IRCTC Tour: తిరుపతి టూర్‌ ప్లాన్‌ చేస్తున్నారా.? IRCTC నుంచి బడ్జెట్‌ ప్యాకేజీ..

గోవిందం పేరుతో ఐఆర్‌సీటీసీ ఈ టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది. తక్కువ ధరలో ప్రయాణికులకు అన్ని రకాల సౌకర్యాలతో ఈ టూర్‌ను రన్‌ చేస్తోంది. 2 రాత్రులు, మూడు రోజులు ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. హైదరాబాద్‌ నుంచి తిరుపతికి ప్రతీ రోజూ ఈ టూర్‌ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఇంతకీ ఈ టూర్‌ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్ అవుతాయి.? ప్యాకేజీ ధరకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

IRCTC Tour: తిరుపతి టూర్‌ ప్లాన్‌ చేస్తున్నారా.? IRCTC నుంచి బడ్జెట్‌ ప్యాకేజీ..
Irctc Tirupati
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 29, 2023 | 7:22 PM

ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ ప్రయాణికుల సౌకర్యార్థం పలు రకాల ప్యాకేజీలు అందిస్తోన్న విషయం తెలిసిందే. ప్రముఖ పుణ్య క్షేత్రాలు మొదలు ప్రకృతి రమణీయ ప్రదేశాల వరకు అన్ని రకాల టూర్‌ ప్యాకేజీలను అందిస్తోంది. ఇందులో భాగంగానే తిరుమల శ్రీవారి భక్తుల కోసం ఓ సూపర్ ప్యాకేజీని అందిస్తోంది.

గోవిందం పేరుతో ఐఆర్‌సీటీసీ ఈ టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది. తక్కువ ధరలో ప్రయాణికులకు అన్ని రకాల సౌకర్యాలతో ఈ టూర్‌ను రన్‌ చేస్తోంది. 2 రాత్రులు, మూడు రోజులు ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. హైదరాబాద్‌ నుంచి తిరుపతికి ప్రతీ రోజూ ఈ టూర్‌ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఇంతకీ ఈ టూర్‌ ప్యాకేజీలో ఏయే ప్రాంతాలు కవర్ అవుతాయి.? ప్యాకేజీ ధరకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

* గోవిందం పేరుతో ట్రైన్‌ టూర్‌ ప్యాకేజీని అందిస్తున్నారు. SHR084 ప్యాకేజీ కోడ్ పేరుతో టూర్‌ను ఆపరేట్ చేస్తున్నారు.

* ప్యాకేజీలో భాగంగా తొలి రోజు సాయంత్రం 18.25 గంటలకు లింగంపల్లి రైల్వే స్టేషన్‌ నుంచి ట్రైన్ నెంబర్‌ 12734 బయలుదేరుతుంది. సికింద్రాబాద్‌ స్టేషన్‌కు 19.05 గంటలకు, నల్లగొండ స్టేషన్‌కు 20.35 గంటలకు చేరుకుంటుంది. రాత్రంతా ప్రయాణం ఉంటుంది.

* రెండో రోజు ఉదయం 6.55 గంటలకు తిరుపతి రైల్వేస్టేషన్‌ చేరుకుంటారు. రైలు దిగిన వెంటనే హోటల్‌కు తీసుకెళ్తారు. హోటల్‌లో ఫ్రెషప్‌ అయిన తర్వాత బ్రేక్‌ ఫాస్ట్‌ ఉంటుంది. అనంతరం హోటల్‌ నుంచి చెకవుట్ అయిన తర్వాత 9.00 గంటలకు తిరుమలు చేరుకుంటారు. అక్కడ తిరుమల శ్రీవారి స్పెషల్‌ ఎంట్రీ దర్శనం ఉంటుంది. తర్వాత భోజనం కోసం సమయం కేటాయిస్తారు. అనంతరం సాయంత్రం 18.20 గంటలకు రిటర్న్‌ ట్రైన్‌ ఉంటుంది.

* రాత్రంతా జర్నీ తర్వాత మూడో రోజు ఉదయం సికింద్రాబాద్‌కు 5.35 గంటలకు చేరుకుంటారు. లింగంపల్లిలో 6.55గంటలకు ట్రైన్‌ దిగుతారు.

ప్యాకేజీ ధర విషయానికొస్తే..

కంఫర్ట్‌ 3ఏ క్యాటగిర సింగిల్‌ షేరింగ్‌కు రూ. 6790, ట్విన్‌ షేరింగ్‌కు రూ. 5660, ట్రిపుల్‌ షేరింగ్‌కు రూ. 5660, చైల్డ్‌ విత్‌ బెడ్‌ రూ. 4750గా నిర్ణయించారు. ఇక స్టాండర్స్‌ విషయానికొస్తే.. సింగిల్‌ షేరింగ్‌కు రూ. 4940, ట్విన్‌ షేరింగ్‌కు రూ. 3800, చైల్డ్‌ విత్ బెడ్‌కు రూ. 2890గా నిర్ణయించారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..