంగ్ గా ఉంటుంది. గ్యాస్ సిలిండర్ లో గ్యాస్ ఎంత ఉందో కొంత మంది పైకి లేపి చూస్తారు. కానీ ఇది అందరికీ సాధ్యం కాదు. అలాగే అంతగా అంచనా కూడా వేయలేం. ఈ సారి ఈ చిట్కా ట్రై చేసి.. ముందుగానే గ్యాస్ ను బుక్ చేసుకోవచ్చు.

తడి బట్టతో..

ఒక టవల్ లేదా ఏదో ఒక మెత్తని క్లాత్ తీసుకుని బాగా తడిపి.. సిలిండర్ చుట్టూ చుట్టాలి. కొంత సమయం తర్వాత సిలిండర్ ని పరిశీలించండి. తడి బట్ట తీసేసి.. చూస్తే కొంత భాగం చల్లగా.. మరి కొంత భాగం పొడిగా ఉంటుంది. తడిగా ఉన్న ప్రాంతం అంతా గ్యాస్ ఉన్నట్టు.. పొడిగా ఉంటే గ్యాస్ లేని ప్రాంతం అని గుర్తించవచ్చు. ఆ తడి భాగం కూడా ఎండిపోవడం జరిగితే మాత్రం.. గ్యాస్ అయిపోయినట్టు అనుకోవాలి. ఈ ట్రిక్ ని రెండు, మూడు రోజులకు ట్రై చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

మరో చిట్కా..

ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని.. గ్యాస్ అంచున పోయండి. నీరు పోసిన ప్రాంతంలో చేయి పెట్టి చూస్తే.. కొంత భాగం వేడి.. మరి కొంత భాగం చల్లగా ఉంటుంది. చల్లగా ఉన్న ప్రాంతంలో గ్యాస్ ఉన్నట్టు లెక్క. కేవలం గోరు వెచ్చటి నీరు మాత్రమే ఉపయోగించుకోవాలి. ఇలా ఈ చిట్కాలతో గ్యాస్ ను తెలుసుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..